ప్రధాన విశ్వాసం (అఖీదా)
ఇస్లాం ఒక విశ్వాసం, ఈ విశ్వాసమే ధర్మం యొక్క పునాది, ఇస్లాం యొక్క విశ్వాసం చాలా స్పష్టమైనది, అర్ధం చేసుకోవడంలో అత్యంత తేలికైనది, బుద్ధిమంతులకు మరియు సరైన నైజం కలవారికి అనుకూలమైనది.
ఉప అంశాలు
రెండు సాక్ష్యాలు
ఏకత్వాన్ని సూచించే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అనబడే ఈ ప్రాధమిక విశ్వాస వచనాని(కలిమ)కి ఇస్లాం అత్యున్నత స్థానం ఇచ్చి ఉన్నది, ఈ కారణంగానే ఒక వ్యక్తి సత్యధర్మమైన ఇస్లాం లో ప్రవేశించాలంటే ఈ వచనాన్ని సంపూర్తిగా విశ్వసించాలి మరియు నోటితో ఉచ్చరించాలి. మనస్పూర్తిగా విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ఉచ్చరించిన వ్యక్తికి ఇది అతనికి నరకం విముక్తికి కారణం అవుతుంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ దైవ ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : “అల్లాహ్ యొక్క సంతుష్ఠత కోరుకుంటూ “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికిన వ్యక్తి పై అల్లాహ్ నరకాగ్నిని నిషేదించాడు. (బుఖారీ - 415)
విశ్వాసం
దైవప్రవక్తలందరూ కూడా తమ ప్రజలకు ఒకే రకమైన సందేశాన్నిఅందిస్తూ వచ్చారు, అదేమంటే ఏ భాగస్వాములూ లేని ఏకైకుడైన ఆ అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు ఆయన తప్ప ఇతర ఆరాధించబడేవాటిని విశ్వసించకండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క యదార్ధం ఇదే, ఈ వాక్యం ద్వారానే ఒక వ్యక్తి దైవధర్మంలో ప్రవేశిస్తాడు.
ఆరాధన
ఆరాధన అనేది సృష్టికర్త అయిన అల్లాహ్ పట్ల పూర్తి విధేయత, ప్రేమ, గౌరవం, మరియు వినయం కలిగి ఉండడం. ఇవి కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన హక్కులు, అల్లాహ్ తో పాటు మరెవరికీ సాటి కల్పించకూడదు. అల్లాహ్ ఆదేశించిన, ప్రోత్సహించిన మాటలు, ఆచరణలు, అతనికి ఇష్టమైనవి, ఆమోదయోగ్యమైనవన్నీ ఈ ఆరాధనలో భాగమే. ఉదాహరణకు బాహ్య ఆచరణలు; నమాజు, జకాతు హజ్ వగైరా. అంతర్గత ఆచరణలు : మనస్సులోఅల్లాహ్ యొక్క స్మరణ, ఆయన పట్ల భయభక్తులు, ఆయనపై నమ్మకం, ఆయనతో సహాయం అర్ధించడం వగైరా.