ప్రయాణానికి సంబందించిన నియమావళి
ఇస్లాం ఒక జీవన ధర్మం, ఇది మనిషి యొక్క అన్ని స్థితులతోనూ ముడిపడి ఉంది. అతను నివసిస్తున్నా లేదా ప్రయాణిస్తున్నా, నిలకడగా ఉన్నా లేదా కదలికలో ఉన్నా, గంభీరంగా ఉన్నా లేదా వినోదంలో ఉన్నా ఇస్లాం మార్గనిర్దేశం చేస్తుంది. ప్రయాణాలు సామాజిక జీవితంలో ఒక భాగం. అల్లాహ్ మన నుండి కోరుకునే కొన్ని పనులను మనం గుర్తుంచుకుని ఆచరించడానికి లేదా అల్లాహ్ మనల్ని వేటినైతే నివారించమని కోరుతున్నాడో వాటిని వదిలివేయడానికి సంబంధించిన నియమాలు ఈ ప్రయాణాలలో కూడా ఉంటాయి. అల్లాహ్ అనుగ్రహిస్తే ఈ విభాగంలో మనం ప్రయాణాలకు సంబంధించిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.