నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం ప్రయాణ సమయంలో సాధారణ నియమ నిబంధనలు పెరుగుతాయి

ప్రయాణం మరియు ప్రయాణాలకు సంబంధించిన ఆదేశాలు నమాజు మరియు ఉపవాసంతో ఆగవు, ఎందుకంటే వాటి ప్రత్యేక నియమాలు ఉన్న ఇతర పరిస్థితులు కూడా ఉంటాయి . ఈ పాఠంలో మీరు వాటిలో కొన్నింటిని నేర్చుకుంటారు.

ప్రయాణాలలో తరచుగా అవసరమైన సాధారణ నిబంధనలు ఎక్కువగా ఉంటాయి 

నిద్రకు ఉపక్రమించే సమయంలో మంటను ఆర్పివేయడం

నిద్రకు ఉపక్రమించడానికి ముందు తప్పక చేయవలసినవి : శీతాకాలపు ప్రయాణాలలో తరచుగా వెలిగించబడే మంటను ఆర్పివేయాలి, ప్రత్యేకించి గుడారాలు లేదా అటువంటి వాటిలో.

అబూ మూసా అల్ అష్ అరీ వారి ఇలా సెలవిచ్చారు : మదీనా నగరంలో ఒక ఇల్లు ఇంటివాసులతో సహా మంటల్లో కాలిపోయినది. ఈ సంఘటనతో దైవ ప్రవక్త (స) వారు ఇలా ప్రబోధించారు : ఈ అగ్ని మీకు ఒక శత్రువు, మీరు నిద్రకు ఉపక్రమించే మునుపు మీరు వెలిగించి ఉన్న నిప్పును ఆర్పీ వేయండి (బుఖారీ 6294, ముస్లిం 2016) మరో హదీసులో ఇలా ప్రస్తావించబడినది: నిద్రించే సమయంలో మీ ఇళ్లలో మంటలను వదిలివేయవద్దు. (బుఖారీ 6293, మరియు ముస్లిం 2015). బహుశా ఆ ఇంటిలో ఒక చెడ్డ ప్రాణి (ఎలుక) ఆ దీపపు ఒత్తిని అక్కడ నుండి లాగి ఇంటివాసులను తగులబెట్టేసినది. (బుఖారీ 3316, ముస్లిం 2012)

వేటకు సంబందించిన నియమాలు

ప్రాధమిక లేక మౌలిక నియమానుసారంగా వేటాడటం అనేది ధర్మబద్ధమే. అయితే, అది మమ్ములను ధార్మిక విధులు నిర్వర్తించడం నుండి మరియు కుటుంబం నుండి దూరం చేసేంతగా ఆకర్షించకూడదు. అలాగే, వృథా, ఆట, గొప్పతనం కోసం వేటాడటం కూడా ధర్మబద్ధం కాదు. ఒక హదీసులో ఇలా సెలవివ్వబడినది: " ఎడారిలో నివసించేవాడు కఠినంగా మారతాడు, వేటను అనుసరించేవాడు నిర్లక్ష్యంగా మారతాడు" (అబూ దావూద్ 2859).

ప్రత్యేకంగా నిషేధించబడినవి మినహా అన్ని జంతువులను వేటాడటం మరియు వాటి మాంసాన్ని తినడం అనేది ప్రాధమిక సూత్రం. నిషేధించబడిన జంతువులలో ఉదాహరణకు: నక్కలు, తోడేలు వంటి కొరలు కలిగి ఉండే క్షీరదాలు, పదునైన పంజాలు కలిగిన పక్షులు ఉదాహరణకు: డేగలు, గ్రద్దలు వంటివి, అలాగే పాములు వంటి విషపూరిత జంతువులు వగైరా.

పక్షులు, జంతువులు వంటి భూమి, సముద్ర జీవులను ఏడాది పొడవునా వేటాడటం ధర్మబద్ధమే. శుక్రవారం, రంజాన్ నెల, పవిత్ర నెలలు లేదా ఇతర సమయాలతో సంబంధం లేకుండా ఈ విషయంలో ఎటువంటి తేడా లేదు. అయితే, మక్కా, మదీనాలోని హరమ్(నిషిద్ద) ప్రాంతాలలో వేటాడటం నిషిద్ధం. అలాగే, ఇతరులకు చెందిన జంతువులను వేటాడటం కూడా నిషిద్ధం. అంతేకాకుండా, హజ్ లేదా ఉంరాలో ఎహ్రాం స్థితిలో ఉన్నపుడు భూచర జీవులను వేటాడటం నిషిద్దం.

వేటాడే వ్యక్తి ముస్లిం(విశ్వాసి) అయి ఉండాలి, అల్లాహ్ పేరును స్మరించాలి, మరియు వేటకు శిక్షణ పొందిన కుక్కలు లేదా పక్షులను ఉపయోగించాలి. పక్షి స్వయంగా ఎగిరిపోయినా లేదా అతనికి తెలియకుండా బుల్లెట్ పేలినా, జంతువు చనిపోయే ముందు దానిని పట్టుకోకపోతే, దాని మాంసం తినడానికి అనుమతి లేదు.

జంతువు చనిపోవడానికి కారణం గాయం (బాణం, కత్తి వంటి వాటితో ) మాత్రమే అయి ఉండాలి. దాని గొంతు నుమిలేయడం, నీటిలో ముంచేయడం, బరువైన వస్తువుతో కొట్టడం లేదా ఎత్తైన ప్రదేశం నుండి పడేయడం వంటివి చేయకూడదు. జంతువు చనిపోకుండా బ్రతికి ఉంటే, దానిని ధార్మిక పద్ధతిలో జబహ్ చేయాలి.

వినోదం కోసం జంతువులను చంపడం నిషిద్ధం. ఉదాహరణకు, వేటాడి, మాంసం తినకుండా వదిలేయడం. అలాగే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు వేటాడే పరికరాలను ఉపయోగించడం కూడా నిషిద్ధం. అదేవిధంగా, వేట సాధన కోసం పక్షులను బంధించడం కూడా ఒక పాపం.

ఒకసారి ఇబ్న్ఉమర్ (ర)వారు ఖురైష్ యువకుల సమూహం దగ్గరగా వెళ్లారు. వారు ఒక పక్షిని (వినోదానికి) లక్ష్యంగా చేసుకుని, దానిపై బాణాలు విసురుతున్నారు. వారు తప్పిన ప్రతి బాణాన్ని పక్షి యజమాని స్వాధీనం చేసుకుంటాడు. ఇబ్న్ ఉమర్‌(ర)ను చూడగానే వారందరూ చెల్లాచెదురుగా పారిపోయారు. అప్పుడు ఇబ్న్ ఉమర్(ర) వారు ఇలా ధర్మాగ్రహం వెలుబుచ్చారు: "ఇది ఎవరి పని? ఇలా చేసిన వారిపై అల్లాహ్ యొక్క శాపం తగులుగాక. “ప్రాణం ఉన్న ఏ జీవినైనా సరే లక్ష్యంగా చేసుకునేవారిని ప్రవక్త(స) వారు శపించారు. (బుఖారీ 5515, ముస్లిం 1958)

ఆయుధాలతో ఇతరులను ఎక్కుపెట్టి చూపడం నిషిద్దం, ఇది ప్రమాదకరమైన చర్య. కేవలం పరిహాసముగా కూడా ఇలా చేయకూడదు. హదీసులో ఈ విధంగా సెలవివ్వబడినది: "మీలో ఎవరూ కూడా తన సోదరుడికి ఆయుధాన్ని ఎక్కుపెట్టి చూపించవద్దు. ఎందుకంటే, బహుశా ఆ సమయంలో షైతాన్ అతని చేతిలో దుష్టత్వాన్ని కలిగించవచ్చు, దానితో అతడు అగ్ని గుండములో పడిపోయే ప్రమాదం ఉంది." (బుఖారీ 7072, ముస్లిం 2617). మరో హదీసులో ఇలా ఉన్నది : "ఎవరైనా తన సోదరుడి వైపు ఇనుప ఆయుధం ఎక్కుపెట్టితే, అతను దానిని వదిలివేసే వరకూ దైవదూతలు అతనిని శపిస్తుంటారు. అతను తన తండ్రి మరియు తల్లి ద్వారా అతని సోదరుడు అయినా సరే." (ముస్లిం 2616)

వేటాడాలనుకునే వారికి వేటకు సంబందించిన నియమాలు, రక్షణ చర్యల గురించి తెలిసి ఉండాలి, తద్వారా వారు తమను తాము మరియు ఇతరులను రక్షించుకోగలరు. ధార్మిక విధానంలో జంతువును జబహ్ చేయడం, వేట కుక్కలను నిర్వహించడం, జంతువు చనిపోయే పరిస్తితి తలెత్తడం వంటి ఇతర విషయాలకు సంబంధించిన ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. ఈ విషయాలలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే గనక ధర్మ పండితులను సంప్రదించాలి.

ఆహార పదార్థాల గురించిన నియమాలు

ఆహార పదార్థాల విషయంలో, ప్రాథమిక సూత్రం ఏమిటంటే, నిషిద్ధం అని స్పష్టమైన ఆధారాలు ఉన్న ఆహారాలను మినహాయించి, మిగిలినవన్నీ అనుమతించబడినవి (హలాల్).

నిషిద్ధ ఆహార పదార్ధాలు మరియు పానీయాలు

١
మృత పశువు మరియు దాని ఉద్పాదకాలు
٢
వరాహం (పంది)
٣
మద్యం మరియు మత్తుపదార్ధాలు : ఎక్కువగా తీసుకోవడం వలన మత్తు కలిగించే వాటిని తక్కువగా తీసుకోవడం కూడా నిషిద్దం(హరాం)
٤
శరీరానికి హాని కలిగించే అంశాలు కలిగి ఉండేవి
٥
పంజాలు లేదా కోరలు కలిగిఉండి వేటాడే జంతువులు లేదా పక్షులు. ఉదాహరణకు : సింహం, కుక్క, పిల్లి, డేగ, గ్రద్ద వగైరా.
٦
దొంగిలించిన మరియు దోచుకున్న ఆహార పదార్ధాలు

అడవిలో లేదా మార్కెట్లలో లభించే అన్ని మొక్కలు మరియు పండ్లు తినడానికి అనుమతి ఉంది. అయితే, తనకు హాని కలిగించే లేదా అది అతనికి సురక్షితమైనదా కాదా అని స్పష్టంగా తెలియని వాటిని వినియోగించకూడదు.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి