ప్రవక్త(స) వారి సున్నతు
ఇస్లాం యొక్క ప్రధాన ఆధారం అయిన ఖురానుతో పాటుగా ప్రవక్త (స) వారి సున్నతును కూడా అల్లాహ్ తన దైవవాణి ద్వారానే అందజేశాడు, ఇవి రెండూ కూడా ఇస్లాం యొక్క విడదీయలేని రెండు ముఖ్య మూలాధారాలు. ఇస్లాంను విశ్వసించడంలో మనం ఇచ్చే రెండు కీలక సాక్ష్యాలలో (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేదు మరియు ముహమ్మద్ (స) అల్లాహ్ యొక్క సందేసహరులు) అల్లాహ్ తో పాటుగా దైవప్రవక్త (స)ను విశ్వసించడం కూడా ఒకటి, సున్నతును తిరస్కరించినవాడు ఖురానును కూడా తిరస్కరించినవాడవుతాడు.