ఆరాధనలు
ఖుర్ఆన్ మరియు ప్రవక్త(స)వారి హదీసుల ఆధారంగా ఆరాధనలను మరియు ఆరాధనల నియమాలను లోతుగా అర్థం చేసుకోవడానికి మరియు వాటిని సరిగ్గా నిర్వహించడానికి ఈ విభాగం సహాయపడుతుంది.ఇస్లామీయ ధార్మిక నియమావళిలోని ఈ విభాగం, నమాజు, ఉపవాసం, జకాత్, హజ్ వంటి వివిధ మౌలిక ఆరాధనలఅంశాలనుకలిగి ఉంటుంది మరియు ఖుర్ఆన్ మరియు ప్రవక్త(స)వారి హదీసుల నుండి పొందిన ఆధారాల ఆధారంగా వాటి నియమాలను వివరిస్తుంది.
ఉప అంశాలు
సుచీశుభ్రత
అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క సాక్ష్యం (కలిమా) తరువాత నమాజు అనేది ఇస్లాం యొక్క రెండవ మూలస్థంబము, అయితే శుద్ధత(తహారా) లేకుండా నమాజు అనేది స్వీకరింపబడదు, కావున నమాజు చెల్లుబాటు కావడానికి ముందుగా శుద్ధత గురించిన నిబంధనలను తెలుసుకోవడం ఉత్తమం.
నమాజు
నమాజ్ అనేది ధర్మానికి మూలస్తంభం వంటిది మరియు ఆరాధనలలో అన్నింటికంటే ముందుగా నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం. ఇది కలిమా (షహాదతైన్) తర్వాత ఇస్లాం ధర్మంలోని రెండవ మూలస్థంభం. నమాజ్ నిర్వర్తించకుండా ఒక వ్యక్తి యొక్క ఇస్లాం పరిపూర్ణం కాదు.
విధిదానం (జకాతు)
జకాత్ ఇస్లాం యొక్క మూడవ మూల స్తంబము. బీదలకు, దీనులకు జకాత్ చెల్లించడం అనేది ధనికులపై అల్లాహ్ విధిగావించాడు, జకాతు ఇచ్చే వారు మరియు తీసుకునే వారు ఇరువురినీ శుద్ధి పరచడానికి అల్లాహ్ జకాతును విధిగావించాడు, దీని వలన ధనంలో తగ్గుదల కనిపించినప్పటికీ దీని కారణంగా అల్లాహ్ ఆ ధనములో మరియు శుభాలలో పెరుగుదలను నోసంగుతాడు. అలాగే ఇది విశ్వాసములో కూడా వృద్ధికి దోహదం చేస్తుంది.
ఉపవాసం
రమదాన్ ఉపవాసం ఇస్లాం ధర్మ మూలస్తంభాలలో నాలుగవది. ఉపవాసం అనేది ఒక అత్యున్నతమైన ఆరాధన. సకల శుభాలకు మూలమైన దైవభీతి(తఖ్వా )ని పెంపొందించుకోవడానికి, అల్లాహ్ దీనిని పూర్వపు విశ్వాస సమాజాలపై విధిగా నిర్ణయించినట్లే, ముస్లిములపై కూడా విధిగా నిర్ణయించాడు.
హజ్
హజ్ అనేది ఇస్లామ్ యొక్క ఐదవ మూల స్తంబము, స్తోమత ఉన్న విశ్వాసి తన జీవితంలో ఒక్క సారి తప్పనిసరిగా హజ్ చేయాలి
జీవన్మరణాలు
మరణం అనేది అంతం కాదు, అది మానవునికి ఒక కొత్త దశ మరియు పరలోకంలో సంపూర్ణ జీవితానికి నాంది.మనిషి పుట్టినప్పటి నుండి హక్కులను పరిరక్షించడంపై ఇస్లాం శ్రద్ధ చూపినట్లే, మృతుని హక్కులను కాపాడే మరియు అతని కుటుంబం మరియు బంధువుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకునే నియమాలను కూడా నొక్కి చెప్పింది.