సందర్భానుసార విషయాలు
మనిషికి మేలు చేసే ప్రతి విషయం ఇస్లాంలో ఇమిడి ఉన్నది, సర్వ జనులకోసం అవతరించిన ఈ సందేశం మనిషి ఏ కాలంలో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా దానికి తగినటువంటిది మరియు అనుగుణమైనది, ఈ రాబోయే పాఠ్యాంశాములో విభిన్న సందర్భాలలో, విభిన్న పరిస్థితుల్లో అవసరమయ్యే అంశాల గురించి ఇస్లాం ఇచ్చే మార్గదర్శకాల గురించి ఎంపిక చేయబడిన అంశాలు ఉన్నాయి.
ఉప అంశాలు
శీతాకాలానికి సంబందించిన నియమనిబంధనలు
ఇస్లాం ఒక సమగ్రమైన మరియు విశాలమైన ధర్మము,అది జీవితాన్నంతటిని దాని సృష్టికర్తతో అనుసంధానించబడిన జీవన విధానాన్ని అందిస్తుంది, దీనిలోని ప్రతి మార్గదర్శం ఒక విజ్ఞతతో కూడుకుని ఉంటుంది, ఒక విశ్వాసికి ప్రతి సమయం ఒక ఆరాధనయే, ఈ ఆరాధన అనేది దానికి సబందించిన పలు అవసరాలకు, పరిస్తితులకు దారి తీస్తుంది, శీతాకాలములో నమాజు, సూచీశుభ్రత, దుస్తులు, వర్షం కారణంగా ఏర్పడే పరిస్థితులు వంటి పరిస్తితులకు సంబందించి కొన్ని ధార్మిక నియమనిబందనలు ఉంటాయి, ఈ విభాగములో వాటి గురించి చర్చిద్దాము.
ప్రయాణానికి సంబందించిన నియమ నిబంధనలు
ఇస్లాం అనేది జీవితానికి ఒక మార్గదర్శి, అది మనిషి జీవితానికి సంబందించిన అన్ని పరిస్థితులతో, విషయాలతో ముడిపడి ఉంటుంది. అతడి ప్రయాణాలు, విశ్రాంతి, కార్యకలాపాలు, ఆనందం మరియు వినోదం వగైరా. ఇవన్నీ సామాజిక జీవితంలో భాగమే. ప్రయాణాలు చేసే సందర్భంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అల్లాహ్ మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో మనకు దిశానిర్దేశికం చేశాడు. ఈ యూనిట్లో మనంప్రయాణాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను గురించి తెలుసుకుందాము.
అంటువ్యాధులు మరియు వ్యాధులు
ఆపదలు,అంటువ్యాధులు అనేవి అల్లాహ్ యొక్క ఒక విధి. ఇవి విశ్వాసులు, అవిశ్వాసులు అనే తేడా లేకుండా అందరిపై దిగుతాయి. అయితే, వీటిని ఎదుర్కోవడంలో ఒక విశ్వాసి యొక్క పరిస్థితి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. అల్లాహ్ ఆదేశానుసారం అతడు ఈ పరిస్థితుల్లో సహనం మరియు ఓపికతో ఉంటాడు, విశ్వాస బలంతో వాటిని ఎదుర్కొంటాడు మరియు వ్యాధి రాకుండా ముందుగానే దానిని నివారించడానికి తగిన మార్గాలను అనుసరించడం, ఒకవేళ వస్తే దాని నుండి కోలుకోవడానికి చికిత్స చేయించుకోవడం వంటివి కూడా చేస్తాడు.