ప్రస్తుత విభాగం : model
పాఠం దైవప్రవక్త (స) వారి గురించిన అవగాహన
మన ప్రవక్త (స) వారి పేరు
ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం అల్ ఖరషి వంశం అనేది అరబ్బు వంశాలలో కెల్లా ఉన్నతమైన వంశము
అల్లాహ్ ఈ ప్రపంచంలోని సర్వ మానవాళిలోని సమస్త జాతులు, వర్గాల వైపుకు ప్రవక్తగా నియమించి పంపాడు, మానవులందరికీ ప్రవక్త పట్ల విశ్వాసాన్ని మరియు విధేయతను తప్పనిసరి చేశాడు. దీని గురించి తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను.
తన గ్రంధాలలోకెల్లా గొప్ప గ్రంధాన్ని ముహమ్మద్ (స) పై అవతరింపజేశాడు, అసత్యం దాని (ఖుర్ఆన్) ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ దాని పైకి రాజాలదు.
ప్రవక్తలందరిలో చిట్టచివరి ప్రవక్తగా ముహమ్మద్ (స) వారిని అల్లాహ్ నియమించాడు, వారి తరువాత ఏ ప్రవక్తా రాడు. దీని గురించి తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు”. (అల్ అహ్ జాబ్)
1. వారి (స) పుట్టుక
(చరిత్రలో) ఏనుగుల సంవత్సరం అనబడే క్రీస్తు శకం 571 న మక్కా నగరంలో తండ్రిలేని అనాధగా జన్మించారు, వారు కడుపులో ఉండగానే వారి తండ్రి చనిపోయారు, అలాగే వారి వయసు 6 సంవత్సరాలు ఉండగా తన తల్లిని కూడా కోల్పోయారు, దానితో వారి తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ దగ్గర మరియు ఆ తరువాత వారి బాబాయి అబూ తాలిబ్ దగ్గర పెరిగారు.
ప్రవక్తగా నియమించబడక ముందు 40 సంవత్సరాల పాటు, ప్రవక్త ముహమ్మద్ (స) తన ఖురైష్ తెగలోని మక్కాలోనే నివసించారు. వారి నిజాయితీ, నమ్మకం, దయ, న్యాయం వంటి గుణాలకు "అల్-అమీన్" (నమ్మకమైనవాడు) అని పేరుగాంచారు. ఆ సమయంలో ప్రవక్తవారు(స) మేకలను మేపేవారు లేదా వ్యాపారం చేసేవారు. ఇస్లాంకు ముందు ప్రవక్త(స)వారు, ప్రవక్త ఇబ్రహీం(ఆ) వారి పద్ధతి ప్రకారం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు మరియు బహుదైవారాధనకు దూరంగా ఉండేవారు.
ప్రవక్త ముహమ్మద్ (స) వారి 40 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత, జబల్ అల్ నూర్ పర్వతంలోని హిరా గుహలో ఆరాధన, మరియు చింతనలో ఉండేవారు. అలాంటి ఒక రాత్రిలో, జిబ్రయీల్ (అ) ద్వారా అల్లాహ్ నుండి దైవసందేశ (వహీ) అవతరణ జరగడం ప్రారంభమయినది, ఈ సందర్భంగా ఖురాను యొక్క మొట్టమొదటి దివ్య వాక్యము అవతరించినది : “చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు” (అల్ అలక్: 1). వివిధ దశల్లో 23 సంవత్సరాల పాటు ఖుర్‌ఆన్ అవతరణ జరిగింది. దైవగ్రంధమైన ఖురాను జనుల విశ్వాసాలను, ప్రవర్తనలను రూపొందించడంలో ఇస్లాం యొక్క ధార్మిక నియమాల పునాదులను నిర్మించినది.
4. ప్రవక్త (స) వారి ఇస్లాం వైపుకు ఆహ్వానం యొక్క ఆరంభం
దైవప్రవక్త(స)వారు మొదటి మూడు సంవత్సరాలపాటు జనులను రహస్యంగా ధర్మం వైపుకు ఆహ్వానించారు, ఆ తరువాత మరో పదేళ్లపాటు బహిరంగంగా ఆహ్వానించారు, దీని ఫలితంగా ఖురైష్ వారి తరపున దైవప్రవక్త (స) మరియు వారి అనుచరులు కఠినమైన అణచివేతను, తీవ్రమైన హింసను ఎదుర్కున్నారు, దానితో హజ్ కాలంలో మక్కాకు వచ్చే పలు తెగల వారికి ఇస్లాంను పరిచయం చేసేవారు, దానితో మదీనావాసులు ఇస్లాం స్వీకరించారు, ఇక్కడి పరిస్థితుల కారణంగా విశ్వాసులు మదీనావైపుకు వలసవెళ్లడం మొదలుపెట్టారు.
5. ప్రవక్త (స) వారి వలస
దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు, వారి వయసు 53 సంవత్సరాలు ఉన్నపుడు, క్తీ.శ622వ సంవత్సరంలో మదీనా నగరానికి (అప్పటి యత్రిబ్) వలస వెళ్లారు. ఇస్లాం ప్రబోధాన్ని వ్యతిరేకించి, వారి(స)ని చంపాలని ప్రయత్నించిన ఖురైష్ నాయకులు ఆయనపై కుట్ర పన్నిన తరువాత వారు(స) మదీనాకు వలస వెళ్ళారు. మదీనాలో పది సంవత్సరాలు నివసించారు, జనులను ఇస్లాం వైపుకు ఆహ్వానించారు, నమాజ్, జకాత్ (విధిదానం) మరియు ఇతర ఇస్లాలమీయ ధార్మిక నియమాల అనుసరణకు ఆదేశించారు.
దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు 622వ సంవత్సరంలో మదీనాకు వలస వెళ్ళిన తరువాత, ఇస్లామీయ నాగరికత మరియు ముస్లిం సమాజం యొక్క పునాదులను వేశారు, జాత్యహంకారాన్ని రూపుమాపి, విద్యను వ్యాప్తి చేశారు, న్యాయం, నిజాయితీ, సోదరభావం, సహకారం యొక్క సూత్రాలను స్థాపించారు. కొందరు ఇస్లాంను నాశనం చేయడానికి ప్రయత్నించారు, దీని కారణంగా అనేక యుద్ధాలు జరిగాయి. చివరికి, అల్లాహ్ తన ధర్మాన్ని మరియు దైవప్రవక్తను విజయం వైపుకు నడిపించాడు. ఆ తరువాత ప్రజలు ఒక్కొక్కరిగా ఇస్లాంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. చివరికి, మక్కా మరియు అరేబియా ద్వీపకల్పంలోని చాలా నగరాలు మరియు తెగలు ఈ గొప్ప ధర్మాన్ని స్వీకరించి ఇస్లాంలోకి ప్రవేశించాయి.
హిజ్రీ సంవత్సరం 11, సఫర్ నెలలో, ప్రవక్త ముహమ్మద్ (స) వారు అనారోగ్యానికి గురై జ్వరం బారిన పడ్డారు. అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు అందించడం, తనకు అప్పగించబడిన బాధ్యతలను నెరవేర్చడం, ధర్మాన్నిపరిపూర్ణం చేయడం ద్వారా వారు(స) మానవాళిపై తన బాధ్యతను పూర్తి చేశారు. అదే అనారోగ్యంతో, హిజ్రీ సంవత్సరం 11, రబీఉల్-అవ్వల్ నెల 12వ రోజైన సోమవారం, క్రీస్తుశకం 632 ఆగస్టు 6న వారు(స) మరణించారు. ఆ సమయంలో వారి(స) వయసు 63 సంవత్సరాలు. ప్రవక్త(స) వారిని ప్రవక్తవారి మస్జిదు(మస్జిద్ అల్ నబవీ)పక్కన ఉన్న ఆయిషా(ర) వారి గదిలో ఖననం చేశారు.