నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం మక్కా మరియు మస్జిద్ అల్ హరామ్ యొక్క విశిష్ఠతలు

పవిత్రమక్కా నగరం అరేబియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉంది, ఈ పట్టణంలోనే పవిత్ర మసీదు అయిన మస్జిద్ అల్ హరామ్ ఉన్నది, ఈ మస్జిదు ప్రపంచములోనే అత్యంత పవిత్రమైన మసీదు, ఇస్లాంలో దీనికి అత్యంత ఉన్నతమైన స్థానం ఉన్నది, మీరు ఈ పాఠములో వీటి గురించిన కొన్ని విషయాలు నేర్చుకుంటారు.

  • పవిత్ర మక్కా యొక్క ఔన్నత్యం గురించి అవగాహన
  • మస్జిద్ అల్ హరామ్ యొక్క ఔన్నత్యం గురించిన అవగాహన

పవిత్ర మక్కా నగరం యొక్క విశిష్ఠతలు ; ఈ పవిత్ర మక్కా నగరానికి ఉన్నతమైన స్థానం మరియు దానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. వాటిలో కొన్ని :

1. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ (స) వారికి ఇష్టమైన ప్రాంతాలలో ఒక ప్రాంతము

అబ్దుల్లాహ్ బిన్ అదీ బిన్ హమ్రా వారి ఉల్లేఖనం : నేను దైవ ప్రవక్త (స) వారిని హజూరా అనబడే ఒక గుట్టపై నిలుచుని మాట్లాడడం చూశాను, అప్పుడు వారు(స) ఇలా సెలవిచ్చారు : (ఓ మక్కా) నువు అల్లాహ్ యొక్క ఈ భూమి పై అత్యంత శ్రేష్టమైన, అల్లాహ్ వద్ద అత్యంత ప్రియమైన నేలవు, నీ నుండి నేను బహిష్కరించబడకపోయి ఉంటే నీ నుండి నేను బయటకు వచ్చేవాడిని కాదు. (తిర్మిధి 3925) మరో కధనంలో "అల్లాహ్ యొక్క భూమిపై నాకు అత్యంత ప్రియమైన ప్రదేశము" అని అన్నారని ఉంది (ఇబ్న్ మాజా 3108).

2. అది అల్లాహ్ చే నిషేదించబడినది (పవిత్రమైనది)

ఈ భూమిపై ఈ సృష్టిలో ఎవరూ కూడా పోరాటాలు, రక్తపాతం చేయడాన్ని నిషేదించాడు, ఈ ప్రాంతములో ఒకరిపై ఒకరు దౌర్జన్యం, అన్యాయం చేయడాన్ని, వేటాడడాన్ని, దాని చెట్లను నరకడాన్ని, గడ్డిని పీకడాన్ని కూడా నిషేదించాడు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు : (ఓ ముహమ్మద్!) వారితో (ఇలా అను): "నిశ్చయంగా, ఈ (మక్కా) నగరపు ప్రభువునే ఆరాధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయనే! దీనిని పవిత్ర క్షేత్రంగా చేశాడు మరియు ప్రతి వస్తువు ఆయనకు చెందినదే! మరియు నేను ఆయనకు విధేయుడనై (ముస్లింనై) ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. (అన్-నమ్ల్ : 91).

"మక్కాను అల్లాహ్ పవిత్రంగా చేశాడు, మరియు ప్రజలు దానిని పవిత్రంగా చేయలేదు. కాబట్టి, అల్లాహ్ మరియు తుది దినాన్ని విశ్వసించే వ్యక్తికి అక్కడ రక్తం చిందించడం లేదా చెట్లను నరకడం సరికాదు." (సహీహ్ అల్-బుఖారి 104, సహీహ్ ముస్లిం 1354)

3. దానిలో మస్జిదుల్ హరామ్‌ ఉంది. ఈ మస్జిదుకు అనేక విశిష్ఠతలు ఉన్నాయి, వాటిలో:

1. అల్లాహ్ యొక్క దాసులకోసం ఈ భూమిపై ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి దైవగృహము

అబూధర్‌(ర) వారు ఇలా సెలవిచ్చారు: నేను దైవప్రవక్త (స) వారిని భూమిపై మొట్ట మొదటగా నిర్మించబడిన మస్జిదు ఏది అని అడిగాను. వారు(స) మక్కాలోని మస్జిద్ అల్ హరమ్ అని సెలవిచ్చారు. రెండవ మస్జిదు ఏది అని అడిగితే, బైతుల్ మక్దిస్ లోని అల్-అఖ్సా మస్జిదు అని అన్నారు. ఈ రెండు మస్జిదుల మధ్య కాల వ్యవధి ఎంత అని అడిగితే, నలభై సంవత్సరాలు అని సెలవిచ్చారు. భూమి మొత్తం ఒక మస్జిదుగా చేయబడినప్పటి నుండి మీరు ఎక్కడ ప్రార్థన చేసినా, అది చెల్లుబాటు అవుతుంది అని కూడా వారు(స) సెలవిచ్చారు. (బుఖారీ 3366, ముస్లిం 520).

2. ఇది పవిత్ర కాబాను కలిగి ఉంది:

కాబా అనేది మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ ప్రాంగణంలో ఉండే ఒక చతురస్రాకారములో ఉండే కట్టడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమ ప్రార్థనల సమయంలో దీని దిశ వైపు తిరిగి నమాజు చేస్తారు . దీనిని అల్లాహ్ ఆదేశం మేరకు ఇబ్రహీం(అ) మరియు అతని కుమారుడు ఇస్మాయిల్(అ) నిర్మించారు, ఆ తర్వాత అనేక సార్లు పునరుద్ధరణ చేయడం కూడా జరిగింది. ఖురాన్ : మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ ఈ గృహపు (కఅబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ విధంగా ప్రార్థించారు): "ఓ మా ప్రభూ! మా ఈ సేవను స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు." కాబాను పునర్నిర్మించే సమయంలో, హజ్రే అస్వద్ ను తిరిగి ఉంచే బాధ్యతను ఎవరికి అప్పగించాలనే విషయంలో ఖురైష్ తెగల మధ్య వివాదం తలెత్తింది. చివరికి, ఖురైష్ వారందరూ ఒప్పుకుని, ఈ గౌరవప్రదమైన పనిని దైవప్రవక్త ముహమ్మద్ (స)వారికి అప్పగించారు.

అందులో చేసే నమాజులకు రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది

"ఈ నా మసీదులో ఒక నమాజు, మరెక్కడైనా చేసే వెయ్యి నమాజుల కంటే శ్రేష్ఠమైనది, పవిత్ర మసీదు (మక్కాలోని కాబా) మినహా. మరియు పవిత్ర మసీదులో ఒక నమాజు, మరెక్కడైనా చేసే లక్ష నమాజుల కంటే శ్రేష్ఠమైనది." (ఇబ్న్ మాజా 1406, అహ్మద్ 14694)

4. అల్లాహ్ తన పవిత్ర గృహానికి హజ్ యాత్రను స్తోమత ఉన్న వారిపై విధిగావించాడు:

ఇబ్రహీం (అ) ప్రజలను హజ్ యాత్రకు పిలిచారు, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు అక్కడకు తరలివచ్చారు. అనేక మంది ప్రవక్తలు కూడా హజ్ యాత్ర చేశారు. దీనిని ప్రవక్త ముహమ్మద్ (స) ధృవీకరించారు. అల్లాహ్ ఇబ్రహీం (అ) కి ఇచ్చిన ఆదేశాన్ని ఖురాన్ లో ఇలా పేర్కొన్నారు: ఖురాన్ : మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు. వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు. (అల్-హజ్: 27).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి