ప్రస్తుత విభాగం : model
పాఠం అదాను
నమాజు సమయం ప్రవేశించినపుడు జనులను నమాజు కోసం పిలుపునివ్వడానికి అల్లాహ్ అదానును ధర్మబద్ధం చేశాడు
నమాజు యొక్క ఆరంభానికి సూచకంగా అల్లాహ్ ఇఖామా పిలుపును ధర్మబద్ధం చేశాడు
అదాను ఏ విధంగా ధర్మబద్ధం చేయబడినది ?
ముస్లిములు మదీనా నగరానికి వలస వచ్చినప్పుడు, నమాజుల సమయంలో సమావేశమయ్యేవారు కానీ, ఎవరూ వారిని పిలిచేవారు కాదు. ఒక రోజు వారందరూ ఈ విషయం గురించి చర్చించుకున్నారు. క్రైస్తవులు ఉపయోగించే గంటలాంటి దాని గంటను ఉపయోగిద్దాము అని కొందరు సూచించారు, మరికొందరు యూదుల ఉపయోగించే కొమ్మును వినియోగిద్దాము అని సలహా ఇచ్చారు. అప్పుడు ఉమర్(ర) వారు : "నమాజు కోసం పిలుపునివ్వడానికి ఎవరైనా వ్యక్తిని ఎందుకు పంపించకూడదు మీరు? అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త(స) వారు : "ఓ బిలాల్, లేచి వచ్చి నమాజు కోసం పిలువునివ్వు" అని సెలవిచ్చారు (బుఖారీ 604, ముస్లిం 377).
అదాన్ మరియు ఇఖామా యొక్క ఆదేశం
కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉన్న సందర్భం తప్పిస్తే సామూహిక నమాజులో అదాను ఇవ్వడం అనేది తప్పనిసరి, దానిని ఉద్దేశపూర్వకంగా వదిలేసినా కూడా నమాజు చెల్లుబాటు అవుతుంది, కానీ అలా చేయడం పాపముగా పరిగణింపబడుతుంది.
నమాజు కోసం అజానును బిగ్గరగా మరియు మంచి స్వరముతో ఇవ్వడం ధర్మబద్దమే, దీని ద్వారా జనులు నమాజు వైపుకు తరలి వస్తారు.
ఫజర్ నమాజులో ముఅద్దిను ఈ వాఖ్యాన్ని అదనంగా పలుకుతాడు ; అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్.అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్ (నిద్ర కన్నా నమాజు ఉత్తమమైనది). ఈ అదనపు వాఖ్యం హయ్యా అలాల్ ఫలాహ్ తరువాత చెప్పబడుతుంది
ముఅద్దిన్ చెప్పే పదాలను పునరావృతం చేయడం
అజాన్ వినేటపుడు, ముఅద్దిన్ చెప్పే పదాలను పునరావృతం చేయడం అనేది ప్రోత్సహించబడిన విషయం. అయితే, "హయ్యా అలస్సలాత్" (నమాజుకు వచ్చేయండి) మరియు " హయ్యా అలల్ ఫలాహ్" (పూర్తి సాఫల్యం వైపుకు వచ్చేయండి) అనే పదాలకు మినహాయింపు ఉంది, వీటికి ప్రతిస్పందనగా "ల హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్" (శక్తి మరియు సమర్ధత కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి) అని అనాలి. అజాన్ ను పునరావృతం చేసిన తర్వాత, దైవప్రవక్త(స) వారు సూచించిన ఈ దుఆ చదవాలి : “అల్లాహుమ్మ రబ్బహాదిహిద్దావతిత్ త్తామ్మతి వస్సలాతిల్ ఖాయిమతి , ఆతి ముహమ్మదనిల్ వసీలత, వల్ ఫదీలత వబ్అథ్ హు మఖామం మహ్.మూదనిల్లదీ వఅత్తహు”. అర్ధం : ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు, శాశ్వతమైన నమాజుకు ప్రభువా, ముహమ్మద్ (స)వారికి వసీలా(స్వర్గములో కేవలం వారికి మాత్రమే ప్రత్యేకమైన స్థానము) మరియు ప్రత్యేకమైన ఘనత(జీవరాసులలోకెల్లా ఉత్తమమైన స్థానము)ను ప్రసాదించు. నీవు ఆయనకు వాగ్దానం చేసిన “మఖామమ్మహ్ మూద్” (తీర్పు దినాన జనులందరూ వారి(స)ని ప్రశంసిస్తారు, ఇదే వారి కోసం వాగ్దానం చేయబడిన గొప్ప స్థానము) పై ఆయనను అధిష్టింపజేయి.