ప్రస్తుత విభాగం : model
పాఠం ప్రయాణికుడు మరియు రోగి యొక్క నమాజు
ప్రతి ముస్లిము, ఆరోగ్యంగా మరియు స్పృహలో ఉన్నంత వరకు, ఎల్లప్పుడూ నమాజు చేస్తుండడం అనేది తప్పనిసరి. అయితే, ఇస్లాం ప్రజల యొక్క విభిన్న పరిస్థితులు మరియు అవసరాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అనారోగ్యం మరియు ప్రయాణం వంటి సందర్భాలలో నమాజులకు సంబంధించి కొన్ని సడలింపులు ఉన్నాయి.
ప్రయాణికుడు తాత్కాలికంగా ఒక ప్రదేశానికి వెళ్లినప్పుడు, అక్కడ నాలుగు రోజుల కంటే తక్కువ సమయం ఉండవలసి వచ్చినపుడు అతడు నాలుగు రెకాతుల నమాజులను రెండు రెకాతులకు కుదించడం సిఫార్సు చేయబడినది. దుహర్, అసర్ మరియు ఇషా నమాజులను నాలుగు రెకాతులకు బదులుగా రెండు రెకాతులకు కుదించవచ్చు. అయితే, ఒకవేళ అతను ఒక స్థానిక ఇమాముతో కలిసి జమాజు చేస్తుంటే గనక అతను ఆ ఇమామును అనుసరిస్తూ నాలుగు రెకాతులు పూర్తిగా చదవవలసి ఉంటుంది.
ప్రయాణీకునికి ఫజ్ర్ యొక్క సున్నత్ ప్రార్థన మినహా సాధారణ సున్నత్ నమాజులను విడిచిపెట్టే అనుమతి ఉంది మరియు అతను విత్ర్ మరియు తహజ్జుద్ నమాజును ఆచరించవచ్చు అని సూచించబడింది.
దొహార్ మరియు అసర్ అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులను కలిపి ఆ రెండు నమాజులకు చెందిన ఏదో ఒక సమయములో ముందుగానో చివరిగానో చదువుకోవచ్చును
అనారోగ్యం కారణంగా నుంచుని నమాజు చేయలేని స్థితిలో ఉన్న వ్యక్తికి నుంచునే ఆదేశం వర్తించదు, లేదా చికిత్సలో భాగంగా నుంచునే పరిస్థితి లేనపుడు కూర్చుని నమాజు చేయవచ్చు, కూర్చుని కూడా చేయలేని పరిస్తితి ఉంటే పడుకుని చదవాలి. దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : నుంచుని చదవాలి, నుంచోలేకపోతే కూర్చుని చదవాలి, కూర్చోలేకపోతే పడుకుని చదవాలి. (బుఖారీ 1117).