ప్రస్తుత విభాగం : model
పాఠం ఎహ్రామ్ యొక్క నిశిద్దాలు
ఎహ్రామ్ నిషిద్దాలు
హజ్ లేదా ఉంరాలో ఎహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వర్తించే నిషిద్దాలు
మూడు రకాల ఎహ్రామ్ నిశిద్దాలు
ఆడా మగా ఇద్దరికీ ఉన్న ఎహ్రామ్ నిషిద్దాలు
మగవారికోసం ఉన్న ఎహ్రామ్ నిషిద్దాలు
ఆడవారి పై ఉన్న ఎహ్రామ్ నిషిద్దాలు
ఈ నిషేధించబడిన చర్యలలో దేనినైనా మరచిపోయినా, తెలియక లేదా బలవంతంగా చేయబడడం వలన చేసినా వారికి ఎటువంటి పాపం లేదు. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: "మీరు తెలియక చేసిన తప్పులకు మీపై ఎలాంటి దోషం లేదు, కానీ మీ హృదయాలు ఉద్దేశపూర్వకంగా చేసిన దానికి మాత్రమే." (అహ్ జాబ్ :5). అయితే, వారు గుర్తు చేసుకున్నా లేదా తెలుసుకున్నా, వారు వెంటనే నిషేధించబడిన చర్యను విడిచిపెట్టాలి.
ఇహ్రామ్ సమయంలో నిషేధించబడిన వాటిలో ఏదైనా బలమైన కారణం వల్ల ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యక్తికి ఫిద్యా (ప్రాయశ్చిత పరిహారం) ఇవ్వవలసి ఉంటుంది, కానీ వారిపై ఎలాంటి పాపం ఉండదు.
దివ్యఖురానులో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : బలి జంతువు దాని గమ్యస్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేసుకోకండి. కానీ, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే లేదా అతని తలకు బాధ ఉంటే (శిరోముండనం చేసుకొని) దాని పరిహారంగా (మూడు రోజులు) ఉపవాసం ఉండాలి. లేదా దానధర్మాలు చేయాలి (ఆరుగురు నిరుపేదలకు భోజనం పెట్టాలి), లేదా బలి ఇవ్వాలి. కాని శాంతి భద్రతలు ఉన్న సమయాలలో ఎవడైనా హజ్జె తమత్తు చేయదలుచుకుంటే, అతడు తన శక్తిమేరకు బలి ఇవ్వాలి. కాని ఎవడైతే ఖుర్బానీ ఇవ్వలేడో, హజ్జ్ కాలంలో మూడు దినాలు మరియు (ఇంటికి) తిరిగి వచ్చిన పిమ్మట ఏడు దినాలు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం పది దినాలు ఉపవాసాలు ఉండాలి. ఇది మస్జిద్ అల్ హరామ్ దగ్గర నివసించని వారికి మాత్రమే. మరియు అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు, అని తెలుసుకోండి. (బఖరా : 196).
ఇహ్రామ్ సమయంలో నిషేధించబడిన వాటిలో ఏదైనా ఉద్దేశపూర్వకంగా మరియు చెల్లుబాటు అయ్యే కారణం లేకుండా చేసిన వ్యక్తి తప్పనిసరిగా ఫిద్యా (ప్రాయశ్చిత పరిహారం) చెల్లించాలి మరియు అటువంటి చర్యకు పాపం కూడా ఉంటుంది.