ప్రస్తుత విభాగం : model
పాఠం హదస్ ఏ అక్బర్ (స్నానాన్ని తప్పనిసరి చేసే స్థితి) మరియు స్నానము
గుసుల్ తప్పనిసరి చేసే అంశాలు
గుసుల్ ను అనివార్యం చేసే అంశాల గురించిన వివరణ, నమాజు లేదా తవాఫు చేయాలంటే గుసుల్ తప్పనిసరి.
1. వీర్య స్ఖలనం
మేల్కొని ఉన్నప్పుడు లేదా నిద్రావస్తలో ఉన్నప్పుడు ఇలా ఏ కారణంతోనైనా, ఏ సమయంలోనైనా వీర్య స్ఖలనం జరిగినపుడు గుసుల్ తప్పనిసరి అవుతుంది. కామవాంచపు సుఖముతో బయటకు స్రవించే తెల్లటి, చిక్కటి పదార్దాన్ని వీర్యం అంటారు.
2.సంభోగం
సంభోగం (జిమా) : స్త్రీ యొక్క యోనిలోకి పురుషాంగము ప్రవేశించడాన్ని సంభోగం అంటారు, స్ఖలనం అయినా, అవ్వకున్నా లేదా కేవలం పురుషాంగపు శీస్న భాగం లోపలికి ప్రవేశించినా కూడా గుసుల్ తప్పనిసరి అవుతుంది.
3. బహిష్టు మరియు ప్రసవానంతర రక్తస్రావం
బహిష్టు(హైద్) అంటే యుక్త వయసు ఆడపిల్లలలో నెలనెలా కనిపించే రక్తస్రావం. ఇది శరీర తత్వాన్ని బట్టి దాదాపు వారం రోజులపాటు ఉంటుంది. నిఫాస్ : స్త్రీలో ప్రసవానంతరం కనిపించే రక్తాన్ని నిఫాస్ అంటారు, కొద్ది రోజులపాటు ఇది ఉంటుంది.
ఋతుస్రావం మరియు ప్రసవానంతర స్రావంతో ఉన్న స్త్రీలకు ఆ సమయంలో సమాజుల విషయంలో వెసులుబాటు ఉంది, ఆ కాలంలో వారు నమాజులు చదవవలసిన మరియు ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు, ఈ స్థితినుండి వారు శుద్ధి చిందిన తరువాత వదిలేసిన ఉపవాసాలను పూర్తి చేసుకోవలసి ఉంటుంది, అయితే నమాజులు మాత్రం పూర్తి చేయవలసిన అవసరం లేదు.
నెలసరి సమయంలో సంభోగంలో పాల్గొనడం
ఋతుస్రావం మరియు ప్రసవానంతర స్రావ సమయం నడుస్తున్నపుడు వారితో సంభోగంలో పాల్గొనడం నుంచి వారించబడినది, అయితే ఈ ఒక్క సంభోగం తప్ప సరసాలతో వినోదాన్ని ఆస్వాదించవచ్చు. స్త్రీలలో ఈ రెండు రకాల స్రావాలు ముగిసిన తరువాత వారు గుసుల్ చేయడం తప్పనిసరి. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు(తహారా) కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధులు అయిన తరువాత అల్లాహ్ ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు. (బఖరా: 222). ఈ వాఖ్యములో తహారా అంటే గుసుల్ చేసిన తరువాతి స్థితి.
ఒక విశ్వాసి శుద్ధి(తహారా) సంకల్పముతో శరీరమంతా కడుగుకుంటే సరిపోతుంది.
దైవప్రవక్త (స) వారు చూపిన విధానంలో చేసే గుసుల్ (శుద్ధత కోసం చేసే స్నానం) పరిపూర్ణమైన గుసుల్. లైంగిక అశుద్ధత కారణంగా గుసుల్ చేసేటపుడు మొదట, అరచేతులు, జననావయవాలు మరియు లైంగిక అశుద్ధతకు సంబందించిన మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత పూర్తి వుదూ చేసి, తలపై మూడుసార్లు నీటిని పోసుకోవాలి. చివరగా మిగిలిన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి.
జనాబా(స్కలనం) కారణంగా గుసుల్ చేసినపుడు ఆ గుసుల్ అనేది వదూకు కూడా సరిపోతుంది, దాని తరువాత వదూ చేయడం తప్పనిసరి కాదు, అయితే గుసుల్ లో వదూ కూడుకుని ఉండడం ఉత్తమం, అది ప్రవక్త(స) వారి పద్ధతి(సున్నత్) కూడా.