నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం తహారా (శుద్ధి) యొక్క కొన్ని ప్రత్యేక సందర్భాలు

వస్త్రంతో చేసిన సాక్సులపై, తోలుతో చేసిన సాక్సులపై అలాగే గాయంకారణంగా కట్టిన కట్టుపై మసహ్ చేయడాన్ని ధర్మబద్ధం చేయబడినది. ఈ స్థితిలో ఉన్నవారి భారం తగ్గడానికి, సులభతరంగా ఉండడానికి ఈ అనుమతి ఇవ్వబడినది. ప్రత్యేకమైన సందర్భాలలో తయమ్ముమ్ చేయడం ధర్మబద్ధం చేయబడినది. మీరు ఈ పాఠములో వీటన్నిటిపై ఎప్పుడు, ఏ విధంగా మసహ్ చేయాలో మరియు ఎప్పుడు తయమ్ముమ్ చేసుకోవాలో తెలుసుకుంటారు.

  • సాక్సులపై ఏ సందర్భంలో మసహ్ చేయవచ్చో తెలుసుకోవడం
  • పట్టీ పై మసహ్ చేయడం సంబందించిన నియమాలను తెలుసుకోవడం
  • తయమ్ముమ్ మరియు దానిని చేసే విధానం గురించి తెలుసుకోవడం

వస్త్రము మరియు తోలుతో చేయబడిన సాక్సులపై మసహ్ చేయడం

వదూ చేసేటపుడు తడిచేతులతో సాక్సులపై మరియు పాదాన్ని పూర్తిగా కప్పి ఉన్న బూట్లపై మసహ్ చేసే అనుమతిని ఇస్లామ్ ఒక విశ్వాసికి ఇచ్చింది, అయితే దీనిలో ఉన్ని షరతులు కూడా ఉన్నాయి.

సాక్సులపై మసహ్ చేయడం అనేది ఎప్పుడు ధర్మబద్ధం అవుతుంది ?

స్నానం చేయడం తప్పనిసరి లేని స్థితిలో ఉండి వదూ చేసి ఉన్న స్థితిలో సాక్సులను తొడిగి ఉన్నప్పుడు మసహ్ చేసే అనుమతిని ఇస్లామ్ విశ్వాసికి ఇస్తుంది.

వస్త్రం మరియు తోలుతో చేసిన సాక్సుల పై మసహ్ చేసుకునే అనుమతి ఉన్న సమయం

స్థానికులకు ఒక పగలు మరియు ఒక రాత్రి (24 గంటలు)
ప్రయాణికుడికి మూడు పగలళ్ళు మరియు మూడు రాత్రులు (72 గంటలు)

సాధారణ వదూలో సాక్సులపై మసహ్ చేసుకోవచ్చును, అయితే వదూ తప్పనిసరి అయిన కారణంగా గుసుల్ చేసినపుడు మాత్రం రెండు పాదాలను తప్పకుండా కడుగుకోవాలి.

వస్త్రము లేదా తోలుతో చేసిన మేజోళ్లపై మసహ్ చేసే సమయం మొదటిసారి మసహ్ చేసిన సమయం నుండి ఆరంభమవుతుంది.

గాయం యొక్క కట్టు పై మసహ్ చేయడం

గాయమయినపుడు లేదా ఎముక విరిగినపుడు తొందరగా నయమవడానికి, నొప్పి తగ్గించడానికి కట్టే పట్టీను జూబైరా అంటారు.

సాధారణ వదూ సమయంలోనైనా లేదా గుసుల్ తప్పనిసరి అయిన స్థితిలో అయినా సరే గాయానికి కట్టిన పట్టీకు తడి చేతితో మసహ్ చేస్తే సరిపోతుంది.

గాయం యొక్క కట్టు పై మసహ్ ఎలా చేయాలి

పట్టీ కట్టిలేని భాగానికి నీటితో కడుగుకోవాలి, పట్టీ కట్టిఉన్న చోట తడి చేతితో మసహ్ చేసుకుంటే సరిపోతుంది.

గాయం యొక్క పట్టీపై మసహ్ యొక్క వ్యవధి

గాయానికి కట్టిన పట్టీ పై ఎన్ని రోజులు అవసరముంతే ఆన్ని రోజులు మసహ్ చేయవచ్చును, ఎప్పుడైతే పట్టీ యొక్క అవసరం ఉండదో దానిని తీసివేసి ఆ భాగాన్ని వదూ సమయంలో నీళ్ళతో కడుగుకోవాలి

నీటిని వినియోగించే స్థితిలో లేకపోవడం

నీరు లేనప్పుడు లేదా అనారోగ్యం వల్ల నీటిని వాడలేనందువల్ల లేదా తాగడానికి సరిపోయేంత మాత్రమే నీరు ఉన్నందువల్ల స్నానం (ఘుస్ల్) లేదా వుదూ చేయడం కష్టమైనప్పుడు, ‘తయమ్ముమ్’ అనబడే ఎంపిక ఉంది. ఇది శుభ్రమైన మట్టిని ఉపయోగించి చేసే ఒక శుద్ధీకరణ విధానం.

తయమ్ముమ్ చేసే విధానం

విశ్వాసి అయిన వ్యక్తి తన రెండు అరచేతులతో మట్టి పై ఒకసారి కొట్టాలి

కొద్దిగా మట్టి అంటి ఉన్న చేతులతో అరచేతుల ఇరువైపులను మరియు ముఖానికి ఒకసారి మసహ్ చేసుకోవాలి

ఎడమ అరచేతితో తన కుడి అరచేతి వెలుపల మసహ్ చేసుకోవాలి అలాగే కుడి అరచేతితో తన ఎడమ అరచేతి వెలుపల మసహ్ చేసుకోవాలి

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి