ప్రస్తుత విభాగం : model
పాఠం ప్రకృతికి అనుగుణమైన సున్నతులు
సహజ సిద్ధ (సృష్టి) ఆచారములు
సృష్టికర్త అయిన అల్లాహ్ మానవులను సహజసిద్ధమైన గుణాలతో సృష్టించాడు ఒక విశ్వాసి తనలోని ఈ గుణాలను ఆచరణలో పెట్టడం ద్వారా తన జీవితాన్ని మరింత అందంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోగలడు. ఇస్లాం మనిషిలోని బాహ్య మరియు అంతర సౌందర్యాన్ని సమతుల్యంగా ఉంచే అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది, తద్వారా ఒక విశ్వాసి యొక్క వ్యక్తిత్వం అంతరంగా మరియు బాహ్యంగా పరిపూర్ణత సంతరించుకుంటుంది.
దైవప్రవక్త (స)వారు ఇలా సెలవిచ్చారు : ఐదు విషయాలు సహజ సిద్ధ (సృష్టి) ఆచారములు : ఒడుగులు(సున్తీ) చేయించడం, నాభి క్రింది వెంట్రుకలు తొలగించడం, మీసాలు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం మరియు చంకలోని వెంట్రుకలు తీయడం. (బుఖారీ : 5552, ముస్లిం : 257) మరోచోట దైవప్రవక్త (స)వారు ఇలా సెలవిచ్చారు : మీసాలను కత్తిరించడం, గెడ్డాన్ని వదలడం, మిస్వాక్ చేయడం, వదూలో ముక్కులోపలికి నీరు లాగడం, గోళ్ళు కత్తిరించడం, మెటికల (వేళ్ళ వెనుకవైపు జాయింట్ల వద్ద ఉండే చర్మపు మడతలు)ను కడగడం, చంక వెంట్రుకలను తీయడం, నాభి క్రింది వెంట్రుకలను తీయడం మరియు (ఇస్తింజా కాలకృత్యాల తరువాత నీటితోగానీ, మట్టిగడ్డతో గానీ శుభ్రపరచుకోవడం). ఈ హదీసు యొక్క ఉల్లేఖకులు ఇలా సెలవిచ్చారు : పడవది నేను మరచిపోయాను, బహుశా పుక్కిల్లించడం అవవచ్చు. (ముస్లిం 261).
ఒడుగులు(సున్తీ)
పురుషాంగపు ముందరి చర్మాన్ని తొలగించడాన్ని సున్తీ చేయడం అంటారు, సాధారణంగా దీనిని పుట్టిన తొలిరోజుల్లోనే చేస్తారు, ప్రకృతికి అనూకులమైన ఈ సున్నతు పురుషుల కోసం తప్పనిసరి, దీనివల్ల ఆరోగ్యపరంగా కూడా పలు ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
షేవ్ చేయడం (క్షవరం)
నాభి క్రింది వెంట్రుకలను షేవ్ చేయడం ద్వారా లేదా ఇతర ఏ విధానంతోనైనా తొలగించడం
మీసాలను కత్తిరించడం
మీసాలను ఉంచడం అనుమతించబడినది, అయితే అది అభిలషణీయం కాదు, మీసాలు ఉంచినపుడు అవి మితిమీరి పొడగకుండా కత్తిరిస్తూ ఉండాలి.
గెడ్డాన్ని పూర్తిగా పెంచడం
గెడ్డాన్ని పెంచాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది, పెంచడం అనగా దానిని కత్తిరించకుండా ఉండాలి, గెడ్డాన్ని పెంచడం అనేది దైవ ప్రవక్త (స) వారి సున్నతు.
మిస్వాక్ (పంటి పుల్లతో తోముకోవడం )
పళ్లను తోముకోవడానికి వినియోగించే పంటి పుల్లను మిస్వాక్ అంటారు, మిస్వాక్ చెట్టు అనబడే గున్నంగి చెట్టు పుల్ల లేదా మరే ఇతర పుల్లతో చేసినా దానిని మిస్వాక్ అంటారు, ఇది అభిలషణీయం కూడా.
గొర్లను కత్తిరించడం
ఒక విశ్వాసిగా క్రమం తప్పకుండా గొర్లను కత్తిరిస్తూ ఉండాలి లేకుంటే ఇది అపరిశుభ్రతకు, మాలిన్యానికి కారణం అవుతుంది
చంక వెంట్రుకలు తీయడం
ఒక విశ్వాసి చంకల వెంట్రుకలను తీసివేస్తూ ఉండాలి లేకుంటే ఇది దుర్వాసనకు, అపరిశుభ్రతకు దారి తీస్తుంది.
చేతి వేళ్ళ మెటికలను శుభ్రపరచుకోవడం
మెటికలు అనగా చేతి వేళ్ళ పై భాగాన ఉండే కీళ్లపై ముడతలుగా ఉండే చర్మ భాగాలను అంటారు, వీటిని కడగడం అభిలషణీయం
మూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రపరచుకోవడం, పుక్కిలించడం మరియు ముక్కులోకి అయినంత మేర నీటిని పీల్చడం
మూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రపరచుకోవడం గురించి శుచీ శుభ్రత మరియు వదూ కు సంబందించిన గత పాఠాలలో తెలుసుకున్నాము