ప్రస్తుత విభాగం : model
పాఠం సూరా ఫాతిహా యొక్క అర్ధం
నమాజులో సూరా ఫాతిహా చదవడం అనేది నమాజు యొక్క ముఖ్య మూలస్తంభాలలో ఒకటి అది లేకుంటే నమాజు స్వీకరించబడదు
అల్లాహ్ యొక్క శుభగుణాలు, శుభనామాలు, కనిపించే మరియు కనిపించని అతని అనుగ్రహాల ద్వారా కీర్తిస్తూ ప్రేమ మరియు గౌరవంతో అల్లాహ్ ను స్తుతించాలి. “రబ్” (ప్రభువు) అనగా సృష్టికర్త, యజమాని, నియంత్రకుడు, అనుగ్రహాలను నోసంగేవాడు అని అర్ధం. “ఆలమీన్” అనగా సమస్త లోకాలు. అనగా అల్లాహ్ తప్ప ఈ విశ్వములో, జగత్తులో ఉన్న సృష్టి అంతా అని అర్ధం, అనగా సర్వ మానవులు, జిన్నులు, దైవదూతలు, సర్వ జీవజాతులు వగైరా అన్నీ దీని పరిధిలోకి వస్తాయి.
అల్లాహ్ యొక్క రెండు పేర్లు. అల్ రహ్మాన్: పరమ దయామయుడు, అనగా అల్లాహ్ యొక్క అందరికీ చెందిన సాధారణ కరుణ, ఇది ఈ ప్రపంచములోని ప్రతి ఒక్క జీవిని కమ్ముకుని ఉన్నది. అల్ రహీమ్ : అల్లాహ్ యొక్క విశ్వాసుల పట్ల ఉన్న ప్రత్యేక కరుణ.
అల్ మాలిక్ అనగా తీర్పుదినానికి యజమాని. అనగా ప్రతిఫలం అందే రోజున ప్రతీదీ నడిపించేవాడు, ఇది ఒక ముస్లిముకు ఆ తీర్పుదినాన్ని గుర్తుకు తీసుకువస్తుంది మరియు సదాచారణలు చేయమని ప్రోత్సహిస్తుంది.
మేము అన్ని రకాల ఆరాధనలను, విధేయతను నీకు మాత్రమే ప్రత్యేకించుకుంటాము. మరియు నీకు ఎవరి భాగస్వామ్యాన్నీ కల్పించము. మా వ్యవహారలన్నింటిలో సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్ధిస్తాము. సమస్త వ్యవహారాలు నీ చేతిలోనే ఉన్నాయి, వాటిపై నీకు తప్ప మరెవరికీ ఆధీనత లేదు.
మాకు రుజుమార్గాన్ని చూపించు. మరియు దానిపైనే మమ్మల్ని నడిపించు. మరియు దానిపై మాకు స్థిరత్వాన్ని ప్రసాధించు. నీ వద్దకు చేరే వరకు మాకు ఈ సన్మార్గం పైనే ఉంచు, సిరాతల్ ముస్తఖీం అనగా ఇస్లాం ధర్మం, దీని ద్వారా ఒక మనిషి అల్లాహ్ యొక్క సంతుష్ఠతను చూరగొని స్వర్గం వరకు చేరుకుంటాడు, ఈ సత్య ధర్మం గురించి దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ (స) వారు అల్లాహ్ ద్వారా తెలియజేశారు, ఈ మార్గముపై పటిష్ఠంగా ఉన్న వ్యక్తి మాత్రమే అసలైన విజయం సాధిస్తాడు.
అనగా నీ దాసుల్లో ఎవరినైతే నీవు సన్మార్గము ద్వారా అనుగ్రహించినావో, అనగా : దైవ ప్రవక్తలు, సత్యవంతులు, అమరులు, సద్వర్తనులు. వీరు ధర్మాన్ని గ్రహించి, అర్ధం చేసుకుని దాని పై నడిచారు. మరియు మమ్ములను సత్యాన్ని తెలుసుకున్నప్పటికి దానిపై ఆచరించకుండా నీ ఆగ్రహానికి గురైన వారి మార్గం నుండి కాపాడు, వారు ఎంచుకున్న అజ్ఞాన మార్గం కారణంగా వారు సత్యాన్ని స్వీకరించలేదు.