ప్రస్తుత విభాగం : model
పాఠం దైవదూతలపై విశ్వాసం
దైవదూతలపై విశ్వాసం యొక్క అర్ధము
దైవదూతల ఉనికిపై బలమైన విశ్వాసం కలిగి ఉండడం, వారిది మానవుల ప్రపంచానికి భిన్నంగా ఎవరికీ కనిపించని ఒక అగోచరమైన ప్రపంచము, వారు భయభక్తులు కలిగినవారు మరియు గౌరవనీయులు, అల్లాహ్ కు ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధిస్తారు, అల్లాహ్ ఆదేశించినవాటిని వెంటనే శిరసా వహిస్తారు, పూర్తి విధేయత కలిగి ఉంటారు, అల్లాహ్ కు ఎన్నటికీ అవిధేయత చూపరు, తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!, వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు". (అల్ అన్బియా: 26-27).
దైవదూతలపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యత
దైవదూతలను విశ్వసించడం అనేది విశ్వాసపు ఆరవ మూలస్థంబము . దీని గురించి తన దివ్యగ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను", బఖర : 285 దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, తీర్పుదినాని మరియు మంచైనా, చెడైనా విధిరాతను విశ్వసించాలి (ముస్లిం : 8)
దైవదూతలను విశ్వసించడం ప్రతి విశ్వాసికి తప్పనిసరి, దీనిని తిరస్కరించినవాడు మార్గభ్రష్టుడు. దివ్యగ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే! (నిసా : 136). ఈ మూలస్థంబాలను తిరస్కరించిన వారికి ఈ ఆయతు వర్తిస్తుంది.
దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : ఆకాశమంతా అందులో ఉన్నవారితో నిండి పోయి ఉంది, అందులో జానెడు ఖాళీ కూడా లేదు, ప్రతిఒక్క చోటా దైవదూతలు ఉన్నారు, వారు తమ ఆరాధనలో నుంచున్న స్థితిలో, రుకూ లేదా సాష్టాంగ స్థితిలో ఉన్నారు.
దైవదూతలపై విశ్వాసలములో ఏ ఏ విషయాలు ఉంటాయి ?
అల్లాహ్ యొక్క దైవ దూతలపై మరియు వారి గుణగనాల పై మన విశ్వాసం
అల్లాహ్ దైవదూతలకు కొన్ని బాధ్యతలను ఇచ్చి ఉన్నాడు, వాటిలో కొన్ని
కొన్ని సంఘటనలలో కొందరు ప్రమాదాల నుండి బ్రతికి బయటపడుతుంటారు, దీని వెనుక అల్లాహ్ యొక్క ఆదేశంతో దైవదూతలు మానవులను కాపాడుతూ ఉంటాయి అనే విషయం మనము మరువకూడదు .