నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం నమాజు యొక్క మూల స్థంబాలు మరియు దానిలోని తప్పనిసరి అంశాలు

ఈ విభాగంలో నమాజు యొక్క మూల స్థంబాలు, తప్పనిసరి అంశాలు, భంగపరిచే అంశాలు మరియు చేయకూడని అంశాల గురించి తెలుసుకుందాము

  • నమాజు యొక్క మూల స్థంబాల గురించిన అవగాహన
  • నమాజు యొక్క తప్పనిసరి అంశాల గురించిన అవగాహన
  • నమాజును భంగ పరచే అంశాల గురించిన అవగాహన
  • నమాజులో తప్పు జరిగి నపుడు చేసే సహూ సజ్దా గురించిన అవగాహన
  • నమాజులో చేయకూడని అంశాలు

నమాజు యొక్క మూల స్థంబాలు.

ఉద్దేశపూర్వకంగా లేదా మరచిపోయి వదిలేయడం కారణంగా నమాజును భంగ పరిచే ప్రధాన అంశాలు.

నమాజు యొక్క మూల స్థంబాలు

١
నమాజును ఆరంభించడానికి చెప్పే తక్బీర్
٢
నిలుచునే శక్తి కలిగి ఉన్నప్పుడు నుంచోవడం
٣
సూరా ఫాతిహా పఠనం చేయడం
٤
రుకూ చేయడం
٥
రుకూ నుండి లెగడం
٦
సజ్దా చేయడం
٧
రెండు సజ్దాల మధ్య కూర్చోవడం
٨
చివరి తషాహ్హుద్ లో కూర్చోవడం
٩
ప్రశాంతత
١٠
సలాము చెప్పడం (ముగింపుకు)
١١
నమాజులో మూల స్థంబాల క్రమం

నమాజులోని తప్పనిసరి అంశాలు

ఇవి నమాజులోని తప్పనిసరి అంశాలలోనివి, వాటిని ఉద్దేశపూర్వకంగా వదిలేయడం అనేది నమాజును భంగం కలిగిస్తుంది, ఒకవేళ మరచిపోయి వదిలేస్తే సజ్దా సహూ చేయవలసి ఉంటుంది, ఈ సజ్దా సహూ అనేది నమాజును ముగించడానికి మునుపు చేయవలసి ఉంటుంది.

నమాజులోని తప్పనిసరి అంశాలు (వాజిబ్)

١
నమాజు ప్రారంభ తక్బీర్ కాకుండా ఇతర ఆన్ని తక్బీర్లు
٢
రుకూలో (సబ్ హాన రబ్బీ అల్ అదీమ్) ఒక సారి అనడం
٣
(సమియల్లాహు లిమాన్ హామిదహ్) కేవలం ఇమాము మాత్రమే చెప్పడం
٤
(రబ్బనా వ లకల్ హంద్ ) అని అందరూ అందడం
٥
(సుబ్ హాన రబ్బీ అల్ ఆలా) అని చెప్పడం
٦
(రబ్బిగ్ ఫిర్లీ) అని రెండు సాష్టాంగాల మధ్య ఒక సారి చెప్పడం
٧
మొదటి తష హ్హుద్ మరియు అందులో కూర్చోవడం

ఈ తప్పనిసరి (వాజిబ్) అంశాలు ఒకవేళ మరచిపోతే వాటికి బదులుగా సజ్దా సహూ తప్పనిసరిగా చేయవసి ఉంటుంది.

నమాజు యొక్క సున్నతులు

నమాజు యొక్క మూల స్థంబాలు మరియు తప్పనిసరి విషయాలు(వాజిబులు) కాకుండా సున్నతుకు చెందిన ఇతర అంశాలు కూడా ఉంటాయి, నమాజు యొక్క పరిపూర్ణత కోసం వీటిని పాతించడం హర్షణీయమైన విషయం, ఒక వేళ వీటిని పాఠించకపోతే నమాజు అనేది రద్దు అవదు.

సజ్దా సహూ

దొహార్ మరియు అసర్ అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులను కలిపి ఆ రెండు నమాజులకు చెందిన ఏదో ఒక సమయములో

సజ్దా సహూ అనేది ధర్మబద్దంగా ఎప్పుడు వర్తిస్తుంది ?

١
నమాజులో పొరబాటున లేదా మరచిపోవడం కారణంగా రుకూ లేదా సజ్దా లేదా నుంచోవడం లేదా కూర్చోవడంలో హెచ్చితే సజ్దా సహూ చేయవలసి ఉంటుంది
٣
నమాజులోని తప్పనిసరి అంశాలలో ఒకటైన మొదటి తషహ్హుద్ వంటి దానిని పొరపాటున లేదా మరచి వదిలేసినపుడు చివరలో సహూ సాష్టాంగం చేయవలసి ఉంటుంది,
٤
నమాజులో ఎన్ని రెకాతులు పూర్తి చేసుకున్నామో అని సందేహం కలిగినపుడు నమ్మకంగా కనీసం ఎన్ని పూర్తి చేసుకున్నామో వాటి తరువాతవి పూర్తి చేసుకుని చివరగా సహూ సజ్దా చేసుకోవాలి

సహూ సజ్దా చేసే విధానం

సహూ సజ్దా యొక్క రెండు సమయాలు ఉన్నాయి, ఈ రెండింటిలో దేనినైనా పఠించవచ్చును

١
సలామ్ చేయడానికి ముందు చివరి తషహ్హుద్ తరువాత సజ్దా చేసి ఆ తరువాత సలామ్ చేయాలి
٢
నమాజును ముగిస్తూ సలాము చేసిన తరువాత సహూ యొక్క రెండు సజ్దాలు చేసి మరలా సలాము చెప్పాలి.

నమాజును నిర్వీర్యం చేసే అంశాలు

ఈ అంశాలు నమాజును నిర్వీర్యం చేస్తాయి, ఇలా జరిగితే నమాజును మరలా చదవలసి ఉంటుంది

నమాజును నిర్వీర్యం చేసే అంశాలు

١
నమాజు యొక్క ఒక మూలస్థంబాన్ని, లేదా షరతును ఉద్దేశపూర్వకంగా వదిలేయడం. లేదా అనుకోకుండా దాని గురించి తెలిసిన తరువాత కూడా వదిలేయడం
٢
నమాజులోని ఏదైనా తప్పనిసరి అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేయడం
٣
ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం
٤
పగలబడి నవ్వడం : అనగా శబ్దంతో నవ్వడం
٥
ఎటువంటి కారణం లేకుండా నిరంతరంగా కదులుతూ ఉండడం

నమాజు చదివేటపుడు సమంజసం కాని అంశాలు

ఇటువంటి పనులు నమాజు యొక్క పుణ్యాన్ని తగ్గిస్తాయి అలాగే నమాజులోని ఏకాగ్రతను, దాని గాంభీర్యాన్ని తగ్గించి వేస్తాయి

నమాజులో అటూ ఇటూ చూడడం

నమాజులో వేరే విషయాలపై మరలడం గురించి దైవప్రవక్త (స)వారిని అడిగినపుడు వారు ఇలా సెలవిచ్చారు : ఇది దాసుని యొక్క నమాజును షైతాను దృష్టి మళ్లించి లాగేసుకుని పోవడం. అని సెలవిచ్చారు. (బుఖారీ 751).

చేయి లేదా ముఖముతో అనవసరంగా కదిలిస్తుండడం

చేయిని నడుము పై ఉంచి నుంచోవడం, రెండు చేతుల వెళ్లను కలపడం లేదా వేళ్ళను విరవడం.

పరధ్యానంలో ఉండి నమాజు చదవడం

కాలకృత్యాల అవసరం వచ్చినపుడు లేదా ఆకలి వేస్తున్నపుడు నమాజు విషయంలో ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : ఆకలితో భోజనం ముందు ఉన్నప్పుడు ఎటువంటి నమాజు లేదు మరియు అలాగే కాలకృత్యాల అవసరం దావురించినపుడు ఎటువంటి నమాజు లేదు. (ముస్లిం 560).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి