ప్రస్తుత విభాగం : model
పాఠం నఫిల్ నమాజు చదవకూడని సమయాలు ఏమిటి ?
నఫిల్ నమాజులు చదవకూడని సమయాలు
నఫిల్ (స్వచ్ఛంద) నమాజులను ఏ సమయాలలోనైనా ఆచరించవచ్చును, అయితే కొన్ని నిర్దిష్ట సమయాలలో కొన్ని కారణాల వల్ల ఈ నమాజులను ఆచరించడం నివారించబడినది. ఆ సమయాలలో నరకాగ్నిని మండింపజేయడం వలన, అవిశ్వాసుల ప్రార్ధనా సమయాల వలన, సూర్యుడు షైతాన్ కొమ్ముల మధ్య ఉదయించే సమయం అయి ఉండడం వలన. వగైరా. అయితే ఈ సమయాలలో చదవకుండా మిగిలిఉన్న ఫరద్ నమాజులు లేదా కారణంతో కూడుకున్న నఫిల్ అనగా తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించినప్పుడు చేసే రెండు రెకాతుల) నమాజు ఆచరించవచ్చు. అయితే సాధారణ దిక్ర్ (స్మరణ) అనేది ఏ సమయంలో నైనా చేయవచ్చు, దీనికి సమయ నిబంధన అనేది వర్తించదు.
ఫజర్ నమాజు పిదప సూర్యోదయమయి పొద్దెక్కి, ఎండ తాపం పెరిగి సూర్యుడు బల్లెము పరిమాణమంత పైకి వచ్చిన తరువాత దీని సమయం మొదలవుతుంది, సమశీతోష్ణ దేశాలలో ఈ సమయం సూర్యోదయం తర్వాత దాదాపు 20 నిమిషాల తర్వాత మొదలవుతుంది.
ఫజర్ నమాజు అయిపోయిన తరువాత సూర్యోదయం అయ్యే వరకూ నమాజు చదివిన చోటనే కూర్చొని దైవస్మరణ చేస్తూ ఉండేవారు.
అసర్ నమాజు తరువాత నుండి సూర్యాస్తమం వరకు