ప్రస్తుత విభాగం : model
పాఠం జుమా నమాజు
అల్లాహ్ శుక్రవారం నాడు దుహర్ నమాజు సమయంలో శుక్రవారపు నమాజును విధిగా చేశాడు. ఇది ఇస్లాం యొక్క అత్యంత గొప్ప ఆచారాలలో మరియు అత్యంత ముఖ్యమైన కర్తవ్యాలలో ఒకటి. ఈ నమాజు కోసం ముస్లిములు వారానికి ఒకసారి సమావేశమవుతారు, ఈ శుక్రవారపు ఖుత్బాను వినడం ద్వారా ఇమాం నుండి ఇస్లాం యొక్క ఉపదేశాలను, నిర్దేశాలను పొందుతారు, ఆ తర్వాత శుక్రవారపు నమాజును ఆచరిస్తారు.
శుక్రవారం రోజు యొక్క విశిష్ఠత
శుక్రవారం అనేది వారములోని ఒక గొప్ప మరియు గౌరవప్రదమైన రోజు, ఇతర రోజులకు భిన్నంగా అల్లాహ్ దీనిని ఎంచుకున్నాడు, మరియు దీనికి కొన్ని అధిక ప్రాధాన్యతలను, ప్రత్యేకతలను ఇచ్చిఉన్నాడు అవి :
.ప్రవక్తల వారివారి ఉమ్మతులందరిలో (వారి వారి అనుచర సమాజాలలో) ప్రవక్త ముహమ్మద్ (స) వారి ఉమ్మతుకు అల్లాహ్ విశిష్ఠతను నోసంగాడు, దైవప్రవక్త(స) వారు ఇలా సెలవిస్తున్నారు : మనకన్నా ముందు ఉన్నవారికి అల్లాహ్ ఈ శుక్రవారాన్ని తప్పించాడు, యూదులకు శనివారాన్ని, క్రైస్తవులకు ఆదివారాన్ని ఎంచాడు, ఈ శుక్రవారాన్ని అల్లాహ్ మన భాగ్యంలో ఉంచాడు(ముస్లిం 856)
నిశ్చయంగా ఆదం(అ) శుక్రవారం నాడు సృష్టించబడ్డారు, మరియు ఆ రోజుననే ప్రళయం సంభవిస్తుంది. దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు: "సూర్యుడు ఉదయించిన ఉత్తమ రోజు శుక్రవారం. ఈ రోజున ఆదం(అ) సృష్టించబడ్డారు, ఆ రోజున వారు స్వర్గంలో ప్రవేశించారు, మరియు ఆ రోజున వారు స్వర్గం నుండి తీయబడ్డారు. ప్రళయం శుక్రవారం నాడే సంభవిస్తుంది." (ముస్లిం 854).
జుమా నమాజు ఎవరికి తప్పనిసరి ?
జుమా నమాజుకు ముందు గుసుల్ చేయడం, జుమా ఖుద్బా మొదలవకముందే తొందరగా మసీదుకు హాజరు అవడం మంచి దుస్తులు తొడుగుకొని సుగంధం పూసుకోవడం అభిలషణీయం
ముస్లిములు, అనగా విశ్వాసులు జుమా కోసం మసీదులో సమావేశమవుతారు. వారికి ఇమాం నాయకత్వం వహిస్తాడు. ఆయన వేదిక ఎక్కి, నమాజు చేసే వారి ముందు నిలబడి, రెండు ఉపన్యాసాలు చేస్తాడు. వాటి మధ్య కొద్దిసేపు కూర్చోవడం ద్వారా విరామం తీసుకుంటాడు. ఈ రెండు ఖుత్బాల ద్వారా ఆయన జనులను అల్లాహ్‌కు భయపడమని వారికి గుర్తుచేస్తాడు, ప్రబోదనలు, ఉపదేశాలు మరియు ఖుర్ఆన్ వచనాలు వారికి చెబుతాడు.
శుక్రవారం నమాజుకోసం వచ్చినవారు ఇమాము యొక్క ఉపన్యాసాన్ని జాగ్రత్తగా ఆలకించాలి, ఆ సమయంలో మాట్లాడడం లేదా అక్కడున్న తివాచీలు, గులాకరాళ్ళు, మట్టితో ఆటలాడడం లేదా ధ్యాసను వాటిపై ఉంచడం, ఉపన్యాసం యొక్క ప్రయోజనం నుండి దూరం అవడం, పరద్యానంలో ఉండడం వంటివి నిషేడించబడినది.
జుమా నమాజు తప్పిపోయిన వ్యక్తి ఏమి చేయాలి
.జుమా నమాజు అనేది మస్జిదులో సామూహికంగా చయడం అనేది ధర్మబద్దం చేయబడినది, ఎవరైనా జుమా నమాజును పొందలేకపోతే దానికి బదులుగా ఆ వ్యక్తి దుహర్ నమాజు చదువుకోవాలి, జుమా నమాజు అనేది అతనికి చెల్లదు.
జుమా నమాజుకు ఆలస్యంగా వస్తే ఏమి చేయాలి
జుమా రోజున నమాజుకులో రెండవ రెకాతు కూడా దాదాపు ముగిసిన సమయంలో వచ్చినపుడు అతడు దొహర్ నమాజు పూర్తి చేసుకోవాలి
.స్త్రీ లేదా ప్రయాణములో ఉన్న వ్యక్తికి జుమా నమాజు అనేది తప్పనిసరి కాదు అయితే ఒకవేళ వీరు జమాతుతో కలిసి జుమా నమాజు చదివే అవకాశం దొరికితే వారు చదవవచ్చు, ఆ సమయంలో వారికి ఈ జుమా కారణంగా దుహర్ అనేది మింహాయించబడుతుంది.
జుమాకు హాజరు అవడం అనేది విధి
.శుక్రవారపు నమాజుకు హాజరు అయ్యే స్తోమత కలిగిన వ్యక్తులు తప్పనిసరిగా హాజరు అవ్వాలని ధర్మం నొక్కి చెబుతోంది, దీనిని వదిలి ఇతర ప్రాపంచిక కార్యాకలాపాలలో నిమిగ్నమవడం నుండి హెచ్చరిస్తోంది. తన దివ్యవచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమమైనది(అల్-జుముఆ : 9)
శుక్రవారపు నమాజును నిర్లక్ష్యం చేసే వ్యక్తికి దైవప్రవక్త (స) వారు ఎలాంటి హెచ్చరికలు చేశారు?
సరైన కారణం లేకుండా శుక్రవారపు నమాజును విడిచిపెట్టే వ్యక్తి యొక్క హృదయం పై అల్లాహ్ ముద్ర వేసేస్తాడు అని హెచ్చరించారు. తన ప్రబోదనలో దైవప్రవక్త(స) వారు ఇలా సెలవిచ్చారు : "ఎవరైతే సరైన కారణం లేకుండా మూడు శుక్రవారపు నమాజులను నిర్లక్ష్యంగా విడిచిపెడతాడో, అల్లాహ్ అతడి హృదయం పై ముద్రవేసేస్తాడు." (అబూ దావూద్ 1052, అహ్మద్ 15498). ముద్రవేయడం అనగా సీలు వేయడం, మూసివేయడం అని అర్ధం. అనగా ఇటువంటి వారి హృదయాలను అల్లాహ్ కపటవిశ్వాసులు(మునాఫిఖ్ లు) మరియు అవిధేయుల హృదయాలవలే మలిచేస్తాడు.
ఇలాంటి కారణాల వల్ల జుమా నమాజుకు హాజరు కాలేని పరిస్తితి ఉన్నప్పుడు వారికి మినహాయింపు ఇవ్వబడినది, ఉదాహరణకు: ఏదైనా అసాధారణమైన కష్టం వచ్చిపడడం, ఏమైనా తీవ్ర నష్టం వాటిల్లే విషయం ఉత్పన్నమవడం లేదా అనారోగ్య సమస్య ఎదురవడం వగైరా.
ఉద్యోగము లేదా డ్యూటీ కారణంగా జుమాకు ఆలస్యం అవడం అనేది సమ్మతించదగ్గ విషయమేనా ?
రెండు సందర్భాల్లో తప్ప జుమా నమాజు విధి అయి ఉన్నవారికి వారి పని ఈ నమాజు చదవడానికి అడ్డు కాకూడదు
చాలా పెద్ద అవసరం కలిగిన ఏదైనా ప్రత్యేక పని ఉంది ఆ సమయంలో ఆ పనిలో ఉండడం తప్పనిసరి అయిన సందర్భము అయిఉండడం, ఆ పని వదిలేయడం కారణంగా చాలా పెద్ద నష్టం జరిగిపోయే అవకాశం ఉండడం, అతడు తప్ప ఆ పని ఇతరులు చేసే అవకాశం లేని పరిస్తితి ఉండడం.
ఉదాహరణలు
ఈ ఉద్యోగం అతనికి మరియు అతను పోషించే వారికి కనీస జీవన అవసరాలు తీరడానికి ఇదొక్కటే ఆధారం అయితే, ఇతర మార్గం లేనట్లయితే, ఇలాంటి పరిస్థితిలో పనిలో కోనసాగుతూ శుక్రవారపు నమాజ్‌ను విడువడం క్షమించదగినది. అయితే, తప్పనిసరి పరిస్థితి కింద మాత్రమే ఇది వర్తిస్తుంది. అతను మరొక ఉద్యోగం దొరికే వరకు లేదా అతనికి మరియు అతను పోషించే వారికి తగినంత ఆహారం, నీరు మరియు ఇతర అవసరాలను తీర్చే మార్గం దొరికే వరకు ఈ స్థితిని కొనసాగించవచ్చు. అయితే, ఈ స్థితి నుండి బయటపడడానికి కొత్త జీవనోపాధి కోసం అతడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి.