నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం ఎవరెవరికి ఉపవాసాలను విరమించుకునే అనుమతిని అల్లాహ్ ఇచ్చి ఉన్నాడు

జనులలో కొంతమంది యొక్క ఉపశమనం కోరుతూ మరియు వారిపై దయచూపుతూ అల్లాహ్ రమదాన్ ఉపవాసాలను విరమించుకునే అనుమతిని వారికి ఇచ్చి ఉన్నాడు.

ఏ ఏ వర్గాల వారికి అల్లాహ్ ఉపవాసం నుండి మినహాయింపు  ఇచ్చాడో తెలుసుకోవడం 

ఎవరెవరికి ఉపవాసాలను విరమించుకునే అనుమతిని అల్లాహ్ ఇచ్చి ఉన్నాడు

జనాలలో కొందరి పట్ల తేలికమయం చేయడానికి, దయతలచడానికి రామదాన్ మాసములోని ఉపవాసాల నుండి వారికి మినహాయింపును ఇచ్చాడు.

1. ఉపవాసం కారణంగా అనారోగ్యం మరింత పెరిగే అవకాశం ఉన్నపుడు

ఇలాంటి వ్యక్తులు ఉపవాసాన్ని విరమించుకోవచ్చును, రమదాన్ నెల అయిపోయిన తరువాత ఒకవేళ అతని ఆరోగ్యం చక్కబడితే వదిలేసిన ఉపవాసాలను పూర్తిచేయవలసి ఉంటుంది.

2. ఉపవాసం ఉండలేని స్థితిలో ఉన్న వ్యక్తి

వృద్ధాప్యం లేదా నయం కాని అనారోగ్యం కారణంగా ఉపవాసాలు వదిలేయడానికి అనుమతి ఉంది, అయితే వదిలేయబడే ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక బీదవానికి ఆ ప్రాంతములో అలవాటుగా రోజూ తినే ప్రధాన ఆహారాన్ని ఒకటిన్నర కిలోల పరిమాణంలో దానంగా ఇవ్వాలి.

3. బహిష్టు మరియు ప్రసవానంతర రక్తస్రావం జరిగే స్త్రీలు

ఈ స్థితిలో వీరిరువురికీ ఉపవాసం ఉండడం అనేది నిషేడించబడినది, ఈ స్థితినుండి బయటకు వచ్చిన తరువాత వదిలేయబడిన ఉపవాసాలను పూర్తి చేయవలసి ఉంటుంది.

4. గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు

ఒకవేళ గర్భిణీ స్త్రీ లేదా పాలిచ్చే తల్లి తనకు లేదా పుట్టబోయే బిడ్డకు లేదా పాలిచ్చే బిడ్డకు హాని కలిగే అవకాశం ఉందని భావిస్తే, ఆమె ఉపవాసాలు ఉండకుండా ఉండవచ్చు, అయితే ఆ ఉపవాసాలను తరువాత పూర్తి చేసుకోవాలి. దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు ఇలా సెలవిచ్చారు: "ఓ అనస్, కూర్చో నేను నీకు ఉపవాసం లేదా ఉపవాసాల గురించి చెబుతాను. ఖచ్చితంగా అల్లాహ్ ప్రయాణికుడికి సగం నమాజును సడలించాడు, మరియు ప్రయాణికుడు, గర్భిణీ స్త్రీ మరియు పాలిచ్చే తల్లికి ఉపవాసాన్ని మాఫీ చేశాడు." (ఇబ్ను మాజా 1667)

5. ప్రయాణికుడు

ప్రయాణ సమయంలో మరియు ప్రయాణంలో ఎక్కడైనా నాలుగు రోజుల కన్నా తక్కువ సమయం తాత్కాలికంగా బస చేస్తున్నపుడు ఈ సందర్భంగా ఉపవారం వదిలివేసే అనుమతి ఉన్నది. అయితే మిగిలి పోయే ఆ ఉపవాసాలను తరువాత పూర్తి చేసుకోవలసి ఉంటుంది.

దివ్యగ్రంధములో అల్లా ఇలా సెలవిస్తున్నాడు : కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు.(అల్ బఖరా : 185).

కారణం లేకుండా ఉపవాసాన్ని భంగపరచుకున్న వ్యక్తి విషయంలో ఉన్న నియమాలు ?

రమదాన్ నెలలో ఎటువంటి కారణం లేకుండా ఉపవాసాన్ని వదిలేయడం అనేది ఒక అపరాధం మరియు పాపం అవుతుంది. అల్లాహ్ యొక్క ఆదేశాన్ని అతిక్రమించినందుకు ఆ వ్యక్తి అల్లాహ్ కు మనస్ఫూర్తిగా ప్రాయశ్చితం మరియు క్షమాపణ కోరుకోవలసి ఉంటుంది. వదిలేసిన ఆ ఉపవాసాన్ని తరువాత పూర్తి చేసుకోవలసి ఉంటుంది. అయితే, భార్యతో సంభోగం కారణంగా ఉపవాసం భంగం చేసిన వ్యక్తి, ఆ రోజు ఉపవాసం కొనసాగించడంతో పాటు ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక బానిసను విముక్తి చేయాలి. అంటే, ఒక ముస్లిం బానిసను కొని, విడిపించాలి. ఇస్లాం ప్రతి సందర్భంలోనూ మానవుడిని బానిసత్వం నుండి విముక్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. నేడు బానిసలు లేనందున, ఆ వ్యక్తి రెండు నెలలు వరుసగా ఉపవాసం ఉండాలి. అది కూడా సాధ్యం కాకపోతే, అరవై మంది పేదలకు ఆహారం తినిపించాలి.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి