ప్రస్తుత విభాగం : model
పాఠం నఫిల్(స్వచ్ఛంద) ఉపవాసాలు
ఒక సంవత్సరములో ఒక నెల రోజుల ఉపవాసాన్ని అల్లాహ్ విధిగావించాడు, అయితే స్తోమత కలిగిన వారు ఈ నెలరోజులే కాకుండా ఇతర రోజులలో కూడా (సున్నత్ లేదా నఫిల్) ఉపవాసాలను ఉండడాన్ని అల్లాహ్ కోరుకుంటున్నాడు, ఇది మరింత పుణ్యము మరియు అల్లాహ్ కు సామీప్యముకు కారణం అవుతుంది. అటువంటి ఉపవాసాలలో కొన్ని :
ఇది ముహర్రం నెల యొక్క పదవ రోజు. ముహర్రం నెల అనేది ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల. ఈ రోజున అల్లాహ్ దైవప్రవక్త మూసా(అ)ను ఫిరౌను నుండి రక్షించాడు. ఈ కారణంగా ముస్లిములు ప్రవక్త మూసా(అ) వారి రక్షణకు కృతజ్ఞతగా, మన ప్రవక్త ముహమ్మద్ (స) వారి ఆచరణను అనుసరిస్తూ ఈ రోజు ఉపవాసం ఉంటారు. దైవప్రవక్త (స) వారిని ఈ రోజు ఉపవాసం గురించి అడిగినప్పుడు, "గత సంవత్సరపు పాపాలకు క్షమించివేస్తుంది" అని సమాధానం ఇచ్చారు (ముస్లిం 1162). తొమ్మిదవ రోజు కూడా ఉపవాసం ఉండటం మంచిది. ఎందుకంటే దైవప్రవక్త (స) "నేను వచ్చే సంవత్సరం వరకు ఉండగలిగితే, తొమ్మిదవ రోజు కూడా ఉపవాసం ఉంటాను" అని సెలవిచ్చారు (ముస్లిం 1134).
దుల్ హిజ్జా నెలలో తొమ్మిదవ రోజు. ఇస్లామీయ క్యాలెండర్‌లో పన్నెండవ నెల. ఈ రోజున, హజ్ యాత్రికులు అరఫా మైదానంలో సమావేశమై అల్లాహ్ ను వేడుకుంటారు, ఆయనను స్తుతిస్తారు మరియు నమాజులు చేస్తారు. ఇది సంవత్సరంలోనే ఉత్తమమైన రోజు. హజ్ లో ఉన్నవారు కాకుండా, ఈ రోజు ఉపవాసం ఉంచడం సున్నతు. దైవప్రవక్త(స) వారిని ఈ రోజు యొక్క ఉపవాసం గురించి అడిగినపుడు వారు (స) ఇలా సెలవిచ్చారు : "ఇది గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం యొక్క (పాపాలను) క్షమించి వేస్తుంది" (ముస్లిం 1162).
షవ్వాలు నెల ఇస్లామీయ క్యాలెండరు ప్రకారంగా పదవ నెల. ఈ నెల గురించి ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : “ఎవరు రమజాను మాసమెల్లా ఉపవాసాలు ఉండి, షవ్వాల్ మాసములో ఆరు ఉపవాసాలుంటాడో అతనికి అనునిత్యం ఉపవాసాలున్నంత పుణ్యం లభిస్తుంది.” (ముస్లిం 1164).
అబూ హురైరా (ర) వారి ఉల్లేఖనం : నా జీవితంలో ఈ మూడు విషయాలు వదలవద్దు అని నా సన్నిహిత మిత్రుడు (ప్రవక్త (స)) ఉపదేశించారు, ప్రతి నెల యొక్క మూడు ఉపవాసాలు, దుహా నమాజు మరియు నిద్రకు ఉపక్రమించే ముందు వితర్ నమాజు. (బుఖారీ 1178, ముస్లిం 721)