ప్రస్తుత విభాగం : model
పాఠం ఈద్ అల్ ఫిత్ర్ మరియు ఈద్అల్అద్'హా
ఈద్ అల్ ఫిత్ర్
ఈద్-ఉల్-ఫిత్ర్ షవ్వల్ నెల మొదటి రోజున జరుపుకుంటారు. ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో పదవ నెల. ఈ పండుగ రమదాను నెల చివరి రోజు ముగిసిన తర్వాత వస్తుంది, కాబట్టి దీనిని ఈద్-ఉల్-ఫిత్ర్ అని పిలుస్తారు.(ఫిత్ర్ అంటే విరమించడం – ఇఫ్తార్ అంటే ఉపవాసాన్ని విరమించడం) ఈ రోజు విశ్వాసులు ఉపవాసం ముగించి భోజనం చేస్తూ, రంజాన్ మాసం పాటు చేసిన ఉపవాసానికి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. “ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగ టానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి!” (అల్-బఖరా: 185).
ఈద్ అల్ ఫిత్ర్ రోజు ధర్మసమ్మతమైనవి ఏమిటి ?
ఈద్ రోజు మరియు రాత్రి (సూర్యాస్తమం తరువాత కొత్త రోజు ప్రారంభం అవుతుంది కాబట్టి అది ఈద్ రాత్రి అనబడుతుంది) తనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని కలిగి ఉన్న ప్రతి ముస్లిము, పేదలకు మరియు అసరంలో ఉన్న వారికి ఆ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాల నుండి ఒక 'సా' (సుమారు 3 కిలోలు) ఆహారాన్ని ఫిత్రా దానం చేయడం అనేది అల్లాహ్ తప్పనిసరి చేశాడు, ఈ దానం వలన ఈద్ రోజున ఎవరూ ఆకలితో ఉండకుండా ఉంటారు.
రమదాను మాసపు చివరి రోజు యొక్క మగ్రిబ్ సమయం నుండి పండుగ నమాజు వరకు, పండుగకు ఒక రోజు, రెండు రోజుల ముందు కూడా ఇవ్వవచ్చు
ఒక సా అనేది ఒక పురాతన కొలమానం. ఇది ఒక వ్యక్తి యొక్క రోజువారీ ఆహార ధాన్యాల కొలమానం. ఈ కొలమానం సాధారణంగా గోధుమలు, బియ్యం లేదా తేదీలతో కొలుస్తారు. దీనిని బరువు ద్వారా అంచనా వేయడం సులభం. ఆధునిక కొలమానాలతో పోల్చితే, ఒక ‘సా’ అనేది సుమారు 3 కిలోల బరువుకు సమానం.
పండుగ రోజు మరియు రాత్రి తనకు మరియు తన భార్య, పిల్లల వంటి తనపై ఆధారపడి ఉన్న వ్యక్తులకు అవసరమైన దాని కంటే ఎక్కువ ఆహారం ఉన్న ప్రతి ముస్లిము ఈ ఫిత్రా దానం చేయడం తప్పనిసరి. గర్భంలో ఉన్న బిడ్డ (పిండం) తరపున కూడా దానం చేయడం మంచిది. ప్రతి వ్యక్తికి ఒక ‘సా’ (ఒక నిర్దిష్ట కొలత) దానం చేయాలి, ఇది సుమారు 3 కిలోగ్రాములకు సమానం.
ఫిత్రా జకాటులో దాగి ఉన్న విజ్ఞత
అనవసరమైన పనులు, అశ్లీలతకు సంబందించి ఏమైనా చిన్నచిన్న తప్పులు ఉపవాసి ద్వారా జరిగి ఉంటే దానికి పరిహారంగా ఈ ఫిత్రాను ప్రవక్త (స) వారు ధర్మబద్దం చేశారు, (అనగా ఉపవాసం ఉన్న వ్యక్తితో జరిగిన తప్పులు, పొరబాట్లు జరిగి ఉంటే అలాగే ఉపవాస మర్యాదలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే దానిని శుద్ధి పరచాడానికి ఫిత్రా అనేది ఉన్నది )
ముస్లిములకు ఇది రెండవ పండుగ. దిల్ హిజ్జా పదవ తారీకున ఈ పండుగ ఉంటుంది (ఇస్లామీయ క్యాలెండరులో పన్నెడవ మాసము). ఈ పండుగలో పలు శ్రేష్ఠతలు ఉన్నాయి : వాటిలో
సంవత్సరములోని రోజులలోకెల్లా శ్రేష్టమైన, ఉన్నతమైన రోజులు
సంవత్సరంలోని ఉత్తమ రోజులు జుల్ హిజ్జా నెలలోని మొదటి పది రోజులు. దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు ఇలా సెలవిచ్చారు: "ఈ పది రోజుల కంటే అల్లాహ్ వద్ద ఇష్టమైన సత్కార్యాల రోజులు ఏవీ లేవు." దానికి సహచరులు ఇలా ప్రశ్నించారు: "ఓ దైవప్రవక్తా !, అల్లాహ్ యొక్క మార్గంలో పోరాటం కూడా కాదా?" ప్రవక్త (స) ఇలా సమాధానం ఇచ్చారు: "అవును, అల్లాహ్ యొక్క మార్గంలో పోరాటం కూడా కాదు, అయితే అతను తన ప్రాణాన్ని, ధనాన్ని తీసుకెళ్లి, ఏమీ లేకుండా తిరిగి రాకుండా (అమరుడైతే) తప్ప." (బుఖారీ 969, తిర్మిది 757)
ఇందులో హజ్జ్ యొక్క మహోన్నతమైన ఆచరణలు ఉన్నాయి. ఉదాహరణకు : దైవగృహం యొక్క తవాఫు, ఖుర్బానీ ఇవడం మరియు జమారాత్ లో కంకర్లు రువ్వడం.
ఈద్ అల్ అద్హా లో చేయవలసిన ధమబద్దమైన ఆచరణలు ఏమిటి ?
ఈద్ అల్ అద్హా రోజున హజ్ లో లేని వ్యక్తికి ధర్మబద్దం చేయబడిన అంశాలన్నీ చేయవచ్చు, అయితే ఫిత్రా జకాతు అనేది ఇందులో లేదు, ఇది కేవలం ఈద్ అల్ ఫిత్ర్ లో మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది, ఈ పండుగలో అల్లాహ్ కు సామీప్యం పొందడంలో ఉన్న భిన్నమైన విషయం ఖుర్బాని.
ధుల్ హిజ్జా నెలలో పదవ రోజున ఈద్-అల్-అద్’హా (బక్రీద్) పండుగ సమయంలో, సూర్యోదయం తర్వాత నుండి 13వ రోజు సూర్యాస్తమయం వరకు, అల్లాహ్ సామీప్యత కొరకు గొర్రె, ఆవు లేదా ఒంటెను ఖుర్బానీ ఇచ్చే జంతువును "ఉద్’హియ" అని పిలుస్తారు. “కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ కూడా (ఆయన కొరకే) ఇవ్వు!” (సూరహ్ కావ్సర్: 2). ఈ వాఖ్యములో "నమాజు" అనేది ఈద్ ప్రార్థనను మరియు "ఖుర్బానీ" అనేది "ఉద్’హియ"ను సూచిస్తుంది.
దాని గురించిన నియమం
ఇది తప్పనిసరి చేయబడిన సున్నతు, స్తోమత కలిగిన ప్రతి ఒక్క విశ్వాసి తన మరియు తన కుటుంబం తరపున ఖుర్బానీ అనేది చేయవలసి ఉంటుంది.
ఖుర్బానీ చేయదలచిన వ్యక్తి దుల్ హిజ్జ యొక్క నెలవంకకు దర్శించిన దగ్గరి నుండి ఖుర్బానీ చేసేంత వరకూ తన వెంట్రుకలను, గోళ్ళను మరియు చర్మము పై ఉండే ఇతర ఏ వెంట్రుకలనూ తీయకూడదు అనేది ధర్మబద్ధం చేయబడినది.
ఖుర్బానీకు సిద్ధం చేయబడిన జంతువు గురించిన నియమాలు
ఉద్’హియ కోసం గొర్రెలు, మేకలు, ఆవులు లేదా ఒంటెలు మాత్రమే చెల్లుతాయి. ఇతర జంతువులు లేదా పక్షులను ఖుర్బానీ ఇవ్వడం చెల్లదు. ఒక వ్యక్తి మరియు అతని కుటుంబానికి ఒక గొర్రె లేదా మేక సరిపోతుంది. ఏడుగురు వ్యక్తులు కలిసి ఒక ఆవు లేదా ఒంటె ఖుర్బానీ ఇవ్వవచ్చు.
అవసరమైన వయసుకు చేరడం
ఖుర్బానీ జంతువులకు ఉండవలసిన వయసు : గొర్రె ఆరు నెలలు, మేక ఒక ఏడాది, ఆవు రెండేళ్లు, ఒంటె ఐదేళ్ల వయసు కలిగి ఉండాలి.
జంతువు ఏ లోపాలు లేకుండా బాగుండాలి
నాలుగు రకాల జంతువులు ఖుర్బానీ ఇవ్వడం కోసం చెల్లవు అని దైవప్రవక్త (స) వారు సెలవిచ్చారు : “స్పష్టంగా ఒక కన్ను లేని జంతువు, స్పష్టంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంతువు, స్పష్టంగా ఒక కాలు చెడి, నడవలేని జంతువు, బాగా బక్కపాలచగా ఉన్న జంతువు. (నసాయి 4370, తిర్మిధీ 1497)