నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం శీతాకాలములో సుద్ధీ శుభ్రతలు

చలికాలములో సుద్ధీశుభ్రతల గురించి ప్రత్యేక నియమాలు, ఈ పాఠములో వాటి గురించిన కొన్ని అంశాలను నేర్చుకుందాము

  • చలికాలములో శుభ్రతను పాఠించే విధానము
  • మేజోళ్లపై మసహ్ చేసే నియమనిబంధనల గురించిన అవగాహన
  • తయమ్ముమ్ చేసే విధానాన్ని తెలుసుకోవడం

వర్షపు నీరు యొక్క స్వచ్ఛత

వర్షపు నీరు అనేది పరిశుభ్రమైనది మరియు శుద్ధపరిచేది కూడా, తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : {మరియు మేము ఆకాశం నుండి స్వచ్ఛమైన నీటిని కురిపిస్తాము} (అల్-ఫుర్కాన్: 48). నమాజు చదివేవారి బట్టలపై లేదా బూట్లకు రోడ్లపై ఉన్న వర్షపు నీరు లేదా మట్టితో కలిసిన నీరు బడినా కూడా అది శుద్ధమైనదే.

చలికాలములోనూ వదూను పరిపూర్ణంగా చేయడం

వదూను సక్రమంగా చేయడం (చలి మరియు వేడికి సంబందం లేకుండా) అనేది అల్లాహ్ కు దగ్గరపరచే విషయాలలో ఒకటి, దైవ ప్రవక్త (స) వారు ఇలా ప్రబోదించారు : “పాపాలను తుడిచివేసే మరియు స్థానాలను ఉన్నతపరచే విషయాల గురించి మీకు తెలుపమంటారా ? వారు (సహచరులు) ఇలా అన్నారు : తప్పకుండా ఓ దైవప్రవక్తా. “వదూ చేసేటపుడు అవయవాలకు పూర్తి స్థాయిలో నీరు చేరడం, మస్జిదు వైపు అడుగులు ఎక్కువగా పడడం, ఒక నమాజు తరువాత మరో నమాజు కోసం ఆత్రుతగా ఎదురు చూడడం. పటిష్ఠత అంటే ఇదే. (ముస్లిం : 251). వదూను సక్రమంగా, పరిపూర్ణంగా చేయడం.

చల్లటి నీటి నుండి తప్పించుకోవడానికి అవయవాలను కడగడంలో నిర్లక్ష్యం వహించడం వంటి తప్పులు చేయడం. ఉదాహరణకు, కొందరు వ్యక్తులు తమ ముఖాన్ని పూర్తిగా కడగకపోవడం లేదా కేవలం తుడుచుకోవడం చేస్తారు, లేదా చేతులు లేదా కాళ్లను పూర్తిగా కడగకుండా ఉంటారు. ఇది అనుమతించబడదు. ఒకవేళ వారికి సామర్థ్యం ఉంటే, వారు వుదూను పూర్తిగా చేయవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. సామర్థ్యం లేకపోతే, వేడి నీటితో వదూ చేయడం వంటి చర్యలు తీసుకోవాలి.

చలికాలంలో వుదూ చేసుకోవడానికి నీటిని వేడి చేయడంలో ఎటువంటి తప్పు లేదు. దీని వల్ల వుదూ యొక్క ప్రతిఫలం ఏ మాత్రం తగ్గదు. అదేవిధంగా, వుదూ తర్వాత శరీర భాగాలను తుడవడం కూడా సరైనదే. దీని వల్ల కూడా వుదూ యొక్క ప్రతిఫలం తగ్గదు. ఒకవేళ చల్లటి నీటితో వుదూ చేయడం కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటే, లేదా పూర్తి స్థాయిలో వదూ చేయలేని పరిస్తితి ఉంటే పైన తెలుపబడిన జాగ్రత్తలను వదలకూడదు, వాటిపై తప్పకూడా అమలు చేసుకోవాలి.

తయమ్ముమ్

తయమ్ముమ్ చేసే విధానం : నేలపైనా మట్టి పై రెండు చేతులతో కొట్టి ఆ తరువాత ఆ రెండు చేతులతో ముఖానికి ఒకసారి మసహ్ చేసుకుని ఆ తరువాత కుడి అరచేతితో ఎడమ అరా చేతిని ఆతరువాత ఎడమ అరచేతితో కుడి అరచేతిని మసహ్ చేసుకోవాలి.

తయమ్ముమ్ చేసుకునే అనుమతి ఎప్పుడు ఉంటుంది ?

నీలు అసలేమాత్రం దొరకనపుడు లేదా అతి తక్కువ నీరు ఉంది అది ఇతర అత్యవసర వాటికి అవసరం ఉన్నప్పుడూ లేదా అనారోగ్యం లేదా వేపరీతమైన చలి ఉండి నీటిని వినియోగించడం కష్టతరమయి ఉన్నపుడు తయామ్మం చేసుకోవడాన్ని ధర్మబద్ధం చేయబడినది,

మేజోళ్లపై మసహ్ చేయడం

సాక్సులపై మసహ్ చేయడం : పూర్తి శుద్ధి(తహారా)లో ఉండి, పాదాలను పూర్తి స్థాయిలో కప్పి ఉంచే మేజోళ్ళు(సాక్సులు) లేదా చర్మపు మేజోళ్ళ వంటివి ధరించినపుడు, తల మరియు చెవుల మసహ్ చేసుకున్న తరువాత సాక్సులను తీసి పాదాలు కడుగుకోవలసిన అవసరం లేదు, దానికి బదులుగా వాటి పైనే చేతితో మసహ్( పాదం పై ఒక సారి తడి చేతితో రాసుకోవడం ) చేసుకుంటే సరిపోతుంది.

వస్త్రముతో లేదా తోలుతో చేయబడిన మేజోళ్లపై మసహ్ చెల్లుబాటు కావడానికి షరతు

١
రెండు పాదాలూ శుద్ధత(తాహెర్ )తో ఉండాలి
٢
మేజోల్లద్వారా రెండు పాదాలు పూర్తి స్థాయిలో కప్పబడి ఉండాలి
٣
పూర్తిగా వాసుచేసుకున్న తరువాత, వదూలో పాదాలను పూర్తిగా కడుగుకున్న తరువాత మేజోళ్లను తొడుగుకోవాలి

మేజోళ్లపై మసహ్ యొక్క వ్యవధి

నివాసితులకు ఒక రోజు మరియు ఒక రాత్రి (24 గంటలు)
ప్రయాణికుడికి మూడు రోజులు మరియు మూడు రాత్రులు (72 గంటలు )

వదూ చేసుకున్న తరువాత మొదటి సారి మసహ్ చేసుకున్న తరువాత నుండి దాని సమయం ప్రారంభమవుతుంది.

పూర్తి శుద్ధావస్తలో(వదూ చేసి ఉన్న స్థితిలో) సాక్సులను తొడిగి లేనపుడు వాటిపై మసహ్ చేసే అనుమతి లేదు, అలాగే మసహ్ వ్యవధి అయిపోవడం లేదా తప్పనిసరిగా స్నానం చేయవలసి రావడం వంటి స్థితులలో కూడా మేజోళ్లపై మసహ్ చేసే అనుమతి లేదు. సాక్సులను తీసివేసి మరలా శుద్ధత పొందిన తరువాతనే తొడుగుకోవలసి ఉంటుంది.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి