నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం అల్లాహ్ యొక్క ఉనికి పై విశ్వాసం

అల్లాహ్ యొక్క ఉనికి అనేది ఒక తిరుగులేని సత్యం మరియు యదార్ధం. మనం చూస్తున్న ఈ జీవరాశులన్నీ ఆయన ఉనికి లేనిదే వాటి అస్తిత్వం కూడా లేదు. ఈ పాఠములో అల్లాహ్ యొక్క ఉనికికి సంబందించిన ఆధారాల గురించి తెలుసుకుందాము.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఉనికికి  సంబందించిన ఆధారాల పట్ల జ్ఞానం కలిగి ఉండడం 

.అల్లాహ్ ను విశ్వసించడం యొక్క అర్ధం.

అల్లాహ్ యొక్క ఉనికిని సంపూర్ణంగా విశ్వసించడం, ఆయనే అసలైన పాలకుడు, పోషకుడు అని, ఆయనే సర్వ ఆరాధనలకు అర్హుడని నమ్మడంతోపాటు ఆయనకు చెందిన ప్రత్యేక నామాలతో కూడుకున్న గుణగనాలను విశ్వసించడం.

సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ ముందు చేసే సాష్టాంగాలు(సజ్దాలు) ఆయన పట్ల చూపే అణకువ, విధేయతల యొక్క అత్యున్నతమైన వ్యక్తీకరణలు.

అల్లాహ్ ద్వారా పుట్టింపబడిన స్వభావం

దైవాన్ని విశ్వసించడం అనేది మనిషి యొక్క చాలా సహజమైన స్వభావం, దాని ఆధారాలను ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరం ఉండదు, అందువలననే మతాలు, ధర్మాలు వేరైనా అత్యధిక ప్రజానికం దైవాన్ని విశ్వసిస్తారు.

.మనలో ఉన్న సహజ స్వభావంతో ఆయన ఉనికిని హృదయాల లోతుల నుండి బలంగా గ్రహిస్తాము, విశ్వసిస్తాము. కష్టాలలో, కడగండ్లలో ఆయన శరణే వేడుకుంటాము. ధర్మాన్ని విశ్వసించడం అనే భావన ప్రతి మనిషి యొక్క హృదయంలో అల్లాహ్ ద్వారా సహజంగానే నాటబడి ఉంది, అయితే కొంతమంది ఈ సహజ భావనను చిదిమేయడానికి, నోక్కేయడానికి ప్రయత్నిస్తారు.

.దుఆలు, వేడుకోళ్ళు స్వీకరించబడడం, అడిగేవారు ఇవ్వబడడం, కష్టాలు తీరడం వంటివి మనం చూస్తూనే, వింటూనే ఉంటాము, ఇవన్నీ అల్లాహ్ యొక్క ఉనికిని సూచిస్తాయి.

.అల్లాహ్ యొక్క ఉనికిని నిరూపించే ఆధారాలు అసంఖ్యాకమైనవి, లెక్కకు అందనివి.

.ఏదైనా ఒక ఘటన జరిగినపుడు దాని వెనక ఆ ఘటనకు మూలకారకుడైన కర్త ఉంటాడు, అలాగే ఈ సృష్టిలో ప్రతిరోజూ మనం చూసే ఈ అసంఖ్యాకమైన సృష్టిరాసులకు ఒక సృష్టికర్త అనేవాడు తప్పకుండా ఉంటాడు, ఆ సృష్టికర్తయే అల్లాహ్, సృష్టికర్త లేకుండా ఈ సృష్టి తనకుతాను సృష్టించుకొజాలాదు, సృష్టికర్త లేకుండా సృష్టి యొక్క ఉనికి జరగదు. ఇది అసంభవం. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?” ఆయతు యొక్క అర్ధం : సృష్టికర్త లేకుండా వారి సృష్టి జరగదు, వారు తమనుతాము సృష్టించుకొజాలరు కూడా, అల్లాహ్ యే వారి సృష్టికర్త.

ఈ విశ్వంలోని ఆకాశం, భూమి, నక్షత్రాలు, వృక్షాలు తదితరవన్నీ కూడా ఒకేరకమైన క్రమబద్దతతో నడుస్తున్నాయి, ఈ విషయం ఈ విశ్వానికి సృష్టికర్త కూడా ఒక్కడే అని సూచిస్తోంది. అల్లాహ్ తన దివ్య వచనంలో ఇలా సెలవిస్తున్నాడు : “ఇది అల్లాహ్ కార్యం! ఆయన ప్రతి కార్యాన్ని నేర్పుతో చేస్తాడు”.(అన్-నమ్ల్: 88).

ఈ గ్రహాలు, నక్షత్రాలు ఎటువంటి అంతరాయం లేకుండా ఒక స్థిరమైన వ్యవస్థలో సాగుతున్నాయి, ప్రతి ఒక్క గ్రహం మరోక గ్రహపు కక్ష్యలో చొరబడకుండా తనదైన ప్రత్యేక కక్ష్యలో సాగిపోతూఉంది. తన గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు. మరియు రాత్రి పగటిని అధిగమించ జాలదు. మరియు అవన్నీ తమ తమ కక్ష్యలలో సంచరిస్తూ ఉంటాయి”.(యాసిన్: 40).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి