ప్రస్తుత విభాగం : model
పాఠం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరు
ఇస్లాంకు ముందు మొత్తం అరబ్బు మరియు ఇతర జాతులన్నీ కూడా రకరకాల మూఢనమ్మకాలు మరియు కట్టుకధాలకు బందీలుగా ఉండేవి, ఈ జాడ్యం ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉండేది, ఇస్లాం సందేశం అందిన కొత్తలో అరబ్బులు కూడా ఈ ఖురానును తమ పాత కట్టుకధల వలె మరో రకమైనదిగా దీనిని భావించేవారు.
ఎప్పుడైతే ఇస్లాం తన మార్గదర్శ వెలుగులను ప్రసరింపజేయడం మొదలు పెట్టినదో అప్పటినుండి వారి బుద్ధి, ఈ మూఢనమ్మకాలు, అపోహలు మరియు భ్రమల నుండి విముక్తి పొందడం ప్రారంభించినది, ఈ ధార్మిక నియమాలు వారి మనస్సులను మరియు ఆత్మలను స్వచ్చపరచి వారిని వారీ సృష్టికర్త అయిన అల్లాహ్ తో తమ బంధాన్ని పటిష్ఠం చేసింది. వాటిలో కొన్ని :
మంత్రవిద్య మరియు చేతబడికి వ్యతిరేకంగా పోరు
ఇస్లాం చేతబడిని, జ్యోతిష్యానికి చెందిన ఆన్ని రకాలను నిషేదించినది. వాటిని సన్మార్గం నుండి తప్పించేవిగా, బహుదైవారాధన కోవకు చెందినవిగా ప్రకటించినది, చేతబడి చేసే వ్యక్తి ఇహలోకంలోగానీ లేదా పరలోకంలో గానీ సాఫల్యం చెందలేదని చాటి చెప్పింది. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!" (طه: 69).
జ్యోతిష్కులు లేదా మంత్రగాళ్ళ వద్దకు వెళ్లి, వారిని ప్రశ్నించడం, వారి నుండి వైద్యం, లేదా సమస్యల పరిష్కారం కోరడం అనేది నిషిద్దం. అలా చేయడం అనేది దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి పై అవతరించిన సందేశాన్ని తిరస్కరించడమే అవుతుంది అని హదీసులో ప్రస్తావించబడినది. ఎందుకంటే మేలు, కీడు అనేది కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే ఉంటుంది, అంతేకాక అగోచర జ్ఞానం అనేది ఆయనకు తప్ప మరెవ్వరికీ ఉండదు. ఈ విషయంలో దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు ఇలా హెచ్చరించారు: "ఎవరైతే జ్యోతిష్కుడి లేదా మంత్రగాడు వద్దకు వెళ్లి వారు చెప్పే దానిని నమ్ముతారో వారు ముహమ్మద్ (స) పై అవతరించినడానిని తిరస్కరించినట్లే. (ముస్తద్రక్ అల్-హకిమ్: 15).
లాభనష్టాలు అనేవి అల్లాహ్ చేతిలో ఉంటాయి
సర్వోన్నతుడైన అల్లాహ్ తన దివ్యగ్రంథంములో మానవులు, జిన్నాతులు, చెట్లు, రాళ్ళు, గ్రహాలు సహా అన్ని సృష్టి రాశులు అతని గొప్పతనాన్ని చూపించే సూచనలు మాత్రమేనని స్పష్టంగా తెలిపాడు. ఎవ్వరూ అసాధారణ శక్తులను కలిగి ఉండరు. సృష్టి, ఆజ్ఞ, శక్తి, నిర్వహణ అన్నీ అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. ఖుర్‌ఆన్‌లోని ఆయతులు మరియు దైవప్రవక్త(స) వారి హదీసులు దేనిని ధృవీకరిస్తున్నాయి. "నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! "(ఆరాఫ్ : 54)
ఈ జీవుల గొప్పతనాన్ని మరియు వాటి చక్కటి నిర్మాణాన్ని ఆలోచించే వారు వాటి సృష్టికర్త ప్రభువు, సర్వశక్తిమంతుడు, నియంత్రకుడు అయిన అల్లాహ్ అని గుర్తిస్తారు. ఆయనకు మాత్రమే అన్ని రకాల ఆరాధనలు అంకితం చేయబడాలి, ఎందుకంటే ఆయనే సృష్టికర్త మరియు మిగతా అన్నీ ఆయన ద్వారా సృష్టించబడినవి కాబట్టి. “మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే”. (ఫుస్సిలత్ : 37).
అగోచరం మరియు భవిష్యత్తు కాలానికి చెందిన జ్ఞానం కేవలం ఆయనకు మాత్రమే తెలుసు
అల్లాహ్ మాత్రమే అగోచర (ఇల్మేగైబ్ - గతం,భవిష్యత్తు) జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అగోచర జ్ఞానం తెలుసని దావా చేసే జ్యోతిష్కులు, మాయాజాలం చేసేవారు ఎవరైనా సరే వారు అబద్ధం చెబుతున్నారు. “మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు”. (అల్-అనామ్: 59).
సృష్టిలో అత్యుత్తమమైన, గౌరవనీయమైన వ్యక్తి అయిన దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు కూడా తనకు తానుగా ఎటువంటి లాభము కానీ, నష్టము కానీ కలిగించలేరు. అంతేకాకుండా, అగోచర జ్ఞానం(గైబ్) వారికి లేదు, తెలియదు. అల్లాహ్ తప్ప ఎవరూ అగోచర జ్ఞానాన్ని తెలుసుకోలేరు. దీని గురించి తన దివ్యవచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే!” (అల్-అరాఫ్: 188).
శకునం చూడడం యొక్క నిషేదము
చెడు శకునాల నిషేదం. ఇస్లాం పక్షుల శకునాలు, వస్తువులు, రంగులు, మాటలు మొదలైన వాటి పట్ల చెడు శకునాలు చూడటాన్ని నిషేధించింది. అదే సమయంలో, మంచి శకునాలు చూడటాన్ని మరియు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటాన్ని ప్రోత్సహించింది.
ప్రయాణం ప్రారంభం చేసే ముందు ఒక నిర్దిష్ట పక్షిని చూడటం లేదా దాని శబ్దం వినడం వల్ల దురదృష్టం జరుగుతుందని నమ్మడాన్ని "తియర" అంటారు. ఈ నమ్మకాన్ని దైవప్రవక్త ముహమ్మద్ (స)వారు "షిర్క్" (బహుదేవతారాధన) గా పరిగణించారు. ఎందుకంటే ఇది ఆ పక్షికి అధికారాలు ఉన్నాయని నమ్మడం లాంటిది, దాన్ని అల్లాహ్‌తో సమానం చేయడం లాంటిది. ఒక ముస్లిము, అనగా ఒక విశ్వాసి ఈ లోకాన్ని నియంత్రించే ఏకైక శక్తి కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని విశ్వసించాలి. ఆయన మాత్రమే గతం మరియు భవిష్యత్తును తెలిసి ఉంటాడు. పక్షుల దర్శనం లేదా శబ్దానికి ఎటువంటి ప్రభావం ఉండదు, అవి మన ప్రయాణాన్ని ప్రభావితం చేయజాలవు. ఈ కారణంగానే ఇస్లాం " తియర "ను నిషేధించింది. " ‘తియర’ అనగా షిర్క్" అనే హదీసు దీన్ని స్పష్టం చేస్తుంది (అబూ దావూద్ 3910, ఇబ్న్ మాజా 3538). ఒక ముస్లిము ఎల్లప్పుడూ అల్లాహ్‌పైనే నమ్మకం ఉంచి, ఆయన నుండి మాత్రమే మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాలి.
.