ప్రస్తుత విభాగం : model
పాఠం దివ్య గ్రంధాలపై విశ్వాసం
అల్లాహ్ తన దాసులకు సందేశాన్ని అందించడానికి తన ప్రవక్తల పై దివ్యగ్రంధాలను అవతరింపజేశాడని బలంగా విశ్వాసం కలిగి ఉండడం, ఈ దైవగ్రంధాలు అనేవి స్వయానా అల్లాహ్ యొక్క వాక్కులు మరియు మాటలు. ఆయనకు తగ్గట్లుగా ఏ విధంగా మాట్లాడాలో ఆయన ఆ విధంగా మాట్లాడాడు, ఈ గ్రంధాలలో మానవాళి కోసం ధర్మం, సత్యం, మార్గదర్శకం మరియు ఇహపరలోకాలలో ఆనందాలు ఉన్నాయి.
దివ్యగ్రంధాల పట్ల విశ్వాసము యొక్క ప్రాముఖ్యత
దైవ గ్రంధాలను విశ్వసించడం విశ్వాసం యొక్క మూల స్థంబాలలో ఒకటి : దివ్యగ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!" అల్లాహ్ ఆయన పట్ల, ఆయన ప్రవక్త పట్ల , ప్రవక్త ముహమ్మద్ (స) పై ఆయన అవతరింపజేసిన గ్రంధం ఖురాన్ పట్ల విశ్వాసం విశ్వాసం కలిగి ఉండాలని ఆదేశించాడు, ఎలాగైతే ఖురాను కు పూర్వం అవతరించిన గ్రంధాల ను విశ్వసించాలని ఆదేశించాడో.
విశ్వాసం గురించి దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : మీరు అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన సందేసహరులను, తీర్పుదినాన్ని మరియు మంచైనా, చెడైనా విధి రాతను విశ్వసించండి (ముస్లిం : 8)
దైవగ్రంధాలపై విశ్వాసంలో ఏ ఏ విషయాలు వస్తాయి ?
గతంలో అవతరించిన దివ్యగ్రంధాల గురించి మన వైఖరి ఏమిటి ?
ఒక ముస్లిము దైవప్రవక్త మూసా(అ)పై అవతరించిన తౌరాత్, దైవప్రవక్త ఏసు పై అవతరించిన ఇంజీల్ అనేవి అల్లాహ్ తరపున అవతరించిన సత్యగ్రంధాలు అని విశ్వసిస్తాడు. అవి ప్రజలకు ఇహపరలోకాలలో మార్గనిర్దేశం, వెలుగునిచ్చే నియమాలు, హితబోధలు, వార్తలను కలిగి ఉన్నాయి. అయితే, ఖురాన్ లో అల్లాహ్ యూదులు మరియు క్రైస్తవులు తమ గ్రంథాలను వక్రీకరించారని, వాటికి కొన్ని విషయాలు చేర్చి, మరికొన్ని తొలగించారని తెలియజేస్తుంది. దీనివలన, అవి అల్లాహ్ అవతరింపజేసిన అసలైన రూపంలో మిగిలిలేవు.
తౌరాత్ గ్రంధం అనేది ప్రస్తుతం ఉన్నది, కానీ ఇది యధాతధంగా మూసా (అ) పై అవతరించిన తౌరాత్ కాదు, తరువాతి కాలములో యూదులు దానిలో మార్పులు చేర్పులు చేశారు, దానిలోని ఎన్నో ఆదేశాలను మార్చివేశారు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : మరియు మీరు అది గ్రంథం లోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథం లోనిది కాదు; మరియు వారు: "అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది." అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు, మరియు వారు తెలిసి కూడా అల్లాహ్ పై అబద్ధాలు పలుకుతున్నారు. (ఆలె ఇమ్రాన్ : 78)
అలాగే ప్రస్తుతం ఉన్న ఇంజీల్ గ్రంధం కూడా యధాతధంగా ఏసు క్రీస్తు పై పై అవతరించిన ఇంజీల్ కాదు, తరువాతి కాలములో క్రైస్తవులు దానిలో మార్పులు చేర్పులు చేశారు, దానిలోని చాలా ఆదేశాలను మార్చివేశారు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "మేము క్రైస్తవులము." అని అనే వారి నుంచి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాము; కాని వారు తమకు ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచి పోయారు; కావున తీర్పుదినం వరకు వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని కల్గించాము. మరియు త్వరలోనే అల్లాహ్ వారు చేస్తూ వచ్చిన కర్మలను గురించి వారికి తెలియజేస్తాడు. (అల్ మాయిదా : 14)
ఈ కారణంగా, ఈ రోజు క్రైస్తవుల చేతుల్లో బైబిల్ అని పిలువబడే ఈ గ్రంధములో తౌరాత్ మరియు ఇంజీల్ ఉన్నాయి, వీటిలో అనేక మార్చబడిన, యదార్ధం కాని సమాచారము కలిగి ఉండడాన్ని మనం చూడవచ్చు.
నేడు మనకు అందుబాటులో ఉన్న తౌరాత్ మరియు ఇంజిల్‌లు మార్చబడ్డాయని మరియు వక్రీకరించబడ్డాయని ఖురాన్‌లో చెప్పబడినప్పటికీ, ఒక ముస్లిము వాటిని గౌరవించాలి, అవమానించకూడదు లేదా అపవిత్రం చేయకూడదు. ఎందుకంటే వాటిలో కొంత భాగం అల్లాహ్ వాక్యాల యొక్క అసలైన మరియు మార్చబడని భాగాలు ఉండవచ్చు.
ఖురాను విషయంలో మా పై ఉన్న విధులు ఏమిటి ?
ఆయెషా (ర) వారితో దైవప్రవక్త (స) వారి ఆదర్శం గురించి అడగబడినపుడు వారు ఇలా సమాధానమిచ్చారు : వారు (స) ఖురాను యొక్క ఆదర్శాలే వారి ఆదర్శాలుగా వారి వ్యక్తిత్వం ఉండేది" అని బదులిచ్చారు. (అహ్మద్ 24601).
దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు తన జీవితంలో, ఆచరణాల్లో, మాటల్లో దివ్యఖురాన్ బోధనలను మరియు దాని నియమాలను ఆచరణాత్మకంగా పాఠించారు. ఖుర్ఆన్ మార్గదర్శకత్వంలో నడవడంలో వారు (స) పరిపూర్ణతను సాధించారు, మనలో ప్రతిఒక్కరికీ వారు (స) ఒక ఆదర్శవంతమైన మార్గదర్శి. తన దివ్యవచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో!” (అల్-అహ్జాబ్: 21).
ప్రపంచ నలుమూలలా ఖురానును కంఠస్థం చేసిఉన్న వారు విబిన్న భాషలు మాట్లాడేవారు అయినా, వారి భిన్నమైన పరిస్థితులు ఉన్నా కూడా ఖురానును కంఠస్థం చేయగలగడం అనేది ఖురాను యొక్క సంరక్షణకు ఒక సూచన.
పవిత్ర ఖురాన్ యొక్క ప్రయోజనాలు మరియు దాని ప్రత్యేకతలు
ఖురాన్ అనేది సర్వోన్నత సృష్టికర్త యొక్క వాక్కు, ఇది మన మార్గదర్శకులైన దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి ద్వారా మనకు అందించబడినది. ఈ కారణంగా, ఒక విశ్వాసి ఈ గ్రంథాన్ని గౌరవిస్తాడు, దాని ఆదేశాలను పాటించడానికి ప్రయత్నిస్తాడు, దానిని చదువుతాడు మరియు దాని గురించి ఆలోచిస్తాడు. ఇహపరలోకాలలో మన సాఫల్యానికి ఈ దివ్యగ్రంధము మనకు ఒక మార్గము. ఖురాన్‌కు అనేక ప్రత్యేకతలు మరియు గుణాలు ఉన్నాయి, ఇవి దానిని మునుపటి గ్రంథాల నుండి వేరు చేస్తాయి. అవి:
1. ఈ ఖురాను అనేది దైవిక నియమాలు, దైవాదేశాలను కలిగి ఉంది
ఖురాన్ మునుపటి గ్రంథాలలో చెప్పబడిన దానిని ధృవీకరిస్తుంది మరియు సమర్థిస్తుంది, ముఖ్యంగా ఏకదైవారాధన గురించిన బోధనలను. తనదివ్యవచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది”.(అల్ మాయిదా:48). ఇది పూర్వ గ్రంథాలలోని సత్యాన్ని ధృవీకరిస్తుంది. అంటే, ఇది మునుపటి గ్రంథాలలో చెప్పబడిన విషయాలకు విశ్వసనీయమైన సాక్ష్యం.
2. అన్ని భాషలు మరియు జాతుల ప్రజలందరూ దీనిని విశ్వసించడం తప్పనిసరి
ఖురాను అవతరించి ఎన్ని కాలాలు గడచిపోయి ఉన్నా కూడా దీనికి అనుగుణంగా ఆచరించడం. మునుపటి గ్రంథాలు ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట ప్రజల కోసం అవతరించాయి. కానీ ఖురాన్ సర్వమానవజాతికి మార్గదర్శకత్వం వహించడానికి అవతరించినది. “మరియు మిమ్మల్ని మరియు ఇది (ఈ సందేశం) అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి, ఈ ఖుర్ఆన్ నాపై అవతరింపజ జేయబడింది." (అల్-అనామ్: 19).
3. ఖురానును సంరక్షించే బాధ్యతను అల్లాహ్ తీసుకుని ఉన్నాడు
దీనిలో మార్పులూ చేర్పులు చేయడం, దేనిని వక్రీకరించడం అనేది అసంభవం మరియు అసాధ్యం. తన దివ్యగ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. (అల్-హిజ్ర్: 9)