ప్రస్తుత విభాగం : model
పాఠం ధార్మికంగా రక్షణ మార్గాలు అవలంబించడం
ఇతర ధర్మబద్ధమైన రక్షణ కవచాలు:
ప్రజలలో వ్యాధులు మరియు మహమ్మారుల పట్ల భయాందోళనలు పెరుగుతున్న సమయంలో; ఒక ముస్లిము వ్యాధి నివారణకు భౌతిక కారణాలను (వైద్యం వంటివి) అవలంబించడంతో పాటు, ధార్మికపరమైన రక్షణ మార్గాలను కూడా ఆశ్రయిస్తాడు.
అల్లాహ్ ను శరణు(రక్షణ) కోరడం: సంక్షోభాలు మరియు ఆపదలు ఎదురైనప్పుడు ఒక విశ్వాసి ఆశ్రయించే మొదటి, అతి ముఖ్యమైన మరియు అత్యంత గొప్ప రక్షణ మార్గం; అల్లాహ్ ను శరణు వేడటం, ఆయనను దృఢంగా విశ్వసించడం మరియు కీడును దూరం చేయమని ఆయననే రక్షణ కోరడం. ప్రవక్త యూసుఫ్ (అ) ను అజీజ్ భార్య ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, వారు "నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను" (యూసుఫ్: 23) అని పలికారు. అలాగే మరియమ్ (అ) ఆమె వద్దకు దైవదూత జీబ్రయీల్(అ) మానవ రూపంలో వచ్చినప్పుడు, ఆమె "నిశ్చయంగా, నేను నీ నుండి కరుణామయుడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను" (మరియమ్: 18) అని పలికారు.
ఆపదలను తొలగించడానికి మరియు కష్టాల నుండి విముక్తి పొందడానికి అల్లాహ్ ముందు వినమ్రంగా వేడుకోవడం, మొరపెట్టుకోవడం మరియు ఆయన సహాయం కోసం పరితపించడం అత్యవసరం. దుఆ అనేది ఒక ముస్లిముకు రక్షణ కవచం మరియు ఆయుధం వంటిది. ఏ ఆపదైనా అల్లాహ్ సంకల్పం (ఖద్ర్) ప్రకారమే సంభవిస్తుంది కాబట్టి, దానిని కేవలం దుఆ మాత్రమే అడ్డుకోగలదు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "దైవానిర్ణయాన్ని (ఖదా) కేవలం దుఆ మాత్రమే మార్చగలదు" (తిర్మిది: 2139).
శారీరక మరియు మానసికమైన అన్ని రకాల వ్యాధులకు పవిత్ర ఖుర్ఆన్ ఒక దివ్యౌషధం. దాని ద్వారానే స్వస్థతను కోరాలి. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: "మరియు మేము ఖుర్ఆన్ ద్వారా విశ్వాసుల కోసం స్వస్థతను (షిఫా) మరియు కారుణ్యాన్ని ప్రసాదిస్తున్నాము" (ఇస్రా: 82). అల్లాహ్ పట్ల పరిపూర్ణ విశ్వాసం, నమ్మకం మరియు నిబద్ధత కలిగి ఉన్నప్పుడు స్వస్థత పొందే అవకాశాలు మరింత పెరుగుతాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మీరు చెప్పండి: ఇది (ఖుర్ఆన్) విశ్వసించిన వారికి మార్గదర్శకం మరియు స్వస్థత" (ఫుస్సిలత్: 44).
పవిత్ర ఖుర్ఆన్ సంపూర్ణంగా స్వస్థత నిచ్చేది, అయితే కొన్ని సూరాలు మరియు ఆయతుల విషయంలో ప్రత్యేక విశిష్టత ప్రస్తావించబడింది; ఉదాహరణకు సూరహ్ అల్-ఫాతిహా, ముఅవ్విదతైన్ (సూరహ్ అల్-ఫలక్ మరియు సూరహ్ అన్-నాస్) మరియు ఆయతుల్ కుర్సీ వంటివి. ఇబ్న్ అల్ ఖయ్యిమ్ (ర) వారు ఇలా సెలవిచ్చారు: "ఒకవేళ దాసుడు సూరహ్ అల్-ఫాతిహాతో చికిత్స పొందడం చక్కగా అవలంబిస్తే, స్వస్థత చేకూర్చడంలో దాని అద్భుతమైన ప్రభావాన్ని గమనించేవారు. నేను మక్కాలో ఉన్న కాలంలో నాకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తేవి, అప్పుడు నాకు ఎటువంటి మందు కానీ, వైద్యుడు కానీ అందుబాటులో ఉండేవారు కాదు. అటువంటి స్థితిలో నేను సూరహ్ అల్-ఫాతిహాతోనే నాకు నేను చికిత్స చేసుకునేవాడిని, అది నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపేది. ఎవరైనా నొప్పితో బాధపడుతున్నట్లు తెలిస్తే వారికి కూడా నేను దీనినే సూచించేవాడిని; వారిలో చాలా మంది త్వరగా కోలుకునేవారు".
ముఖ్యంగా ఫజ్ర్ నమాజు గురించి దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఎవరైతే ఫజ్ర్ నమాజు చేస్తారో, వారు అల్లాహ్ రక్షణ మరియు బాధ్యతలో ఉంటారు". (ముస్లిం 657).
ముఖ్యమైన రక్షణ కవచాలలో ఒకటి, అనారోగ్యగ్రస్తులను మరియు ఆపదలలో ఉన్నవారిని చూసినప్పుడు ఈ దుఆ చేయడం. హదీసులో ఇలా ఉన్నది: “ఎవరైనా ఒక అనారోగ్యగ్రస్తుడిని చూసి: "అల్ హమ్దు లిల్లాహిల్లదీ ఆఫానీ మిమ్మబ్ తలాక బిహీ, వ ఫద్దలనీ అలా కసీరిమ్ మిమ్మన్ ఖలఖ తఫ్దీలా." ‘నిన్ను దేనితోనైతే పరీక్షించాడో, దాని నుండి నాకు రక్షణ ప్రసాదించి, తన సృష్టిలో అనేకుల కంటే నన్ను ఎంతో ఉన్నతునిగా చేసిన అల్లాహ్ కే సర్వస్థుతులు. అని వేడుకుంటే, అతనికి ఆ ఆపద సంభవించదు”. (తిర్మిది 3432).
నిశ్చయంగా అల్లాహ్ స్మరణను (దిక్ర్) క్రమం తప్పకుండా పాటించడంలో ఈ లోకంలో ఎంతో మేలు, పరలోకంలో గొప్ప పుణ్యం ఉన్నాయి. ముస్లిము తప్పనిసరిగా పాటించవలసిన ముఖ్యమైన దిక్ర్‌లలో ఉదయపు మరియు సాయంత్రపు స్మరణలు (అజ్కార్) ఒకటి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు: మనశ్శాంతి, హృదయానికి ప్రశాంతత, అల్లాహ్ తోడ్పాటు లభించడం మరియు అల్లాహ్ తన ‘మలయె ఆలా’ (ఉన్నత సభలో -దైవదూతల మధ్య) ఆ దాసుడిని ప్రస్తావిస్తాడు.
ధర్మబద్ధమైన దుఆలు, అజ్కార్ (స్మరణలు) మరియు రక్షణ కవచాలలో కొన్ని:
నిద్రపోయే ముందు ఆయతుల్ కుర్సీ పఠించడం:
ఒక హదీసులో ఇలా ఉంది, ఒకరు అబూ హురైరా(ర) వారితో ఇలా అన్నారు: "నీవు పడకపైకి వెళ్ళినప్పుడు (నిద్రించే ముందు) ఆయతుల్ కుర్సీ పఠించు; అల్లాహ్ తరపు నుండి ఒక రక్షకుడు నీకు తోడుగా ఉంటాడు మరియు ఉదయం వరకు ఏ షైతాను నీ దరిచేరదు". అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "అతడు అబద్ధాలకోరు అయినప్పటికీ, ఈ విషయం నీతో నిజం చెప్పాడు, అతడు షైతాను". (బుఖారీ 3275).
సూరహ్ అల్-బఖరాలోని చివరి రెండు ఆయతులను పఠించడం:
అబూ మసూద్(ర) వారు ఉల్లేఖించిన దాని ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఎవరైతే రాత్రి వేళ సూరా అల్-బఖరాలోని చివరి రెండు ఆయతులను పఠిస్తారో, అవి అతనికి సరిపోతాయి". (బుఖారీ 5008, ముస్లిం 808).
అధికంగా తస్బీహ్ మరియు ఇస్తిగ్ఫార్ చేయడం:
ఒకవేళ దాసుడు తస్బీహ్ (పవిత్రతను కొనియాడటం- సుబ్'హానల్లాహ్) మరియు ఇస్తిగ్ఫార్ (క్షమాపణ వేడుకోవడం) క్రమం తప్పకుండా పాటిస్తే, అల్లాహ్ అతని నుండి కీడులను మరియు ఆపదలను తొలగిస్తాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “నీవు వారి మధ్య ఉన్నంత కాలం అల్లాహ్ వారిని శిక్షించడు; మరియు వారు క్షమాపణ వేడుకుంటున్నంత కాలం కూడా అల్లాహ్ వారిని శిక్షించడు”. (అన్ఫాల్: 33).
اختر مستوى الشرح المناسب لك
يحتوي الدرس الآن على طبقات اختيارية تساعدك على المراجعة السريعة أو التعمق دون مغادرة الدرس.
- الملخص: نظرة سريعة في نحو دقيقة.
- الأساسي: محتوى الدرس الأصلي وهو المسار المعتمد للتقدم.
- المتعمق: تفاصيل إضافية اختيارية عند توفرها.
تقدمك وإكمال الدرس يعتمدان دائما على صفحات المستوى الأساسي.