నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం ఇస్లాంలో స్త్రీ యొక్క స్థాయి

ఈ పాఠములో మనం ఇస్లాంలో మహిళల హక్కుల గురించి నేర్చుకుంటాము

  • స్త్రీను ఇస్లాం సమ్మానించిన, గౌరవించిన తీరు మరియు గత కాలములో స్త్రీ పట్ల జాతులు వ్యవహరించిన అవమానకర తీరు మధ్య వ్యత్యాసం గురించిన  వివరణ.
  • లింగ సమానత్వం విషయంలో ఇస్లాం వ్యవహారానికి సంబందించిన సాధారణ నియమం యొక్క వివరణ.
  • వివిధ రంగాలలో ఇస్లాం ద్వారా హామీ ఇవ్వబడిన అనేక మహిళల హక్కుల గురించిన వివరణ.

మహిళల పట్ల ఇస్లాం యొక్క శ్రద్ధ

సత్యధర్మమైన ఇస్లాం యొక్క దైవిక బోధనలు మరియు విజ్ఞతతో కూడిన మార్గదర్శకత్వం అనేవి స్త్రీ యొక్క రక్షణ, ఆమె గౌరవం మరియు శ్రేయస్సు విషయంలో ఎంతో జాగ్రత్తను, బాధ్యతను తీసుకున్నాయి, ఆమెకు సుఖప్రదమైన జీవితము యొక్క హామీనిచ్చాయి అలాగే ఆమెను సందేహాత్మక, కల్లోలాత్మక పరిస్థితుల నుండి, కీడు నుండి దూరంగా ఉంచే ఏర్పాటు చేశాయి, ఇదంతా ముఖ్యంగా స్త్రీకు మరియు సమగ్రంగా సమాజాన్నంతటికీ ఇస్లాం ఈ ఏర్పాటు చేసినది. పలువిధాలుగా, పలు రూపాలలో దీనిపై శ్రద్ధ వహించడం జరిగినది.

గౌరవం మరియు ఉన్నత హోదా

ఇస్లాం మహిళలకు వారి గౌరవం మరియు మానవత్వానికి హామీ ఇచ్చినది, వారు ఎక్కడ ఉన్నా వారికి తగిన హోదాను అందించినది. ఆమె ఒక భార్య అయినా, కూతురు అయినా ఇలా ఆమె ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆమె పట్ల సద్వర్తన, ఉపకార భావం, ఉదారత కలిగి ఉండాలని ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించినది, అలాగే తరాల నుండి ధార్మికంగా, సైద్ధాంతీకగా మరియు సామాజికంగా స్త్రీ యొక్క స్థాయిని దిగజార్చే, అవమానపరచే ప్రతికూల అంశాలకు, భావాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడినది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ (ర) వారి ఉల్లేఖనం : దైవసాక్షిగా చెబుతున్నాను అల్లాహ్ స్త్రీ గురించి అవతరింపజేసిన వాటిని అవతరింపజేసేవరకూ, వారి కోసం వారి హక్కులను పంచిఇచ్చేవరకూ మేము అజ్ఞాన కాలములో స్త్రీను ఒక విషయంగానే పరిగణించేవారము కాదు. (అల్-బుఖారీ 4913 మరియు ముస్లిం 1479). ఇస్లాం యొక్క వెలుగు 1,400 సంవత్సరాల క్రితం ప్రకాశించినది, అది మహిళల స్థాయిని పెంచినది, అనేక జాతులు మరియు దేశాలు ఆమె పట్ల అవలంబిస్తూ వస్తున్న అనేక అధర్మ, అన్యాయపూరిత ఆచారాల నుండి వారి నుండి దూరం చేసినది. ఆ రోజులలో స్త్రీకు యాజమాన్య మరియు వారసత్వ హక్కులు ఏ మాత్రం ఉండేవి కావు, ఆమె భర్త చనిపోతే ఆమెను ఒక వారసత్వ సంపదగా తీసుకోవడం లేదా ఆమెను భర్తతో పాటు అగ్నిలో కాల్చివేయడం అనగా సతీసహగమనం చేయడం జరిగేది, అలాగే ఆమె అమ్మబడేది మరియు కొనబడేది కూడా, ఈ ఆచారం ప్రభలంగా కొనసాగుతూ వచ్చినది. ఉదాహరణకు ఇంగ్లీషులో చెప్పబడిన విధంగా - ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభం వరకు.

స్త్రీ పురుషుల మధ్య న్యాయం

ఈ ఇస్లాం ధర్మం అనేది సర్వ జగత్తుకు ప్రభువు అయిన అల్లాహ్ తరపున అవతరింపబడిన ధర్మము, ఆయన సర్వజ్ఞుడు, న్యాయవంతుడు, వివేకవంతుడు. అతను భిన్నమైన రెండు విషయాలను సమానం చేయడు మరియు ఒకేలా ఉండే రెండు విషయాల మధ్య వ్యత్యాసం చూపడు. ఇస్లామీయ ధర్మము అనేది పురుషులు మరియు స్త్రీల మధ్య సారూప్య విషయాలలో సమానాత్వాన్ని చూపుతుంది మరియు భిన్నమైన విషయాలలో భిన్నత్వాన్ని చూపుతుందని మనకు తెలుస్తోంది, వీరిరువురికి సృష్టించిన వారి వారి నైజాలు, అవసరాలు, సామర్ధ్యాలు మరియు ప్రవృత్తులను బట్టి వారికి తగిన హక్కులు మరియు విధులను చేసినది, ఇస్లాం మహిళలకు అన్ని రంగాలలో సముచిత హోదాను కల్పించింది మరియు అనేక విషయాలలో పురుషులతో సమానంగా వారిని చేసింది, వీటిలో:

సృష్టి యొక్క మూలం

మునుపటి జాతులు స్త్రీను ఎంతవరకు అసహ్యించుకున్నాయి అంటే స్త్రీలను వారు పూర్తిగా మానవత్వం యొక్క పరిమితులను దాటి వారిని నెట్టివేసారు. అరిస్టాటిల్ ఇలా అన్నాడు: స్త్రీ అనేది అసంపూర్ణమైన పురుషుడు, ప్రకృతి ఆమెను సృష్టి యొక్క నిచ్చెన దిగువన వదిలివేసింది. సోక్రటీస్ ఆమెను ఒక విషపూరిత వృక్షంతో పోల్చాడు. ఒకసారి రోమ్‌లో ఒక పెద్ద సదస్సు జరిగింది, అందులో స్త్రీకు ఆత్మ లేదా అమరత్వం లేదని, ఆమె మరణానంతర జీవితాన్ని వారసత్వంగా పొందదని, ఆమె అసహ్యకరమైనదని, ఆమె మాంసం తినకూడదని, నవ్వకూడదని లేదా మాట్లాడకూడదని నిర్ణయించారు. ఫ్రెంచ్ వారి విషయానికొస్తే, వారు క్రీస్తుశకం 586 లో ఒక "ముఖ్యమైన" సమస్యను చర్చించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించారు, అదేమంటే : స్త్రీను మనిషిగా పరిగణించాలా లేదా?! ఆమెకు ఆత్మ అనేది ఉంటుందా లేదా?! ఒకవేళ ఆత్మ అనేది ఉంటే అది జంతువు ఆత్మా లేక మానవ ఆత్మా?!. ఒక వేళ ఆమెకు మనిషి ఆత్మ ఉంటే అది మనిషి యొక్క ఆత్మ స్థాయిలో ఉందా లేదా దాని కంటే తక్కువ స్థాయిలో ఉన్నదా ?! చివరికి, ఆమె ఒక మనిషి అని తేల్చారు, అయితే ఆమె పురుషులకు సేవ చేయడానికి మాత్రమే సృష్టించబడిందని వారు నిర్ణయించుకున్నారు. ఇస్లాం విషయానికొస్తే, పుట్టుక పరంగా వీరిద్దరూ సమానమే అని, ఇద్దరూ మనుషులే అని ఖండితంగా తేల్చి చెప్పింది. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు(నిసా :1).

ధార్మిక పరంగా సమానత్వం

ఇస్లాం స్త్రీ మరియు పురుషునికి ధార్మిక నియమాల బాధ్యతలలో మరియు వారి ఇహపరలోకాల ప్రతిఫలాలలో సమానత్వాన్ని ఇస్తుంది: తన దివ్యగ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. (అన్-నహ్ల్:97). మరో చోట ఇలా సెలవిచ్చాడు : మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక అంత అన్యాయం కూడా జరుగదు.(అన్-నిసా:124) ఒక వ్యక్తి తన దుస్తులలో తడి గమనించి, వీర్య స్కలనం జరిగినదా లేదా అని అతనికి స్పష్టత లేనపుడు, ఏమి చేయాలి అని దైవ ప్రవక్త(స) వారిని అడిగినపుడు; అతను గుసుల్ చేయవలసి ఉంటుంది అని ప్రవక్త (స)వారు సమాధానమిచ్చారు. మరియు ఒక వ్యక్తి తనకు వీర్య స్కలనం జరిగింది అని భావించాడు కానీ తడి అనేది కనిపించలేదు, అటువంటి వ్యక్తి ఏమి చేయాలి అని అడగడం జరిగింది. దానికి ప్రవక్త(స) వారు : అతడికి గుసుల్ చేయవలసిన అవసరం లేదు అని సెలవిచ్చారు. దానితో ఉమ్మే సులైమ్ (ర) వారు ఇలా అడిగారు : స్త్రీ దానిని (తడిని) చూస్తే ఏమి చేయాలి. దానికి ప్రవక్త(స) వారు ఇలా సమాధానమిచ్చారు: అవును (గుసుల్ చేయాలి), స్త్రీలు, పురుషులలో సగభాగాలు. (స్త్రీలు కూడా పురుషుల వంటి వారే) (అబూ దావూద్ 236).

ప్రవక్త ముహమ్మద్(స) వారు ప్రవక్తగా నియమింపబడిన తరువాత వారి సందేశాన్ని స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఒక స్త్రీ. ఆమెనే విశ్వాసుల మాతృమూర్తి (ప్రవక్త(స) వారి జీవిత సహచరిణి) అయిన ఖదీజా (ర). విశ్వాసులు మొదటిసారిగా హబషా (ఇథియోపియా)కు వలస వెళ్లిన వారిలో ఆమె(ర) కూడా ఉన్నారు, అలాగే ఆమె యస్రిబ్ (మదీనా నగరపు పురాతన పేరు) నుండి వచ్చిన మొదటి ప్రతినిధి బృందములో ఒకరు. ఆ సమయంలో అందరితో పాటుగా దైవప్రవక్త(స) పట్ల విధేయత పై ప్రతిజ్ఞ చేశారు.

ఇస్లామీయ చరిత్రలో స్త్రీలు అత్యంత ముఖ్య భూమికను పోషించారు, తమ ఉన్నత గుణాలు, జ్ఞాన సంవృద్ధి, ఇస్లాంను అర్ధం చేసుకోవడంలో ఉన్నత ఆదర్శాలను నెలకొల్పారు, ముస్లిములు తమ ధర్మానికి సంబందించిన అనేక విషయాలను మహిళా పండితుల నుండి కూడా నేర్చుకున్నారు, ధర్మజ్ఞానార్జన మరియు దానిని నేర్పించే విషయంలో కొన్ని సందర్భాలలోనయితే వారు అగ్రగామిగా కూడా తమ ఆదర్శాన్ని నెలకొల్పారు, ఇస్లామీయ చరిత్రలో తమ చెరగని ముద్ర వేశారు, వీరిలో అగ్రగామి ఆయిషా(ర) వారు.

మహిళలు కూడా సామూహిక ఆరాధనలలో పాల్గొంటారు, ఈ ఆరాధనలలో కొన్ని తప్పనిసరి లేదా తప్పనిసరి కాకపోయినా చేయడం ఉత్తమం వంటివి లేదా అనుమతించబడిన కోవకు చెందుతాయి. ఉదాహరణకు ఉమ్రా, హజ్, వర్షం కోసం ఆచరించే నమాజు, రెండు పండుగల నమాజులు, జుమా నమాజు వగైరా. జనులకు సత్యధర్మమైన ఇస్లాం వైపుకు ఆహ్వానించాలని, మంచి గురించి ఆదేశించాలని మరియు చెడు నుండి నివారించాలని ఆమెకు కూడా ఆదేశించబడి ఉన్నది. ఈ విధంగా ధార్మిక బాధ్యతలలో చాలా చాలా స్పష్టంగా స్త్రీపురుషుల మధ్య సమానాత్వాన్ని ఇవ్వడం జరిగినది. నైజాం పరంగా ఇద్దరి శారీరక, మానసిక వ్యత్యాలపై ఆధారపడిన ఏవైనా అంశాలు ఉంటే తప్ప.

ఇస్లాం సాధారణంగా బాధ్యతల విషయంలో సమానత్వాన్ని ఒక సూత్రంగా గుర్తించినప్పటికీ, పురుషులు మరియు స్త్రీల మధ్య ఉన్న సహజమైన వ్యత్యాసాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ వ్యత్యాసాల వలన బాధ్యతలలో కూడా మార్పులు రావచ్చు. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి, ప్రతి ఒక్కరినీ వారి సరైన స్థానంలో ఉంచడం ద్వారా జీవితంలో సమగ్రతను సాధించడానికి ఇస్లాం ప్రయత్నిస్తుంది. భార్య మరియు పిల్లలపై ఖర్చు చేయడానికి పురుషుడు బాధ్యత వహిస్తాడు. అదేవిధంగా, వారిని రక్షించడం మరియు కుటుంబం యొక్క అన్ని వ్యవహారాలను చూసుకోవడం కూడా అతని బాధ్యతే. మరోవైపు, స్త్రీ తన ఇల్లు, భర్త మరియు పిల్లలను చూసుకోవడానికి బాధ్యత వహిస్తుంది. ఈ బాధ్యతలను ఆమె తీసుకోవలసి ఉంటుంది.

మహిళలకు పౌర, సామాజిక, వ్యక్తిగత హక్కులకు ఇస్లాం హామీ ఇస్తుంది. 1400 సంవత్సరాలకు పూర్వమే, ఆధునిక కాలంలో పౌర, మానవ హక్కుల సంఘాలు వాటి గురించి మాట్లాడే ముందు నుండే, ఈ హక్కులు మహిళలకు ఇవ్వబడ్డాయి.

మహిళల పౌర మరియు సామాజిక హక్కులు

١
విద్య అభ్యసన హక్కు: ఇస్లాం జ్ఞానాన్ని అభ్యసించడానికి ప్రోత్సహిస్తుంది మరియు పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సమానంగా విద్యను అర్జించే హక్కును కలిగిస్తుంది.
٢
పని చేసే హక్కు: సాధారణంగా, పురుషుడు సంపాదించి ఖర్చు చేయడానికి బాధ్యత వహిస్తాడు, కానీ అవసరమైతే ఇస్లాం మహిళలను పని చేయడం నుండి నిరోధించదు. అయితే మహిళలు ఇస్లాం నియమాలు మరియు నైతికతకు అనుగుణంగా పనిచేయడం అనేది ముఖ్యం.
٣
వారసత్వ హక్కు: పవిత్ర ఖుర్‌ఆన్, దైవప్రవక్త (స) వారి బోధనలు మరియు ఫిఖా (ఇస్లామీయ నియమాల సమగ్ర అవగాహన) పుస్తకాలు పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ వారసత్వం యొక్క వివిధ రూపాల గురించి వివరిస్తాయి.
٤
యాజమాన్య హక్కు: స్త్రీలు తమ ఆదాయం లేదా వారసత్వం ద్వారా పొందిన ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కును కలిగి ఉంటారు. వారి ఆస్తిని తమకు తగిన విధంగా వినియోగించే పూర్తి స్వేచ్ఛ మరియు స్వంత ఆర్థిక బాధ్యత వారికి ఉంటుంది, ఈ విషయంలో తండ్రి, భర్త లేదా ఇతరులను అనుసరించాల్సిన అవసరం లేదు.

వ్యక్తిగత స్థితిగతులు మరియు వివాహంలో మహిళల హక్కులు

١
సరైన భర్తను ఎంచుకునే హక్కు : భార్యకు తనకు నచ్చిన, సరైన భర్తను ఎంచుకునే హక్కు ఉంది. ఎవరైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరినప్పుడు ఆమె వారిని అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
٢
ఆమె మహర్ (కన్యాశుల్కం) యొక్క హక్కు
٣
ఆర్థిక సంరక్షణ హక్కు: భార్యకు భర్త నుండి ఆర్థిక సంరక్షణ పొందే హక్కు ఉంటుంది. భర్త ఆమెకు మరియు పిల్లలకు ఆహారం, దుస్తులు, ఆశ్రయం మరియు ఇతర అవసరాలను తీర్చాల్సి ఉంటుంది.
٤
మంచి నడవడిక పొందే హక్కు: భార్యకు భర్త నుండి మంచి నడవడికతో చూడబడే హక్కు ఉంటుంది. భర్త ఆమెతో దయతో, గౌరవంతో మాట్లాడాలి మరియు ప్రవర్తించాలి.
٥
బహుభార్యత్వం ఉంటే న్యాయమైన వ్యవహారం పొందే హక్కు: భర్తకు ఒకటి కంటే ఎక్కువ భార్యలు ఉంటే, భార్యకు న్యాయమైన వ్యవహారం పొందే హక్కు ఉంటుంది. భర్త భార్యాలందరితో సమానంగా మరియు న్యాయంగా వ్యవహరించవలసి ఉంటుంది.
٦
ఆర్థిక స్వాతంత్య్ర హక్కు: భార్యకు ఆర్థిక స్వాతంత్య్ర హక్కు ఉంది. ఆమెకు స్వంత ఆదాయం ఆర్జించే హక్కు మరియు ఆమె సంపదను ఆమె నియంత్రించుకునే హక్కు ఉంటుంది.
٧
ఖులా తీసుకునే హక్కు : భార్య భర్త నుండి విడాకులు కోరే, పొందే హక్కును కలిగి ఉంటుంది, అయితే విడాకుల కోసం ఉండే షరతులు మరియు దాని అర్హత అనగా బలమైన కారణాలు ఉండాలి.
٨
విడాకుల తర్వాత ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్ప, ఆమె పిల్లల సంరక్షణ హక్కు ఆమె కలిగి ఉంటుంది.

పైన పేర్కొనబడినవి ఇస్లాం లో మహిళల హక్కులకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. వాస్తవానికి, ఇస్లాం మహిళలకు చాలా హక్కులనే ఇచ్చి ఉన్నది.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి