ప్రస్తుత విభాగం : model
పాఠం కాల కృత్యాలు తీర్చుకునే పద్ధతి.
కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి
కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినపుడు మర్మస్థానాలు కనిపించకుండా జాగ్రత్త వహించడం, జనాల దృష్టి నుండి దూరంగా వెళ్ళడం అనేది తప్పనిసరి
బహిర్భూమికి వెళ్ళినపుడు జనులకు ఇబ్బంది కలిగించే ప్రాంతములో కాలకృత్యాలు తీర్చుకోకూడదు
బహిరంగ ప్రదేశాలలో ఉన్నప్పుడు, రంధ్రాలలో లేదా కలుగులలో మలమూత్ర విసర్జన చేయడం నిషిద్ధం. ఎందుకంటే ఆ కలుగులలో ఉండే ప్రాణులకు ఇబ్బంది కలగవచ్చు లేదా ఆ జీవుల ద్వారా ఇతరులకు హాని జరగవచ్చు.
ఈ క్రమంలో బట్టలు మరియు శరీరానికి ఎటువంటి మాలిన్యం అంటకుండా జాగ్రత్త వహించాలి ఒకవేళ ఏమైనా అంటితే దానిని పూర్తిగా శుభ్రపరచుకోవడం తప్పనిసరి
మలమూత్ర విసర్జన చేసిన తర్వాత, ఈ క్రింది రెండు పద్ధతులలో ఏదో ఒకటి పాటించవలసి ఉంటుంది:
ఇస్తెంజా: మలమూత్ర విసర్జన జరిగిన భాగాలను నీటితో శుభ్రం చేసుకోవడం.
ఇస్తిజ్మార్ : మూడు లేదా అంతకన్నా ఎక్కువ టిష్యూ పేపర్లు లేదా మట్టి గడ్డలతో శరీరానికి అంటిన మాలిన్యాన్ని శుభ్రపరచడాన్ని అంటారు.
హదస్ (వదూ లేదా స్నానాన్ని తప్పనిసరి చేసేది)
విశ్వాసులు శుద్ధమైన నీటితో వుదూ లేదా స్నానం చేసినప్పుడు వారిలోని అపవిత్రత (హదస్) తొలగిపోతుంది. శుద్ధమైన నీరు అంటే ఏంటంటే, ఏ నీటిలోనైతే అపవిత్రత కలవలేదో మరియు ఆ నీటి రంగు, రుచి లేదా వాసనలో ఎటువంటి మార్పు రాలేదో అటువంటి నీరు.
హదస్ - అశుద్ధత రెండు రకాలుగా విభజించబడింది:
చిన్న అశుద్ధత మరియు దాని నుండి శుద్ధి పొందేందుకు చేసే వుదూ.
3. ఒంటె మాంసం తినడం. ఒంటె మాంసం తిన్న తర్వాత వుదూ చేయాలా అని దైవప్రవక్త ముహమ్మద్(స) వారిని అడిగినప్పుడు, వారు "అవును" అని సెలవిచ్చారు (ముస్లిం 360).
4. నిద్రపోవడం, మతిస్థిమితం కోల్పోవడం, స్పృహ తప్పడం లేదా మత్తు వల్ల విచక్షణ కోల్పోవడం.