నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం "లా ఇలాహ ఇల్లల్లాహ్" యొక్క సాక్ష్యం

ఆఏకత్వాన్ని సూచించే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అబవడే ఈ ప్రాధమిక విశ్వాస వచనాని(కలిమ) కి ఇస్లాం అత్యున్నత స్థానం ఇచ్చి ఉన్నది, ఈ కారణంగానే ఒక వ్యక్తి సత్యధర్మమైన ఇస్లాం లో ప్రవేశించాలంటే ఈ వచనాన్ని సంపూర్తిగా విశ్వసించాలి మరియు నోటితో ఉచ్చరించాలి

  • లాయిలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం యొక్క అర్ధాన్ని తెలుసుకోవడం
  • లాయిలాహ ఇల్లల్లాహ్” యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకోవడం
  • లాయిలాహ ఇల్లల్లాహ్ యొక్క మూలస్థంబాల పట్ల అవగాహన కలిగి ఉండడం

ఏకత్వాన్ని సూచించే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అబవడే ఈ ప్రాధమిక విశ్వాస వచనా(కలిమ) నికి ఇస్లాం అత్యున్నత స్థానం ఇచ్చి ఉన్నది, ఈ కారణంగానే

'లా ఇలాహ ఇల్లల్లాహ్' యొక్క విశిష్ఠత

١
ఒక వ్యక్తి సత్యధర్మమైన ఇస్లాం లో ప్రవేశించాలంటే ఈ వచనాన్ని సంపూర్తిగా విశ్వసించాలి మరియు నోటితో ఉచ్చరించాలి.
٢
మనస్పూర్తిగా విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ఉచ్చరించిన వ్యక్తికి అది అతని నరక విముక్తికి కారణం అవుతుంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ దైవ ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : “అల్లాహ్ యొక్క సంతుష్ఠత కోరుకుంటూ “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికిన వ్యక్తి పై అల్లాహ్ నరకాన్ని నిషేదించాడు. (బుఖారీ - 415)..
٣
ఈ వచనం పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్న స్థితిలో చనిపోయిన వ్యకి స్వర్గస్తులలో ఒకనిగా నిలుస్తాడు, దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు: ఎవరైతే చనిపోయేసమయంలో అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేదు(లా ఇలాహ ఇల్లల్లాహ్) అని తెలిసి ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. (అహ్మెద్ - 464)

ఈ కారణం వల్లనే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ గురించి తెలిసి ఉండడం అనేది అత్యంత కీలకమైన విషయం

'లా ఇలాహ ఇల్లల్లాహ్' యొక్క అర్ధం

అనగా: ఆరాధనలకు నిజమైన అర్హుడు కేవలం ఒక్క అల్లాహ్ మాత్రమే అనేది అల్లాహ్ తప్ప ఇతరుల దైవత్వాన్ని నిరాకరిస్తుంది మరియు ఏ మాత్రం సాటిలేని మరియు ఏకైకుడైన అల్లాహ్ కు మాత్రమే దైవత్వాన్ని నిరూపిస్తుంది.

ఆరాధింపబడేవానిని “ఇలాహ్” అంటారు, మనస్సులు ‘ఇలాహ్’ పట్ల సమర్పణ, విధేయత, భక్తి, అత్యున్నత గౌరవం, నమ్మకం, ప్రేమ, వేడుకోలు, భయం మరియు ఆశ వంటి భావాలు కలిగి ఉంటాయి. ఎవరైతే ఈ భావాలన్నిటినీ సృష్టికర్తను కాకుండా సృష్టిలోని వేరితరులకు ఆపాదిస్తాడో అతడు దానిని తన ఆరాధ్య దైవంగా చేసుకున్నట్లే, అయితే అది నిజదైవం కాజాలదు, నిజదైవం అనేవాడు ఒకేఒక్కడు, ఆయనే సర్వ సృష్టికర్త మరియు అందరి ప్రభువు.

సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ తప్ప వేరెవరూ ఆరాధనకు అర్హులు కారు, ఆ సర్వ సృష్టికర్త ఎవరంటే మనోహృదయాలన్నీ కేవలం ఆయననే ప్రేమతో ఆరాధిస్తాయి, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని చాటుతాయి, నమ్మకము మరియు భయముతో ఆయనకే లొంగి ఉంటాయి, కావున నమ్మిక, వేడుకోళ్ళు, మొక్కుబడి, సహాయార్ధన, ఆరాధన మరియు సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ జంతువు ఖుర్బానీ ఇవడం వంటివన్నీ కేవలం ఆయనతోనే కలిగి ఉండాలి, అలాగే ఆయనను ఆరాధించే విషయంలో సంకల్ప శుద్ధి అనేది విధిగా కలిగి ఉండాలి. తన దివ్య వచనంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ‘మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని”, (బయ్యినా - 4)

స్వచ్చమైన సంకల్పంతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క అర్ధాన్ని ఆచరణాత్మకంగా నిరూపిస్తూ అల్లాహ్ ను ఎవరైతే ఆరాధిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో నిజమైన ఆనందాన్ని, సంతృప్తిని, శుభవంతమైన జీవితాన్ని చూస్తాడు, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ఆరాధనలోనే మనస్సులకు నిజమైన సంతృప్తి మరియు శాంతి ప్రాప్తిస్తాయి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము.(అన్-నహ్ల్: 97)

"లా ఇలాహ ఇల్లల్లాహ్" యొక్క మూల స్థంబాలు

١
ఈ మొదటి మూల స్తంభం లేదా మొదటి కీలక అంశం : (లా ఇలాహ) అల్లాహ్ తప్ప ఇతరులను ఆరాధించకుండా ఉండడాన్ని సూచిస్తుంది. అల్లాహ్ తో పాటుగా ఇతరులను సాటి కల్పించడానిని తిరస్కరించడం మరియు అల్లాహ్ తప్ప ఇతరులను ఏ విధంగానైనా ఆరాధించడాన్ని నిషేదిస్తుంది. ఉదాహరణకు : మనుష్యులు, జంతువులు, విగ్రహాలు, నక్షత్రాలు లేదా ఇతరత్రా ఏవైనా సరే.
٢
రెండవ మూల స్తంభం: (ఇల్లల్లాహ్ ) సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు అని ధృవీకరించడం మరియు నమ్మకం(తవక్కుల్), దుఆ(వేడుకోలు), నమాజు వంటి ఆరాధనాలన్నిటినీ కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించడం .

అన్నిరకాల ఆరాధనలు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి, ఆయనకు ఎవరూ సాటి లేరు, ఎవరైతే ఈ ఆరాధనల్లో కొన్నింటిని అల్లాయేతరులకు చేస్తాడో అతడు అల్లాహ్ కు సరిసమానంగా ఇతరులను సాటి కల్పించినట్లే. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “మరియు ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు”. (మూమినూన్ – 117)

'లా ఇలాహ ఇల్లల్లాహ్' యొక్క వివరణ మరియు దాని మూల స్థంబాల గురించి అర్ధాన్ని అల్లాహ్ తన గ్రంధములో ఈ విధంగా తెలియపరచి ఉన్నాడు : కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే (బఖర:256 ) ఈ వాఖ్యములో “కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి” అనే భాగము కలిమా యొక్క మొదటి మూలస్థంబము (లా ఇలాహ ఇల్లల్లాహ్). వాఖ్యము యొక్క రెండవ భాగము “అల్లాహ్ ను విశ్వసించిన వాడు” కలిమా యొక్క రెండవ మూలస్థంబాన్ని సూచిస్తోంది.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి