నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం సాటి కల్పించడం (షిర్క్)

బహుదైవారాధన(షిర్క్) అనేది ఏకైకుడైన అల్లాహ్ పై విశ్వాసానికి విరుద్ధమైనది, పాపాలలోకెల్లా మహాపాపం అది. ఈ పాఠములో మీరు షిర్క్ యొక్క అర్ధం, దాని అపాయాలు మరియు దాని రకాల గురించి తెలుసుకుంటారు.

  • దైవానికి సాటి కల్పించడం యొక్క అర్ధం గురించిన అవగాహన
  • దైవానికి సాటి కల్పించడం లోని అపాయము గురించిన అవగాహన
  • దైవానికి సాటికల్పించడం లోని రకాల గురించిన అవగాహన

షిర్క్ యొక్క అర్ధం

షిర్క్ : 1.సర్వ సృష్టి యొక్క నిర్వహణ కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నది, 2.ఆరాధించబడే అర్హత కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉన్నది 3.కొన్ని ప్రత్యేకమైన శుభనామాలు, గుణగణాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి. అయితే కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఈ మూడింటిలో లేదా వీటిలోని ఏ ఒక్క దానిలో ఇతరులను కూడా సాటి కలిపించడాన్ని షిర్క్ అంటారు.

షిర్క్ యొక్క ఉదాహరణలు

١
రుబూబియత్ లో షిర్క్ అనగా : సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ కాకుండా వేరితరులు ఈ సృష్టిని సృష్టించారని లేదా ఈ సృష్టి యొక్క నిర్వహణలో ఇతరుల భాగస్వామ్యం కూడా ఉందని ఆరోపించడం.
٢
ఉలూహియత్ లో షిర్క్ అనగా : అల్లాయేతరులను ఆరాధించడం లేదా వేడుకోవడం
٣
అస్మా వ సిఫాత్ లో షిర్క్ అనగా : అల్లాహ్ యొక్క సృష్టిరాసులతో అల్లాహ్ ను పోల్చడం

షిర్క్ వల్ల ఉన్న ప్రమాదం

బహుదేవారాధన (షిర్క్) అనేది ఒకే అల్లాహ్ ను ఆరాధించే విశ్వాసానికి విరుద్ధం. అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆయనకు మాత్రమే మనం సమర్పించుకోవాలి. ఈ సత్యాన్ని తిరస్కరించడమే షిర్క్ అనబడుతుంది. షిర్క్ అనేది అన్ని పాపాలన్నింటికంటే పెద్ద పాపము, ఎందుకంటే దాని ద్వారా మనం అల్లాహ్ యొక్క ఏకైకతను తిరస్కరిస్తాము. ఈ పాపం నుండి మనం పశ్చాత్తాపం చెందకపోతే, అల్లాహ్ దానిని క్షమించడు. నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. (అన్-నిసా: 48) ఒకసారి దైవప్రవక్త (స) వారిని "ఏ పాపం అల్లాహ్ దృష్టిలో అతి పెద్ద పాపం?" అని అడగడం జరిగింది. దానికి వారు(స) "నిన్ను సృష్టించిన అల్లాహ్‌కు సాటిగా మరొకరిని కల్పించడం." అని సమాధానం చెప్పారు. (బుఖారీ 4477, ముస్లిం 86).

షిర్క్ అనేది మనం చేసిన సద్కార్యాలను నిర్వీర్యం చేస్తుంది. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోయేవి! (అల్ అన్ఆమ్ -88)

షిర్క్ లోనే జీవితం గడిపేసిన వ్యక్తి శాశ్వతంగా నరకాగ్నికి అర్హుడవుతాడు. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! (అల్ మాయిదా : 72)

షిర్క్ యొక్క రకాలు

١
పెద్ద తరహా షిర్క్
٢
చిన్న తరహా షిర్క్

1- పెద్దతరహా షిర్క్.

షిర్క్ అనగా ఒక దాసుడు అల్లాహ్‌కు కాకుండా మరొకరికి ఆరాధన చేయడం. ఆరాధనకు సంబందించి అల్లాహ్’కు సంతుష్ఠ పరచే ఏదైనా మాట లేదా ఆచరణ అల్లాహ్ కు కాకుండా మరొకరికి చేస్తే అది షిర్క్ మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) గా పరిగణించబడుతుంది. అతిపెద్ద షిర్క్ యొక్క ఉదాహరణలు: ఒక దాసుడు తన అనారోగ్యానికి స్వస్థత కోసం లేదా తన జీవనోపాధిని విస్తరించమని అల్లాహ్‌కు కాకుండా మరొకరిని అడగడం. అదేవిధంగా, ఒక దాసుడు అల్లాహ్‌పై కాకుండా మరొకరిపై భరోసా ఉంచడం, అల్లాహ్‌కు కాకుండా మరొకరికి ప్రార్థించడం, లేదా అల్లాహ్‌కు కాకుండా మరొకరికి ఖుర్బానీ ఇవ్వడం వగైరా పెద్ద షిర్క్ గా పరిగణింపబడుతుంది.

١
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. (గాఫిర్: 60).
٢
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : మీరు వాస్తవానికి విశ్వసించిన వారే అయితే! అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకోండి." (అల్ మాయిదా : 23)
٣
కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు ఖుర్బానీ కూడా (ఆయన కొరకే) ఇవ్వు! (అల్-కౌసర్: 2).

అల్లాహ్‌కు బదులుగా మరెవరికైనా వేడుకోళ్లు, ప్రార్థనలు, లేదా వాటితో సమానమైనవి చేయడం షిర్క్ (బహుదేవతారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) గా పరిగణించబడుతుంది. ఎందుకంటే, స్వస్థత మరియు జీవనోపాధి అనేవి అల్లాహ్ యొక్క ప్రత్యేక లక్షణాలు. అల్లాహ్‌పై మాత్రమే నమ్మకం ఉంచడం, అల్లాహ్‌కు మాత్రమే వేడుకోవడం, అల్లాహ్‌కు మాత్రమే ఖుర్బానీ ఇవ్వడం అనేవి అల్లాహ్ యొక్క ఆరాధనలో ఏకత్వం యొక్క భాగము.

2. చిన్నతరహా షిర్క్

పెద్దతరహా షిర్క్ కు దారి తీసే ప్రతిఒక్క మాట మరియు ప్రతిఒక్క పని

చిన్నతరహా షిర్క్ యొక్క ఉదాహరణలు

١
రియా (ప్రదర్శనా బుద్ధి) అనేది ఒక వ్యక్తి తన పనుల ద్వారా ప్రజల ప్రశంసలు లేదా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో నమాజు లేదా ఇతర మంచి పనులు చేయడం. ఇది ఒక రకమైన షిర్క్ (భాగస్వామ్యం) అనబడుతుంది, ఎందుకంటే ఈ వ్యక్తి అల్లాహ్‌కు బదులుగా ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. దైవప్రవక్త (స) వారు రియా గురించి ఇలా హెచ్చరించారు: "మీ గురించి నేను ఎక్కువగా భయపడేది చిన్న షిర్క్" అని సెలవిచ్చారు. "చిన్న షిర్క్ అంటే ఏమిటి, ఓ దైవ ప్రవక్తా?" అని సహచరులు అడిగారు. దానికి వారు “ప్రదర్శనా బుద్ధి” అని సెలవిచ్చారు. (అహ్మద్ 23630).
٢
తౌహీద్‌కు విరుద్ధంగా ఉండే కారణంగా నిషేధించబడిన మాటలు: అల్లాహ్‌కు బదులుగా ఇతర వాటిపై ప్రమాణం(ఒట్టు వేయడం) చేయడం: కొంతమంది "నీ జీవితం పై ప్రమాణం" లేదా "ప్రవక్త పై ప్రమాణం" అని ప్రమాణం చేస్తారు. ఇది తప్పు మరియు ఇది షిర్క్‌కు దారితీస్తుంది. ఎందుకంటే ఇది అల్లాహ్‌కు బదులుగా మరొకరిని ప్రమాణం చేయడం అవుతుంది. దైవప్రవక్త(స) వారు ఈ విషయం గురించి హెచ్చరించారు: "అల్లాహ్ కు బదులుగా ఇతరులపై ప్రమాణం చేసేవాడు కాఫిర్ (బహుదైవారాధన చేసే వాడు) లేదా ముష్రిక్ (దైవానికి సాటి కల్పించిన) వాడు అవుతాడు." (తిర్మిధీ 1535)

జనాలతో ఏమైనా అడగడం అనేది కూడా షిర్క్ అనబడుతుందా ?

ఇస్లాం మానవ బుద్ధిని, మనస్సును మూఢవిశ్వాసాలు, బూటకపు నమ్మకాల నుండి మరియు సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ తప్ప ఇతరులకు బానిసలుగా మారకుండా ఉండడానికి, ఇటువంటి విషయాల నుండి వారిని విముక్తిని ప్రసాదించడానికి వచ్చింది. ఇస్లాం మానవుడిని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవించేలా ప్రోత్సహిస్తుంది. చనిపోయిన వ్యక్తులను లేదా నిర్జీవ వస్తువులను వేడుకోవడం, వాటికి లొంగడం అనేది నిషిద్దం. ఇది అవిశ్వాసం మరియు షిర్క్‌కు దారితీస్తుంది. అయితే జీవించి ఉన్న, సమర్ధత కలిగిన వ్యక్తిని నుండి సహాయం అడగడం, ప్రమాదం నుండి రక్షించమని వేడుకోవడం లేదా నాకోసం అల్లాహ్‌కు దుఆ చేయమని కోరడం అనేది తప్పు కాదు.

ప్రాణం లేని మరియు చనిపోయిన వారిని అభ్యర్దించడం మరియు అడగడం

నిర్జీవ వస్తువులు లేదా మృతులను అడగడం, వేడుకోవడం అనేది షిర్క్ (బహుదైవారాధన) గా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది బుద్ధికి, ఇస్లాంకు మరియు విశ్వాసానికి విరుద్ధమైనది. మృతులు లేదా నిర్జీవ వస్తువులు మన ప్రార్థనలను వినలేవు లేదా స్పందించలేవు. దుఆ అనేది ఒక ఆరాధన, దానిని సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ ను వదిలి ఇతరులకు అడగడం అనేది అల్లాహ్ కు భాగస్వాములను చేర్చడం అనగా షిర్క్ గా పరిగణించబడుతుంది. దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి రాకకు ముందు అరబ్బులు షిర్క్ లో మునిగి ఉన్నారు, వారు నిర్జీవ వస్తువులు మరియు మృతులను పూజించేవారు.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి