ప్రస్తుత విభాగం : model
పాఠం ఎవరైనా ఇస్లాంలోకి ప్రవేశించే విధానం ఏమిటి ?
పూర్తిగా అర్ధం చేసుకుని, సంపూర్తిగా విశ్వసిస్తూ, వాటిపట్ల శిరసావహిస్తూ ఇచ్చే రెండు సాక్ష్యాల ఆధారంగా ఒక మనిషి ఇస్లాంలో ప్రవేశించగలడు.
ఆ రెండు సాక్ష్యాలు
ఒక వ్యక్తి ఇస్లాంను స్వీకరించే క్షణం అతని జీవితంలో అత్యంత గొప్ప క్షణం. అది అతని నిజమైన జననం, ఎందుకంటే ఆ క్షణం నుండి అతను ఈ జీవితంలో తన ఉనికి యొక్క కారణాన్ని తెలుసుకున్నాడు. ఇస్లాంలోకి ప్రవేశించిన వెంటనే అతను స్నానం చేసి తన శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే, అతను తన అంతర్గత భాగాన్ని బహుదైవారాధన మరియు పాపాల నుండి శుభ్రపరచుకున్నట్లుగా, అతని బాహ్య స్వరూపాన్ని కూడా స్నానం చేయడం ద్వారా శుభ్రపరచుకోవడం ఉత్తమం.
అరబ్బు యొక్క నాయకులలో ఒకరైన ఒక సహాబీ ఇస్లాం స్వీకరించాలని తలచినపుడు వారిని స్నానం చేయమని దైవప్రవక్త (స)ఆదేశించారు. (అల్-బైహకీ 837).
ప్రశ్చాత్తాపం
ప్రశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు మరలదాన్ని, తన అవిధేయతను మరియు అవిశ్వాసాన్ని విడిచిపెట్టి, హృదయపూర్వకంగా అల్లాహ్ వైపుకు మరలి రావడాన్ని తౌబా అంటారు
సరైన తౌబా యొక్క షరతులు
సంకల్పాన్ని ధృఢపరిచే వైపుకు అడుగులు వేయాలి
ప్రాయశ్చితం తరువాత చేయవలసినది ఏమిటి ?
ఒక మనిషి తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, అల్లాహ్ వైపు తిరిగి వస్తే, అల్లాహ్ అతని పాపాలన్నింటినీ క్షమిస్తాడు. అతని పాపాలు ఎంత పెద్దవిగా ఉన్నా, ఎంత భారీగా ఉన్నా అల్లాహ్ క్షమిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ యొక్క కరుణ చాలా విస్తృతమైనది. అది ప్రతిదానినీ కప్పివేస్తుంది. ఖురాను : “ఇలా అను: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత." (అల్-జుమర్: 53).
ఒక ముస్లిముహృదయపూర్వకంగా, నిజాయితీగా పశ్చాత్తాపపడిన తరువాత, అతనిపై ఎటువంటి పాపం ఉండదు. అంతేకాకుండా, నిజాయితీగా, భయంతో, పశ్చాత్తాపంతో ఉన్నవారికి అల్లాహ్ వారి పాపాలను కూడా పుణ్యాలుగా మార్చగలడు. ఖుర్ఆన్: “కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. (ఫుర్ఖాన్: 70)
మరియు ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో, వారు ఆ పశ్చాత్తాపాన్ని కొనసాగించాలి మరియు తన పూర్వపు స్థితికి దారితీసే షైతాను ఉచ్చులలో పడకుండా ఏ స్థాయిలో ఏమిచేయాలో అది చేయాలి.అవసరమైతే తన విలువైన వాటిని త్యజించాలి.
ఒక విశ్వాసి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ప్రేమను తన జీవితంలో అత్యంత ప్రధానంగా ఉంచాలి. అల్లాహ్ కు సమీపంగా ఉన్నవారితో మరియు ధార్మికంగా సరైన మార్గంలో పయనిస్తున్న వారితో దగ్గరుండాలి మరియు ప్రేమించాలి. అగ్నిలో కాలిపోవడాన్ని ఏ విధంగా ఇష్టపడమో అదేవిధంగా అవిశ్వాసం, దైవానికి సాటి కల్పించడం మరియు అపమార్గం వైపుకు మరలా తిరిగి వెళ్ళడం అనే విషయాన్ని అయిష్టపడాలి. అల్లాహ్ యొక్క సాన్నిహిత్యం, ఆయన ధార్మిక నియమాలు మరియు మార్గదర్శకం పట్ల సంతృప్తి, ఆనందం కలిగి ఉండే వ్యక్తి తన మనస్సులో విశ్వాసం యొక్క మాధుర్యాన్ని అనుభూతి చెందుతాడు, మదిలో ప్రసన్నతను అనుభవిస్తాడు. దైవప్రవక్త(స) వారు ఇలా సెలవిచ్చారు : “ఈ మూడు గుణాలు ఎవరైతే కలిగి ఉంటాడో అతడు విశ్వాసమాధుర్యాన్ని అనుభూతి చెందుతాడు. ఎవరికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స) తనకు ఇష్టమైన వారందరికంటే ఎక్కువగా ప్రియమైనవారో, మరియు ఎవరైతే ఒక వ్యక్తిని అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తాడో, మరియు ఎవరైతే అల్లాహ్ తనను కాపాడిన తర్వాత తిరిగి మరలా అవిశ్వాసంలో పడటం అగ్నిలో పడేంతగా ద్వేషపడతాడో అతడు”. (బుఖారీ 21, ముస్లిం 43).
ధర్మానికి కట్టుబడి ఉండడం మరియు ఈ ధర్మమార్గములోని కష్టసామయాలలో ధృఢంగా నిలిచి ఉండడం
ఒక వ్యక్తి విలువైన ఖజానాను కలిగి ఉంటే, దానిని దొంగల బారీ నుండి కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉంటాడు. అదేవిధంగా, ఇస్లాం అనేది దైవం మానవులకు అందించిన అత్యంత గొప్ప వరం. ఇది ఒక సాధారణ ఆలోచనా విధానం లేదా ఒక హాబీ కాదు, మానవ జీవితంలోని ప్రతి కదలికను నియంత్రించే ఒక ధర్మం. అందుకే అల్లాహ్ తన ప్రవక్తకు ఇస్లాం మరియు ఖురాన్ను బలంగా పట్టుకోవాలని, ఏ విషయంలోనూ రాజీ పడకూడదని ఆదేశించాడు. ఎందుకంటే అది సరైన మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి. తన దివ్యవచనంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు” : కావున నీవు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా, నీవు ఋజుమార్గం మీద ఉన్నావు” (అల్-జుఖ్రూఫ్: 43).
ఇస్లాంను స్వీకరించిన తరువాత ఒక విశ్వాసి కష్టాలను ఎదుర్కుంటే దుఖించకూడదు. ఎందుకంటే ఇది దైవం యొక్క పరీక్షలో ఒక భాగం. మనకన్నా గొప్పవారు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ వారు ఓపికతో వాటిని ఎదుర్కున్నారు. దైవప్రవక్తలకు బయట వారికన్నా ముందు తమ కుటుంబాల నుండి కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారు. కానీ వారు దైవం మార్గంలో ఎదురైన కష్టాలకుబలహీనపడలేదు, తమ విశ్వాసాన్ని మార్చుకోలేదు. కష్టాలు ఒక ముస్లిం యొక్క విశ్వాసం మరియు నమ్మకం యొక్క నిజాయితీని పరీక్షించడానికి అల్లాహ్ అనుసరించే ఒక మార్గం. ఒక ముస్లిం ఈ పరీక్షకు సిద్ధంగా ఉండాలి, ధర్మం పై పటిష్ఠంగా ఉండాలి, మరియు 'ఓ హృదయాలను మార్చేవాడా, నా హృదయాన్ని నీ ధర్మం పై స్థిరంగా ఉంచు' అని దైవప్రవక్త(స) వారు చేసినట్లుగా దుఆ చేయాలి, వేడుకోవాలి. (తిర్మిధి 2140).