ప్రస్తుత విభాగం : model
పాఠం సంపాదన మరియు జీవనోపాధిని వెతకడం
ధనం యొక్క ప్రాముఖ్యత:
మనుషులు తమ ప్రాథమిక అవసరాలైన ఆహారం, పానీయం, నివాసం, వస్త్రాలు మరియు ఇతర వాటిని పొందుటకు ధనం అవసరం; అలాగే తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వివిధ ప్రయోజనాలు మరియు ప్రయోజనకరమైన కార్యకలాపాలలో దీనిని ఉపయోగిస్తారు. ఇస్లాం ధనానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చింది మరియు దాని సంపాదన, ఖర్చులకు సంబంధించి అనేక విధివిధానాలను రూపొందించింది.
సంపాదన మరియు జీవనోపాధిని వెతకడం అంటే మనిషి ధనాన్ని పొందడానికి మరియు తన జీవిత అవసరాలను తీర్చుకోవడానికి చేసే అన్ని రకాల పనులు మరియు మార్గాలు. అది వ్యాపారం, పరిశ్రమలు, వ్యవసాయం లేదా ఇతర వృత్తుల ద్వారా కావచ్చు.
సంపాదన మరియు జీవనోపాధిని అన్వేషించడంలోని ఇస్లామీయ నియమావళి
గర్వపడాలనే ఉద్దేశంతో లేదా కేవలం ఆస్తులు పెంచుకోవాలనే ఆశతో సంపాదించడం సరైనది కాదు (మక్రూహ్). అయితే, కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఇది నిషిద్ధం (హరామ్) కూడా.
ధనాన్ని సంపాదించే లేదా జీవనోపాధిని వెతుక్కునే ప్రతి ముస్లిము దానికి సంబంధించిన ఇస్లామీయ జ్ఞానాన్ని తప్పనిసరిగా సంపాదించాలి. ముఖ్యంగా తాను చేసే వ్యాపార లావాదేవీల నియమావళిని, అంటే క్రయవిక్రయాలు, అద్దె ఒప్పందాలు, భాగస్వామ్య వ్యాపారాలు మరియు వడ్డీ వంటి వాటికి సంబంధించిన నియమాలను తెలుసుకోవాలి. తన సంపాదన అన్వేషణలో అల్లాహ్ నిషిద్ధం చేసిన వాటిలో పడిపోకుండా ఉండటానికి ఈ అవగాహన ఎంతో అవసరం.
సంపాదన మరియు జీవనోపాధి అన్వేషణలో పాటించవలసిన మర్యాదలు
1- జీవనోపాధిని అన్వేషించే క్రమంలో పాటించవలసిన విధిగా పరిగణించబడే మర్యాదలలో ఒకటి: అల్లాహ్ విధించిన ఏ విధిని (ఫర్ద్) కూడా ఆలస్యం చేయకూడదు లేదా ఆటంకపరచకూడదు. ముస్లిము తన సమయాన్ని మరియు శ్రమను ఈ విధుల (ఫరాయిద్) ప్రాతిపదికన మాత్రమే క్రమబద్ధీకరించుకోవాలి.
2- విధిగా పాటించవలసిన మరికొన్ని మర్యాదలు: ఒక ముస్లిము తన జీవనోపాధిని వెతుక్కునే క్రమంలో ఇతరులకు ఎటువంటి హాని లేదా నష్టాన్ని కలిగించకూడదు. ఎందుకంటే ఇస్లామీయ నియమావళి (షరీఅత్) ప్రకారం తనకు తాను హాని కలిగించుకోకూడదు మరియు ఇతరులకు హాని తలపెట్టకూడదు.
సంపాదించే విషయంలో మంచి ఉద్దేశాలను కలిగి ఉండాలి : ఉదాహరణకు తనకోసం మరియు తనపై ఆధారపడి ఉన్న వారి కోసం ఒకరి ముందు చేయి చాపడం నుండి తనను తాను దూరంగా ఉంచాలి, అనగా ఇతరులకు అడగకుండా స్వయంగా సంపాదించాలి మరియు ధనాన్ని సద్కార్యాల కోసం ఖర్చు చేయాలి, అంతేగానీ అవసరమున్నచోటకూడా ఖర్చు చేయకుండా పిసినారితనంతో డబ్బును కూడబెట్టడం, ఆ ధనంతో బడాయిలకు, గొప్పలకు పోవడం వంటి నీతిమాలిన పనులనుండి దూరంగా ఉండాలి.
ఒక ముస్లిము తన జీవనోపాధిని సంపాదించడంలో నిష్కపటమైన ఉద్దేశ్యం కలిగి ఉండి, ప్రజలకు దానధర్మాలు చేయడానికి మరియు వారి అవసరాలను తీర్చి సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తే, అతను చేసే ఆ ప్రయత్నం ఒక ఆరాధనగా పరిగణించబడుతుంది మరియు దాని ద్వారా అతను ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడు. దైవప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: "ప్రజలలో అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన వారు ఎవరంటే, ఇతరులకు అత్యధికంగా మేలు చేసేవారు." (అల్-అవ్సత్ - తబ్రానీ: 6026).
4- జీవనోపాధిని సంపాదించడం మరియు మనిషి యొక్క ఇతర అవసరాల మధ్య సమతుల్యతను, మితవాదాన్ని పాటించాలి. సంపాదన అనేది కేవలం ఒక సాధనంగా ఉండాలి తప్ప, అదే జీవిత పరమావధిగా మారిపోకూడదు. సల్మాన్ (ర) వారు అబు దర్దా (ర) అన్హుతో ఇలా అన్నారు: "నీ ప్రభువు పట్ల నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీ శరీరం (నీపై నీకు) పట్ల నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మరియు నీ కుటుంబం పట్ల కూడా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి చెందాల్సిన హక్కులను వారికి ఇచ్చివేయి." ఆ తర్వాత అబు దర్దా రజియల్లాహు అన్హు దైవప్రవక్త(స (వద్దకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేయగా, దైవప్రవక్త (స ( ఇలా సెలవిచ్చారు: "సల్మాన్ నిజమే చెప్పారు" (బుఖారీ: 1968).
5- జీవనోపాధిని సంపాదించే క్రమంలో అల్లాహ్ పైనే భారం వేయడం (తవక్కుల్): తవక్కుల్ యొక్క వాస్తవికత ఏమిటంటే, మనిషి తన హృదయాన్ని అల్లాహ్‌తో అనుసంధానిస్తూనే, కార్యసిద్ధి కోసం ఇస్లామీయ నియమావళి (షరీఅత్) అనుమతించిన మార్గాలను మరియు ప్రయత్నాలను అవలంబించడం.
6- జీవనోపాధి కేవలం అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తుందని మరియు అది కేవలం తన ప్రయత్నం వల్ల మాత్రమే సాధ్యం కాదని ఒక వ్యక్తి దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అల్లాహ్ కు మాత్రమే తెలిసిన ఒక కారణం (హిక్మత్) వల్ల, ఒక వ్యక్తి జీవనోపాధి కోసం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది అతనికి లభించకపోవచ్చు.
7- అల్లాహ్ ప్రసాదించిన దానిపై తృప్తి కలిగి ఉండడం మరియు జీవనోపాధి ఆలస్యమవుతుందని భావించకపోవడం; ఎందుకంటే అది అల్లాహ్ ద్వారా నిర్ణీత సమయంలో మరియు నిర్ణీత పరిమాణంలో నిర్ణయించబడింది. కాబట్టి ఒక ముస్లిము అల్లాహ్ తన కోసం నిర్ణయించిన దానిపై సంతృప్తితో, మర్యాదపూర్వకమైన మరియు గౌరవప్రదమైన రీతిలో జీవనోపాధిని అన్వేషించాలి. ఆ క్రమంలో హలాల్ (అనుమతించబడినది) వైపు మొగ్గు చూపుతూ, హరామ్ (నిషిద్ధం) నుండి దూరంగా ఉండాలి. దైవప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: "ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి మరియు జీవనోపాధిని వెతకడంలో హుందాతనాన్ని పాటించండి. ఏ ప్రాణి కూడా తన కోసం నిర్ణయించబడిన జీవనోపాధిని పూర్తిగా పొందే వరకు మరణించదు, అది ఆలస్యమైనప్పటికీ సరే. కాబట్టి అల్లాహ్ కు భయపడండి మరియు జీవనోపాధిని సంపాదించే మార్గంలో హుందాతనాన్ని ప్రదర్శించండి. హలాల్ అయిన దానిని తీసుకోండి మరియు హరామ్ అయిన దానిని వదిలివేయండి" (ఇబ్నె మాజః: 2144).
اختر مستوى الشرح المناسب لك
يحتوي الدرس الآن على طبقات اختيارية تساعدك على المراجعة السريعة أو التعمق دون مغادرة الدرس.
- الملخص: نظرة سريعة في نحو دقيقة.
- الأساسي: محتوى الدرس الأصلي وهو المسار المعتمد للتقدم.
- المتعمق: تفاصيل إضافية اختيارية عند توفرها.
تقدمك وإكمال الدرس يعتمدان دائما على صفحات المستوى الأساسي.