ప్రస్తుత విభాగం : model
పాఠం ఆర్థిక లావాదేవీల్లో ఇస్లామీయ నైతిక నియమాలు
నైతికత అనేది జీవితానికి సంబందించిన అన్ని అంశాలతో బలంగా ముడిపడి ఉంటుంది, బహుశా ఇస్లామీయ ఆర్థిక వ్యవస్థ యొక్క అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి దాని నైతిక విలువలు. ఈ విలువలనే పరిగణలోకి తీసుకుని ఇది ముందుకు సాగుతుంది, ఈ ప్రత్యేకతే ఇస్లామేయఆర్థిక వ్యవస్థను ఇతర ఆర్థిక వ్యవస్థల కన్నా ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ధర్మబద్ద సంపాదన నిమిత్తం పని చేయడానికి షరియా అనుమతించే అన్నీ అంశాలు, అన్నీ రకాల ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు లేదా ఆర్ధిక హక్కులను ఉత్పన్నం చేసే అంశాలు తదితరావన్నీ ఇందులో సమేతమై ఉన్నాయి. ఉదాహరణకు కొనుగోళ్లు, అమ్మకాలు, అద్దెకు ఇవ్వడాలు, కంపెనీలు మరియు తదితరవాటన్నికీ సంబందించిన ఒప్పందాలు వగైరా. ఇస్లామీయ వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలు అనగా ప్రజల మధ్య పరస్పర ఆర్థిక వ్యవహారాలను నియంత్రించే షరియా నియమనిబందనలు అని అర్ధం.
ఆర్ధిక వ్యవహారాల యొక్క లక్ష్యాలు మరియు ఉద్దేశాలు
ఇస్లాం ఒక సత్యవంతమైన ధర్మం, జనులను సంస్కరించే మరియు వారి జీవితాలను చక్కబెట్టే విషయాలతో ఈ ధర్మం అవతరించింది. దానికి కారణం ఇది మనుషుల సృష్టికర్త వద్ద నుండి వచ్చినది, వారికోసం ఏది ప్రయోజకరమైనదో ఆయనకు బాగా తెలుసు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు : “ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు”! (అల్-ముల్క్: 14). ఇతర వ్యవస్థలకు భిన్నంగా ఇస్లాం మనిషి యొక్క శారీరక, మానసిక మరియు ఆత్మ యొక్క అవసరాలు తీరడంతో పాటు ప్రాపంచిక వ్యవహారాలు మరియు మరణాంతరం ఎదుర్కొబోయే తీర్పుదిన వ్యవహారాలను, అవసరాలను పరిగణలోకి తీసుకునే ఆర్ధిక వ్యవస్థతో వచ్చినది.
మొదటిది- ప్రాపంచిక కోణం : అందరికీ న్యాయం చేకూరే విధంగా, ప్రతిఒక్కరికీ వారి వారి హక్కులు ఆందే విధంగా, అందరూ సమృద్ధిని సాధించే విధంగా ఇస్లామీయ ధార్మికశాస్త్రం(షరీయ) ప్రజల యొక్క ఆర్ధిక వ్యవహారాలను క్రమబద్దీకరించింది. అలాగే ప్రజల ఆర్ధిక వ్యవహారాలలో హలాల్(ధర్మబద్ద సంపాదన) మార్గాలను విస్తరింపజేసి వారికి నష్టం కలిగించే ప్రతిఒక్క అంశాన్ని నిషేదించింది.
రెండవది – ధార్మిక పరమైన కోణం : ధార్మిక నియమాల అంతిమ లక్ష్యం అల్లాహ్ యొక్క సంతుష్ఠత చూరగొనడం మరియు స్వర్గాన్ని సాధించడం మాత్రమే, ఇస్లాం అందించే ఈ వ్యవహారిక నియమాలు విశ్వాసుల మధ్య న్యాయాన్ని వ్యాపింపజేయడం ద్వారా అందరి మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయి మరియు సమాజంలో ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకునే భావాలను ప్రోత్సహిస్తాయి, ఉదాహరణకు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, బలహీనులకు తోడ్బాటు ఇవ్వడం. అలాగే మనస్సులను విద్వేషాలతో నింపివేసే ప్రతిఒక్క అంశాన్ని నిషేదించడం. ఉదాహరణకు వడ్డీలు తినడం మరియు జూదం ఆడడం.
మొదటిది - న్యాయం: ఆర్ధిక లావాదేవీలలో ఇరుపక్షాల ఆర్ధిక హక్కులను పరిగణలోకి తీసుకుని ఎటువంటి హెచ్చుదగ్గులు లేకుండా, ఎవరికీ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తవహించడం. ఉదాహరణకు క్రయవిక్రయాలు, అద్దెలు తదిత వాటిలో జరిగే మార్పిడి ఇరువైపులా సరిసమానంగా ఉండేటట్లు చూడడం. తన దివ్యగ్రంధము అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మ సమ్మతం (హలాల్) చేశాడు.”(అల్-బఖరా: 275). రెండవది : దయతలచడం, మేలుచేయడం : ఉదాహరణకు ఋణగ్రస్తుడిని ఆదుకోవడం లేదా అతని ఋణభారాన్ని పూర్తిగా దించేయడం. దివ్యగ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “మరియు (మీ బాకీదారుడు ఆర్థిక) ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి కుదిరే వరకూ గడువునివ్వండి. ఒకవేళ మీరు దానమని వదిలిపెడితే అది మీకు ఎంతో మేలైనది, ఇది మీకు తెలిస్తే (ఎంత బాగుండేది)!”. (అల్-బఖరా: 280). మరో ఉదాహరణ : వేతన కార్మికుడితో కుదుర్చున్న జీతం కన్నా ఎక్కువ జీతం ఇవ్వడం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “మేలు చేయండి. నిశ్చయంగా, అల్లాహ్ మేలు చేసే వారిని ప్రేమిస్తాడు”. (అల్-బఖరా: 195).
మూడవది - అన్యాయం : అనగా ఒకవ్యక్తి తన హక్కుకు మించి తీసుకోవడం, అధర్మంగా ప్రజల సొమ్మును తినేయడం. ఉదాహరణకు : వడ్డీ తీసుకోవడం, జూదమాడడం, కార్మికుడితో పని చేయించుకుని అతడిగి దక్కవలసిన వేతనాన్ని నిరాకరించడం వగైరా. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి. కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి. కాని మీరు పశ్చాత్తాప పడితే (వడ్డీ వదులుకుంటే), మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు (ఇతరులకు) అన్యాయం చేయకండి మరియు మీకూ అన్యాయం జరుగదు. [అల్-బఖరా: 278, 279]. దైవప్రవక్త (స) వారు ఇలా హెచ్చరించారు : “నేను తీర్పుదినాన ముగ్గురికి వ్యతిరేకంగా పోరాడతాను. నా పేరు మీద ఒప్పందం చేసి దానిని ఉల్లంఘించినవాడు, స్వతంత్ర వ్యక్తిని బానిసగా అమ్మేసి సొమ్ము తినేసినవాడు మరియు ఒక కార్మికునితో పూర్తిగా పని చేయించుకుని అతనికి ఇవ్వవలసిన జీతాన్ని ఎగ్గొట్టినవాడు”. (బుఖారీ 2227)