ప్రస్తుత విభాగం : model
పాఠం బంధుత్వాలను కలుపుకుని పోవడం.
రక్త సంబందం కలిగి ఉన్నవారితో మంచి విషయాలు పంచుకోవడం, వారి పట్ల దయ, కరుణ చూపించడం, వారి పట్ల మృదువుగా వ్యవహరించడం, వారిని సందర్శించడం, వారి సంక్షేమం గురించి తెలుసుకోవడం మరియు వారిలో అవసరమున్న వారి కోసం ఖర్చు చేయడం.
పవిత్ర ఖురాన్ మరియు ప్రవక్త సున్నత్ (ప్రవక్త సంప్రదాయం) లో బంధుత్వాలను కలుపుకోవాలని ప్రోత్సహించే మరియు వాటిని తెంచుకోవడాన్ని నిషేధించే వాక్యాలు వచ్చాయి. అవిశ్వాసులను వర్ణిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఎవరైతే అల్లాహ్‌తో చేసిన ప్రమాణాన్ని స్థిరపరచుకున్న తర్వాత భంగపరుస్తారో, మరియు అల్లాహ్ దేనినైతే (బంధుత్వాలను) కలుపుకోవాలని ఆజ్ఞాపించాడో దానిని తెంచివేస్తారో మరియు భూమిపై అశాంతిని కలిగిస్తారో, అటువంటివారే నష్టపోయేవారు" (అల్ బఖర: 27). మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఒకవేళ మీరు గనుక (ధర్మం నుండి) ముఖం తిప్పుకుంటే, మీరు భూమిపై అశాంతిని కలిగించి మరియు మీ బంధుత్వాలను తెంచివేస్తారా?" (ముహమ్మద్: 22).
ప్రవక్త(స) వారు ఇలా ప్రబోదించారు : ఎవరైతే అల్లాహ్ మరియు తీర్పుదినాన్నే గనక విశ్వసిస్తుంటే వారు తమ బంధువులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. (బుఖారీ 6138). అల్లాహ్ సమస్త సృష్టిరాశుల్ని సృష్టించిన తరువాత బంధు ప్రేమ: ఓ ప్రభువా ఇక్కడ ఈ స్థానములో నేను బంధుత్వాల తెగతెంపుల బారీనుండి నీ శరణు కోరుకుంటున్నాను. అని అన్నది. ఆ మాట విని అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నీ పట్ల సత్సంబంధాలు కలిగి ఉండే వాడి పట్ల నేనూ సత్సంబంధాలు కలిగి ఉంటాను, నీతో సంబందాలను తెగదెంపులు చేసుకునేవాడితో నేనూ సంబందాలను తెగతెంపులు చేసుకుంటాను. ఇది నీకిష్టమేనా? అని అన్నాడు. దానికి బంధుప్రేమ ‘ఇష్టమే ప్రభూవా’ అని అన్నది, అప్పుడు అల్లాహ్ ‘సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది’ అని సెలవిచ్చాడు. దైవప్రవక్త(స) వారు: “కావాలంటే ఈ ఆయతు చదవండి” అని సెలవిచ్చారు : "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?". (బుఖారీ 5987, ముస్లిం 2554).
ఎంత దగ్గరి బంధం ఉంటే అంతా ఎక్కువగా బంధాన్ని పటిష్ఠ పరచాలని ఇస్లాం ఆదేశించినది
సంబంధాలను కొనసాగించడం అనేది తప్పనిసరి బాధ్యత
కుటుంబబంధాలను కాపాడడం: మహ్రిమ్ (పెండ్లి చేసుకోవడం నిషిద్దమైన బంధాలు): ఉదాహరణకు తల్లిదండ్రులు, కొడుకులు, కూతుళ్లు, సోదరులు, సోదరీమణులు, మేనమామలు,మేనత్తలు, మామలు, పినతల్లులు.
ఈ బంధాలను సంరక్షించడం అభిలషణీయం
ఇవి గైర్ మహ్రమ్(పెండ్లి చేసుకునే అనుమతి ఉన్న బంధాలు) సంబందించిన బంధాల పరిరక్షణ. ఉదాహరణకు బాబాయి, మామాయిల సంతానం (కజిన్స్).
బంధాలను బదిలపరచుకునే విధానం
సాధ్యమైనంత ఎక్కువ మంచిని అందించడం ద్వారా కుటుంబ బంధాలను పదిలపరచుకోవచ్చు. అయినంతమేరా బంధాలను హాని కలిగించే ఏ పనీ చేయకూడదు, బంధాన్ని ఒక మంచి సంభాషణ ద్వారా లేదా డబ్బు మరియు అవసరమైన సహాయం అందించడం ద్వారా, హానిని నివారించడం ద్వారా, సహాయకారిగా ఉండడం ద్వారా, ఒక చిరునవ్వు ద్వారా, కృతజ్ఞత ద్వారా, దుఆ ఇవ్వడం ద్వారా ఇలా పలురకాల సదాచారణల ద్వారా బంధాలను కాపాడుకోవచ్చును.
బంధాలను కాపాడే మార్గాలు
కుటుంబ బంధాల ప్రయోజనాలు
1- బంధువులను ప్రేమించడానికి మరియు కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఇది ఒక మార్గం.
"మీరు మీ కుటుంబ బంధాల గురించి తెలుసుకోండి (ఎవరెవరు మీ బంధువులో తెలుసుకోండి), దాని ద్వారా మీరు మీ బంధువులతో అనుసంధానం కాగలరు. కుటుంబ బంధాలను కాపాడుకోవడం వలన కుటుంబంలో ప్రేమ, సంపద అనేవి వృద్ధి చెందుతాయి మరియు ఆయుర్దాయం పెరుగుతుంది." (తిర్మిథి 1979)
ఇది జీవనోపాధిని మరియు జీవిత కాలాన్ని, అనగా ఆయుషును పెంచుతుంది
దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు, "ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, దీర్గాయుషు పొందాలని కోరుకుంటున్నారో వారు తమ బంధాలను సంరక్షించుకోవాలి. (సహీ బుఖారీ 2067, సహీ ముస్లిం 2557)
3. బంధాలను కాపాడేవాడిని అల్లాహ్ కాపాడతాడు
అల్లాహ్ సమస్త సృష్టిరాశుల్ని సృష్టించిన తరువాత బంధు ప్రేమ: ఓ ప్రభువా ఇక్కడ ఈ స్థానములో నేను బంధుత్వాల తెగతెంపుల బారీనుండి నీ శరణు కోరుకుంటున్నాను. అని అన్నది. ఆ మాట విని అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నీ పట్ల సత్సంబంధాలు కలిగి ఉండే వాడి పట్ల నేనూ సత్సంబంధాలు కలిగి ఉంటాను, నీతో సంబందాలను తెగదెంపులు చేసుకునేవాడితో నేనూ సంబందాలను తెగతెంపులు చేసుకుంటాను. ఇది నీకిష్టమేనా? అని అన్నాడు. దానికి బంధుప్రేమ ‘ఇష్టమే ప్రభూవా’ అని అన్నది, అప్పుడు అల్లాహ్ ‘సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది’ అని సెలవిచ్చాడు. దైవప్రవక్త(స) వారు: “కావాలంటే ఈ ఆయతు చదవండి” అని సెలవిచ్చారు : "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?". (బుఖారీ 5987, ముస్లిం 2554).
4. బంధుత్వాలను కాపాడుకోవడం అనేది స్వర్గములో ప్రవేశానికి కారణం.
ఒక వ్యక్తి దైవప్రవక్త (స) వారిని స్వర్గానికి చేర్చే ఆచరణ గురించి చెప్పండి అని అడిగారు. అప్పుడు ప్రవక్త (స) వారు, "అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు; ఆయనతో ఎవరినీ సాటి కల్పించకు, నమాజులను స్థాపించు, జకాత్ చెల్లించు, మరియు బంధువులతో సత్సంబంధాలు నెరపు " అని ప్రబోదించారు. (బుఖారీ 1396, ముస్లిం 13)
اختر مستوى الشرح المناسب لك
يحتوي الدرس الآن على طبقات اختيارية تساعدك على المراجعة السريعة أو التعمق دون مغادرة الدرس.
- الملخص: نظرة سريعة في نحو دقيقة.
- الأساسي: محتوى الدرس الأصلي وهو المسار المعتمد للتقدم.
- المتعمق: تفاصيل إضافية اختيارية عند توفرها.
تقدمك وإكمال الدرس يعتمدان دائما على صفحات المستوى الأساسي.