నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం పండగ

పండుగలు ఇస్లాం యొక్క బాహ్య ఆచరణములలో ఒకటి. ప్రతిజాతికి వారికి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ఈ పాఠంలో, ఇస్లాంలోని పండుగల గురించి మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు.

  • ముస్లిముల పండగల గురించిన అవగాహన
  • పండగ నమాజు చేసే విధానం
  • పండగ రోజు గురించిన కొన్ని నియమనిబంధనల పై అవగాహన

పండుగలు ఇస్లాం యొక్క బాహ్య ఆచరణములలో ఒకటి

దైవప్రవక్త ముహమ్మద్ (స) మదీనాకు వచ్చినప్పుడు, మదీనా ముస్లింలు (అన్సార్) సంవత్సరంలో రెండు రోజుల పాటు ఆడుతూ, సంతోషిస్తూ ఉండడం చూశారు. "ఈ రెండు రోజుల ప్రత్యేకత ఏమిటి?" అని వారు(స) అడిగారు. "అజ్ఞాన కాలములో ఈ రెండు రోజుల్లో మేము ఆటలు ఆడేవాళ్ళం" అని అన్సార్ సమాధానం ఇచ్చారు. దానికి దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు: "నిజానికి, అల్లాహ్ ఈ రెండు రోజులకు బదులుగా మీకు మరింత మంచి రెండు రోజులను ఇచ్చాడు: అవి ఈద్ అల్ అద్ హా(బక్రీద్ పండుగ) మరియు ఈద్ అల్ ఫిత్ర్(రామదాన్ పండుగ) " (అబూ దావూద్ 1134). అలాగే, పండుగలు ధర్మాల యొక్క ఆచరణములు అని తెలియజేస్తూ, "ప్రతి జాతికి ఒక పండుగ ఉంటుంది, ఇది మన పండుగ" అని కూడా వారు (స) సెలవిచ్చారు (బుఖారీ 952, ముస్లిం 892).

ఇస్లామ్ లో పండుగ

ఇస్లాంలో ఈద్ అనేది ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజున ముస్లిములందరూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఆరాధనను పూర్తి చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తారు. పండుగ రోజున ఈ ఆచరణలు చేయడం మంచిది: అందరితో ఆనందం పంచుకోవడం, అందమైన దుస్తులు ధరించడం, అవసరమైన వారికి సహాయం చేయడం, ధర్మబద్ద మార్గాల్లో ఆనందించడం, అల్లాహ్ అనుగ్రహాలను గుర్తుంచుకోవడం వగైరా.

ముస్లిములకోసము సున్నతు ప్రకారంగా రెండు పండుగలు మాత్రమే ఉన్నవి, ఈ రెండు తప్పిస్తే ఇంకేదైనా రోజును పండుగగా ప్రత్యేకించుని జరపడం అనేది నిషేదించడమైనది

١
ఈద్ అల్ ఫిత్ర్ : షవ్వాల్ నెల మొదటి తారీకు
٢
ఈద్ అల్అద్'హా : దిల్ దిజ్జా నెల పదవ తారీకు

ఈద్ యొక్క నమాజు

ఇది ఇస్లాంలో చాలా ప్రాముఖ్యత కలిగిన నమాజు. ఈద్ రోజున పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ ఈ నమాజులో పాల్గొనాలని ఇస్లాం నొక్కి చెప్పింది. ఈ నమాజు యొక్క సమయం సూర్యోదయం తర్వాత ఒక బల్లెమంత ఎత్తులో సూర్యుడు ఉన్నప్పుడు నుండి మధ్యాహ్నం జవాల్ సమయం మొదలయ్యే వరకు ఉంటుంది.

ఈద్ నమాజు చదివే విధానం

ఈద్ నమాజు రెండు రెకాతులు కలిగి ఉంటుంది. ఈ నమాజులో ఇమామ్ ఖురాన్ ను బిగ్గరగా చదువుతాడు. నమాజు తర్వాత రెండు ఖుత్బాలు (ప్రసంగం) ఉంటాయి. ప్రతి రెకాతు ప్రారంభంలో, ఇమామ్ అదనపు తక్బీర్లు (అల్లాహు అక్బర్) చదువుతాడు. మొదటి రెకాతులో ఖురాన్ చదవడానికి ముందు ఆరు తక్బీర్లు చదువుతాడు. రెండవ రెకాతులో సజ్దా నుండి లేచిన తర్వాత ఐదు తక్బీర్లు చదువుతాడు.

కుటుంబ సభ్యులలో ఆనందాన్ని పంచడం ధర్మబద్దం చేయబడినది

యువకులు, వృద్ధులు, పురుషులు మరియు స్త్రీలు ధర్మబద్ద విధానంలో ఆనందాన్ని పంచుకోవాలి, ఉన్న దుస్తులలో అన్నింటికన్నా మంచి దుస్తులు ధరించాలి, ఆ రోజున ఉపవాసం ఉండకుండా తినడం అనేది ఆరాధనగా పరిగణింపబడినది, పండుగ రోజున ఉపవాసం ఉండడం నిషేదించబడినది.

రెండు ఈద్ లలో తక్బీర్ చెప్పడం

ఈద్ అల్ ఫిత్ర్ సందర్భంగా తక్బీర్ చెప్పడం ఆదేశించబడింది. రమదాన్ మాసం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈద్ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తపరచడానికి, అల్లాహ్ అనుగ్రహం మరియు మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి తక్బీర్ చెబుతారు. తన వచనంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగడానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి”! (అల్-బఖరా: 185) ఈద్ అల్ అద్’హా సందర్భంగా ఆనందాన్ని వ్యక్తపరచడానికి, హజ్ యాత్రను పూర్తి చేసుకున్న హాజీలకు అభినందనలు తెలియజేయడానికి, ధుల్ హిజ్జా నెలలో పది రోజుల పాటు సదాచారణలు చేసే అవకాశం దక్కినందుకు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలియజేయడానికి తక్బీర్ చెబుతారు. “వాటి మాంసం గానీ, వాటి రక్తం గానీ అల్లాహ్ కు చేరవు! కానీ మీ భయభక్తులే ఆయనకు చేరుతాయి. మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ ఘనతను కొనియాడటానికి, ఈ విధంగా ఆయన వాటిని మీకు వశపరిచాడు. సజ్జనులకు శుభవార్తను వినిపించు!” (అల్-హజ్: 37)

ఈద్ రోజున తక్బీర్లు చెప్పే విధానం

అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్, అలాగే ఇది కూడా చెప్పవచ్చు. అల్లాహు అక్బర్ కబీరా, వల్ హందులిల్లాహి కసీరా , వ సుబ్ హానల్లాహి బుక్రతన్ వ అసీలా

ఇతరులకు ఇబ్బంది కలగని విధంగా పురుషులు తమ దారివెంబట బిగ్గరగా తక్బీర్ చెప్పవచ్చు, స్త్రీలు తక్కువ స్వరముతో తక్బీర్ చెప్పవచ్చు

మక్కా లోని మస్జిద్ అల్ హరామ్ నుండి ఈద్ యొక్క తక్బీర్లను వినండి

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి