ప్రస్తుత విభాగం : model
పాఠం అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం
అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం యొక్క అర్ధం
ఈ విశ్వంలో ఉన్న ప్రతిఒక్కటికీ కేవలం అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన తప్ప మరే సృష్టికర్త లేడు, దీనిగురించి తన దివ్యగ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : “అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త”. (అల్-జుమర్: 62) అయితే మనిషి చేసేది మాత్రం ముందు నుండే ఉన్న వస్తువుల యొక్క స్థితిని మరొక స్థితిలోకి మార్చడం లేదా సమీకరించడం లేదా వాటి కూర్పు చేయడం వంటిది మాత్రమే. అక్కడ ఒక కొత్త సృష్టి అనేది జరగదు, ఏమీలేని శూన్యం నుండి దేనినైనా సృష్టించడం జరగదు, చనిపోయిన దానిని బ్రతికించడం జరగదు.
సర్వసృష్టిరాసులకు ఆహారాన్ని అందించేవాడు ఆయనే, ఆయన తప్ప వేరెవరూ ఆహారాన్ని సమకూర్చరు, దివ్యగ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్ పైననే ఉంది”.(హుద్: 6).
ప్రతిఒక్కదానికి యజమాని ఆయనే, ఆయన తప్ప వేరెవరూ యజమాని లేడు, తన దివ్యవచనంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “ఆకాశాల పైననూ, భూమి పైననూ మరియు వాటిలో నున్న సమస్తం పైననూ, సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ దే!”(అల్-మాయిదా: 120).
ప్రతిఒక్క దాని వ్యవహారం నడిపేది, నిర్వహించేది ఆయన ఒక్కడే, అల్లాహ్ తప్ప మరెవరూ వాటిని నడపలేరు : పవిత్ర ఖురానులో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు”. (సజ్దా: 5).
మనిషి యొక్క నిర్వహణ మరియు అల్లాహ్ యొక్క నిర్వహణ
దైవప్రవక్త (స) వారి కాలంలో అరబ్బులోని విగ్రహారాధకులు అల్లాహ్ యొక్క రుబూబియత్(సృష్టికర్త, పాలకుడు) ను విశ్వసించేవారు
.ఈ సృష్టిలోని ప్రతిఒక్క దానిని కేవలం సర్వసృస్త్తికర్త అయిన అల్లాహ్ మాత్రమే సృజించాడు, కేవలం అల్లాహ్ మాత్రమే ఈ సృష్టినంతటినీ నడిపిస్తున్నాడు అని ఒక వ్యక్తి అంగీకరించి ఆ తరువాత కొన్ని ఆరాధనలు దైవేతరులకు కూడా చేస్తూ ఉంటే దానిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి, అది ఎంతవరకు వివేకము ? ఇలా చేయడం అనేది న్యాయానికి విరుద్ధమైనది మరియు పాపాలలోకెల్లా మహా పాపము, ఈ కారణంగానే లుక్మాన్ (అ) తన కుమారుడికి హితబోధ చేస్తూ ఇలా సెలవిచ్చారు : "ఓ నా పుత్రుడా! అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పించకు. నిశ్చయంగా, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా దుర్మార్గము."( లుక్మాన్ : 13 )
.పాపాలలోకెల్లా మహా పాపం ఏమిటని ప్రశ్నించినపుడు దైవ ప్రవక్త (స) వారు ఇలా సమాధానమిచ్చారు : “నిన్ను సృష్టించిన అల్లాహ్ కు తోడుగా నువు ఇతరులకు సాటి కల్పించడం”. (బుఖారీ:4207 – ముస్లిం: 86)
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఆధీనతను దాటి ఏ సృష్టి కూడా వెళ్లలేదని ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు, దాసుడు మనశ్శాంతిని, దైవ సంబంధ నమ్మకాన్ని పొందుతాడు. దీనికి కారణం, అల్లాహ్ ఏకైక సృష్టికర్త, యజమాని, జ్ఞానంతో వారిని నడిపించేవాడు, సమస్తం ఆయన నియంత్రణలోనే ఉంటుంది, ఒక్క చిన్న కణం కూడా ఆయన అనుమతి లేకుండా కదలదు, ఆయన ఆదేశం లేకుండా స్థిరంగా ఉండదు, మరియు ఆయనే ఏకైక రక్షకుడు అని గ్రహించడమే. ఈ సత్యాలు తెలుసుకోవడం వల్ల దాసుడు మనస్సులో శాంతిని, అల్లాహ్ పైనే పూర్తిగా ఆధారపడటం, ఆయనను మాత్రమే కోరుకోవడం, జీవితంలోని అన్నీ విషయాలలో కేవలం ఆయనపైనే పూర్తి నమ్మకంతో ముందుకు సాగడం వంటి ప్రయోజనాలు పొందుతాడు.