నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం అల్లాహ్ యొక్క ఉలూహియత్(అల్లాహ్ ఒక్కడే ఆరాధనలకు అర్హుడు) ను విశ్వసించడం

కేవలం అల్లాహ్ మాత్రమే అన్నిరకాల ఆరాధనలకు అర్హుడు అని మనస్పూర్తిగా విశ్వసించడం

  • తౌహీద్ ఏ ఉలూహియత్ గురించిన అవగాహన
  • తౌహీద్ ఏ ఉలూహియత్ యొక్క ప్రాముఖ్యత గురించిన అవగాహన

.ఉలూహియత్ పట్ల విశ్వాసం యొక్క అర్ధం

సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ మాత్రమే బాహ్య , అంతర్గత మరియు అన్ని రకాల ఆరాధనలకు అర్హుడు అని బలంగా విశ్వసించడం, ఉదాహరణకు ; వేడుకోలు, భయభక్తులు, నమ్మకం ఉంచడం, సహాయాన్ని ఆర్ధించడం, నమాజు చదవడం, జకాటు ఇవ్వడం, ఉపవాసాలు ఉండడం తదితర ఆరాధనలకు కేవలం అల్లాహ్ మాత్రమే అర్హుడు. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు." (అల్-కహ్ఫ్: 110).

దైవం అనేవాడు కేవలం ఒకేఒక్కడు అని అల్లాహ్ తెలియజేశాడు, అనగా ఆరాధనకు అర్హుడు ఒకేఒక్కడు, ఆయన తప్ప ఇతరులను దైవం చేసుకోవడం, ఇతరులను ఆరాధించడం తగదు.

.నిశ్చయంగా, మీ ఆరాధ్యదైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం ప్రతి దానిని ఆవరించి ఉంది. (తాహా: 98).

ఉలూహియత్ పట్ల విశ్వాసము యొక్క ప్రాముఖ్యత

ఉలూహియత్ లో ఏకత్వం యొక్క ప్రాముఖ్యత అనేది చాలా విధాలుగా ఉన్నది

1. జిన్నులు మరియు మనుషుల పుట్టుక ఉద్దేశం అదే

సాటిలేని ఏకైక అల్లాహ్ ను ఆరాధించడానికి మాత్రమే వారు సృష్టింపబడ్డారు, తన దివ్య వచనంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే" (అల్-థారియత్: 56).

2. ప్రవక్తలను పంపడం మరియు దైవ గ్రంధాలను అవతరింపజేయడం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యం

దాని ఉద్దేశం అల్లాహ్ యొక్క సృష్టికి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ఆరాధన వైపుకు ఆహ్వానించడం మరియు ఆరాధింపబడుతున్న ఇతర దైవేతరులను తిరస్కరించడం. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవ్లీస్తున్నాడు ;మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి." [అన్-నహ్ల్: 36]

3.మనిషికి అది మాత్రమే మొదటి విధి

మఆజ్ బిన్ జబల్ (ర) వారిని యమన్ వైపుకు పంపేటపుడు దైవ ప్రవక్త (స) వారు వారిని ఈ విధంగా ఉపదేశించారు : మీరు గ్రంధవాసుల వద్దకు వెళుతున్నారు, కావున మీరు మొదటగా వారిని అల్లాహ్ యొక్క ఆరాధన వైపుకు ఆహ్వానించండి : (బుఖారీ 1458, ముస్లిం 19).

4.ఉలూహియత్' పట్ల విశ్వాసమే 'లా ఇలాహ ఇల్లల్లాహ్' యొక్క అర్ధం

ఏకత్వాన్ని సూచించే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అబవడే ఈ ప్రాధమిక విశ్వాస వచనా(కలిమ) నికి ఇస్లాం అత్యున్నత స్థానం ఇచ్చి ఉన్నది, ఈ కారణంగానే ఒక వ్యక్తి సత్యధర్మమైన ఇస్లాం లో ప్రవేశించాలంటే ఈ వచనాన్ని సంపూర్తిగా విశ్వసించాలి

5. ఈ కారణంగానే ఒక వ్యక్తి సత్యధర్మమైన ఇస్లాం లో ప్రవేశించాలంటే ఈ వచనాన్ని సంపూర్తిగా విశ్వసించాలి

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి