ప్రస్తుత విభాగం : model
పాఠం .అల్లాహ్ యొక్క నామాలు మరియు గుణవిశేషాల పట్ల విశ్వాసం
అల్లాహ్ యొక్క నామాలు మరియు గుణవిశేషాల పట్ల విశ్వాసం
దాసులు తన ప్రభువు గురించి తెలుసుకోవాలని ఖురాను చాలా సందర్భాలలో నొక్కి చెప్పినది, అల్లాహ్ ను ఆరాధించేటపుడు ఒక విశ్వాసి అల్లాహ్ యొక్క శుభ నామాలు మరియు గుణగనాల గురించిన జ్ఞానము కలిగి ఉండాలి, దీని వలన అతడు అల్లాహ్ పట్ల అంతర్దృష్టితో, అర్ధవంతముగా, మరింత ప్రభావవంతముగా ఆరాధిస్తాడు, దీని ప్రభావము అతని జీవితము మరియు ఆరాధనల పై ఉంటుంది.
అల్లాహ్ తనకు తగినట్లుగా ఏవైతే తన నామాలు మరియు గుణగణాలు తన గ్రంధములో మరియు దైవ ప్రవక్త (స) వారి హదీసులతో నిరూపించి ఉన్నాడో ఒక విశ్వాసి వాటిని విశ్వసిస్తాడు,
పరిపూర్ణమైన మరియు శుభమైన నామాలు కేవలం అల్లాహ్ కే చెందుతాయి, ఆయన నామాలు మరియు గుణగనాలకు పోలిన ఉదాహరణలు ఉండవు. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "ఆయనకు పోలింది ఏదీ లేదు". (అల్-షురా: 11), తన సృష్టిలో తనకు పోలిన శుభనామాలు మరియు గుణగణాలు మరెవరితోనో పోలవు. ఈ విషయంలో అల్లాహ్ పరిశుద్ధుడు.
ఇక్కడ అల్లాహ్ యొక్క కొన్ని పేర్లను సమీక్షిద్దాము
అర్రహ్మాన్, అర్రహీం
ఈ రెండు పేర్లు ( అర్రహ్మాన్, అర్రహీం)తో అల్లాహ్ తన దివ్యగ్రంధాన్ని ఆరంభించాడు మరియు ఆయన తనను తాను తన దాసులకు పరిచయం చేసుకున్న మొదటి విషయం ఇది. ఖుర్‌ఆన్ యొక్క ప్రతి సూరా కూడా "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో) అనే వచనాలతో ప్రారంభమవుతుంది, సూరా తౌబా మినహా.
మన ప్రభువు దయ, కరుణాలను తనపై తానే విధిచేసుకున్నాడు, ఆయన కరుణ అనేది సర్వాన్ని కప్పి ఉన్నది. జంతువులు పరస్పరం చూపించే దయ, తల్లి తన బిడ్డపై చూపించే దయ, జీవులకు ఆహారం అందించడం వంటివన్నీ అల్లాహ్ తన సృష్టిపై చూపించే దయకు సంకేతాలు మాత్రమే. దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: "కావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ విధంగా ప్రాణం పోస్తాడో!" (అర్-రూమ్: 50).
ఉమర్(ర) వారి ఉల్లేఖనం : దైవప్రవక్త(స) వారు నా వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఒక యుద్ధ ఖైదీ స్త్రీ, తన బిడ్డకు పాలు ఇస్తున్న సమయంలో, వేరొకరి పసిబిడ్డను చూసి దానికీ పాలు పట్టినది. దానికి ప్రవక్త(స) వారు మాతో ఇలా సెలవిచ్చారు : “ఈ స్త్రీ తన బిడ్డను అగ్నిగుండంలో పడవేస్తుంది అని మీరు భావిస్తారా ? దానికి మేము లేదు ఖచ్చితంగా ఆమె అలా చేయదు అని అన్నాము. దానికి వారు(స) ఇలా ప్రబోదించారు : “అల్లాహ్ తన దాసుల పట్ల ఈ స్త్రీ తన బిడ్డను ప్రేమించడం కన్నా అధికంగా దయ కలిగి ఉన్నాడు”. (అల్-బుఖారీ 5999, ముస్లిం 2754).
అల్లాహ్ యొక్క కరుణ అనేది చాలా అత్యున్నతమైనది, సాటి లేనిది, అది అంచనా వేయడానికి కూడా మనకు అందనిది, దాసులే గనక నిజంగానే అల్లాహ్ యొక్క దయ, కరుణాలనే గనక తెలుసుకుంటే అసలు జీవితంలో ఎప్పుడూ కూడా నిరాశ అనేదే చెందరు.
అల్లాహ్ యొక్క కరుణ యొక్క రెండు రకాలు
దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : ఏ వ్యక్తీ కూడా తన ఆచనల వల్ల స్వర్గంలో ప్రవేశించలేదు, దానికి సహాబాలు ఇలా ప్రశ్నించారు : మీరు కూడానా ఓ ప్రవక్తా !. దానికి ఇలా సమాధానమిచ్చారు ; నేను కూడా. ఆయన కరుణలో ఒక భాగము నన్ను పరచుకుంటేనే. (బుఖారీ 6467, ముస్లిం 2818).
దాసుడి విధేయత మరియు సామీప్యం పెరిగే కొద్దీ అల్లాహ్ యొక్క కరుణ యొక్క అర్హత కూడా ఆ దాసుడి పట్ల పెరుగుతూ పోతుంది. "నిశ్చయంగా, అల్లాహ్ కారణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది : (అల్-అరాఫ్: 56).
అస్సమీ, అల్ బసీర్
భాషలు వేరైనా ప్రతిఒక్కరి శబ్దం యొక్క అర్ధాన్ని , వారి అవసరాలను అతడు అర్ధం చేసుకోగలడు, అది రహస్యంగా చెప్పినా లేదా బహిరంగంగా చెప్పినా సరే, రెండూ అతనికి సమానమే, కొంతమంది ఆజ్ఞానులు రహస్య మాటలను అల్లాహ్ వినడు అనుకునే వారు. ఇలాంటి వారి విషయంలో ఈ వ్యాక్యము అవతరించినది : లేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా కాదు, (వాస్తవానికి) మా దూతలు వారి దగ్గర ఉండి, అంతా వ్రాస్తున్నారు. (జుఖ్రుఫ్: 80).
ప్రతి ఒక్క చిన్న, పెద్ద విషయాన్ని అల్లాహ్ అతిసూక్ష్మంగా చూడగలడు, తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "ఓ నాన్నా! వినలేని మరియు చూడలేని మరియు నీకు ఏ విధంగానూ సహాయపడలేని వాటిని, నీవెందుకు ఆరాధిస్తున్నావు? (మర్యం: 42).
ఒక దాసుడు అల్లాహ్ సర్వత్రా విని, చూడగలవాడని, ఆకాశంలోనూ భూమిలోనూ ఒక చిన్న రేణువు కూడా అతనికి దాగి ఉండదని, అతను రహస్యాలను కూడా తెలుసుకుంటాడని గ్రహించినప్పుడు, అతను అల్లాహ్ పట్ల నిరంతర భయభక్తులతో ఉంటాడు. అతను అబద్ధాలు చెప్పడం, దుర్భాషలాడటం వంటివి మానుకుంటాడు. అతను అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే ప్రతి పని నుండి తన అవయవాలను, హృదయం యొక్క ఆలోచనలను దూరంగా ఉంచుతాడు. అల్లాహ్ తన రహస్యాలను, బహిరంగంగా చేసే పనులను మరియు లోపలి, బయటి స్థితులను తెలుసుకుంటాడని తెలుసు కాబట్టి, అతను అల్లాహ్ ఇష్టపడే, ఆమోదించే పనుల కోసం తనకున్న ఆశీర్వాదాలను, సామర్థ్యాలను ఉపయోగిస్తాడు. ఈ విషయం గురించి దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: “ ఎహ్సాన్ అనగా అల్లాహ్ నిన్ను చూస్తున్నాడు అనే భావనతో నువు అల్లాహ్ ను ఆరాధించాలి, ఒకవేళ అలాంటి భావనను కనబరచలేకపోతే అల్లాహ్ మాత్రం తప్పకుండా నిను చూస్తున్నాడనే భావనతో ఆరాధన చేయి." (బుఖారీ 4777, ముస్లిం 9)”.
సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ సర్వశక్తిమంతుడు. ఆయనకు పరిపూర్ణమైన జీవితం ఉంది. ఆ జీవితానికి మొదలు లేదు మరియు ముగింపు లేదు. ఆయన జీవితం నశించేది కాదు, లోపభూయిష్టమైనది అంతకన్నా కాదు. మహా మహిమాన్వితుడు ఆ అల్లాహ్. ఆయన జ్ఞానం, వినికిడి, దృష్టి, సామర్థ్యం, సంకల్ప శక్తి మొదలైన గుణాలు సర్వ పరిపూర్ణమైనవి. ఇలాంటి లక్షణాలు కలిగిన ఆయనే ఆరాధనకు, సజ్దాకు (సాష్టాంగ ప్రమాణానికి) అర్హుడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "కావున ఎన్నడూ మరణించని, ఆ సజీవుని (నిత్యుని) పైననే ఆధారపడి ఉండు." (అల్-ఫుర్కాన్:58)
అల్లాహ్ యొక్క అల్ ఖయ్యూమ్ అనే నామము రెండు విషయాలను సూచిస్తోంది
కావున వేడుకోలు సమయంలో అల్లాహ్ యొక్క ఈ రెండు గొప్ప పేర్లను కలిపి అడగడం అనేది ఆయనపట్ల వినమ్రతను సూచిస్తుంది. ప్రవక్త (స) వారు ఇలా వేడుకోలు : "ఓ సంపూర్ణ మరియు శాశ్వత జీవనం కలవాడా ! ఎవరి ఆధారము, సహకారము లేకుండా ఉన్నవాడా ! నీ కరుణ ద్వారా నేను నీ సహాయాన్ని ఆర్ధిస్తున్నాను.