ప్రస్తుత విభాగం : model
పాఠం నిశ్చితార్థం యొక్క మర్యాదలు
నిశ్చితార్థం అనగా ఒక పురుషుడు, ఒక స్త్రీ యొక్క సంరక్షకుడికి (వలీ), అల్లాహ్ మరియు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి సున్నత్ ప్రకారం ఆమెను వివాహం చేసుకోవాలనే తన కోరికను తెలియజేయడం.
అల్లాహ్ అనుగ్రహాలలో ఒకటి ఏమిటంటే, నిశ్చితార్థం విషయంలో ఆయన కొన్ని మర్యాదలను నిర్ణయించారు. ఇవి పరస్పర అంగీకారం, సరైన ఎంపిక మరియు మానసిక సంతృప్తిని చేకూర్చడమే కాకుండా, కాబోయే దంపతులు ఒకరితో ఒకరు సామరస్యంగా మరియు అనుకూలంగా ఉండటానికి తోడ్పడతాయి.
నిశ్చితాడానికి సంబందించిన మర్యాదలు
1- ఒక ముస్లిము నిశ్చితార్థం చేసుకున్న చోట, మరొక ముస్లిము నిశ్చితార్థం కోసం ప్రయత్నించకూడదు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఏ మనిషి కూడా తన సోదరుడి వ్యాపారం (బేరం) పై వ్యాపారం చేయకూడదు మరియు తన సోదరుడి నిశ్చితార్థం పై నిశ్చితార్థం చేయకూడదు, ఒకవేళ అతను అనుమతి ఇస్తే తప్ప" (బుఖారీ 5142, ముస్లిం 1412).
2- వివాహానికి ప్రేరేపించే విధంగా నిశ్చితార్థం చేసుకోబోయే స్త్రీని చూడటం. ముగీరా బిన్ షుబా (ర) వారు ఒక స్త్రీని నిశ్చితార్థం చేసుకోవాలని ఆశించినప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఆమెను చూడు, దీనివల్ల మీ మధ్య ప్రేమానురాగాలు పెంపొందే అవకాశం ఉంది" (తిర్మిది 1087). నిశ్చితార్థం చేసుకోబోయే పురుషుడిని చూసే హక్కు స్త్రీకి కూడా ఉంది, నిజానికి కొందరు ధర్మశాస్త్ర పండితులు ఈ విషయంలో ఆమెకే ఎక్కువ హక్కు ఉందని అభిప్రాయపడ్డారు. 'మీ మధ్య ప్రేమానురాగాలు పెంపొందడం' అనగా మీ ఇద్దరి మధ్య అనురాగం కలకాలం నిలిచి ఉండటం అని అర్థం.
జాబిర్ బిన్ అబ్దుల్లా (ర) వారు ఉల్లేఖించారు, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మీలో ఎవరైనా ఒక స్త్రీని నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నప్పుడు, ఆమెలోని వివాహానికి ప్రేరేపించే అంశాలను చూడగలిగితే, తప్పక చూడాలి". జాబిర్ (ర) వారు ఇలా అన్నారు: "నేను ఒక యువతిని నిశ్చితార్థం చేసుకోవాలని కోరుకున్నాను, ఆమెలోని వివాహానికి నన్ను ప్రేరేపించే అంశాలను చూసే వరకు ఆమెకు తెలియకుండా గమనించాను, ఆ తర్వాతే ఆమెను వివాహం చేసుకున్నాను" (అబూ దావూద్ 2082).
నిశ్చితార్థం చేసుకోబోయే స్త్రీని చూసేటప్పుడు పాటించవలసిన మర్యాదలు:
3- నిశ్చితార్థం యొక్క అతిముఖ్యమైన మర్యాదలలో ఒకటి, పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ తమ భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు సరైన ప్రాతిపదికలను అనుసరించాలి. దీనివల్ల అల్లాహ్ అనుగ్రహంతో ఆ ఇల్లు ప్రశాంతత, సుస్థిరత మరియు స్థిరత్వంతో విరాజిల్లుతుంది.
4- మంచి సంతతిని వృద్ధి చేయడం కోసం పురుషుడు సంతానవతి అయ్యే గుణం ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం నిశ్చితార్థం యొక్క మర్యాదలలో ఒకటి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సిఫార్సు చేస్తూ సెలవిచ్చారు: "ప్రేమించే మరియు సంతానవతి అయ్యే స్త్రీని వివాహం చేసుకోండి; ఎందుకంటే ప్రళయ దినమున ఇతర ఉమ్మట్(అనుచర సమాజం)ముందు మీ సంఖ్యను చూసి నేను గర్విస్తాను" (అబూ దావూద్ 2050).
5- సంప్రదింపులు, ఇస్తిఖారా (అల్లాహ్ నుండి శుభం మరియు మార్గదర్శకత్వం కోరడం) మరియు వేడుకోలు: ముస్లిము తన ప్రతి వ్యవహారంలో తన ప్రభువైన అల్లాహ్ సహాయాన్ని ఇస్తిఖారా ద్వారా కోరుతాడు, ఆయనను వేడుకుంటాడు మరియు విజ్ఞులైన, సరైన మార్గదర్శకత్వం చేయగల వ్యక్తులను సంప్రదిస్తాడు. వివాహమనేది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం, కాబట్టి దీనికి ముందు తగిన సంప్రదింపులు, ఇస్తిఖారా మరియు వేడుకోలు చేయడం ఎంతో అవసరం.
6- ఇద్దరు వ్యక్తులు కూడా తమ విషయాలను మరియు పరిస్థితులను వివరించడంలో అత్యంత స్పష్టతతో, నిజాయితీతో ఉండాలి. ఎటువంటి లోపాన్ని దాచకూడదు, అలాగే అబద్ధం చెప్పడం లేదా మోసం చేయడం వంటివి చేయకూడదు. ఎందుకంటే ఇవి వివాహం తర్వాత భవిష్యత్తులో వారి మధ్య ఉండే సంబంధంపై ప్రభావం చూపుతాయి.
7- నిశ్చితార్థానికి సంబంధించిన ఇస్లామీయ నియమావళిని మరియు పరిమితులను పాటించాలి. నిశ్చితార్థం అనేది కేవలం వివాహం చేసుకుంటామనే ఒక వాగ్దానం మాత్రమే కానీ అది వివాహం కాదు. కాబట్టి నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా పరస్పరం కరచాలనం చేయడం, ఏకాంతంగా గడపడం, పరాయి పురుషుడితో మృదువుగా మాట్లాడటం లేదా పురుషుడి కోసం సువాసనలు అద్దుకోవడం మరియు అలంకరించుకోవడం వంటివి అనుమతించబడవు.
اختر مستوى الشرح المناسب لك
يحتوي الدرس الآن على طبقات اختيارية تساعدك على المراجعة السريعة أو التعمق دون مغادرة الدرس.
- الملخص: نظرة سريعة في نحو دقيقة.
- الأساسي: محتوى الدرس الأصلي وهو المسار المعتمد للتقدم.
- المتعمق: تفاصيل إضافية اختيارية عند توفرها.
تقدمك وإكمال الدرس يعتمدان دائما على صفحات المستوى الأساسي.