నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం ముహమ్మద్ (స) వారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలకడం యొక్క అర్ధం

ముహమ్మద్ (స) వారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడమనేది రెండు సాక్ష్యాలలో రెండవ షరతు. ఈ పాతములో దీని గురించి తెలుసుకుందాము

  ముహమ్మద్ (స) వారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలకడం యొక్క అర్ధాన్ని తెలుసుకోవడం. 

ముహమ్మద్(స) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమివడం యొక్క అర్ధం

ముహమ్మద్(స) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలకడం అనగా వారి సందేశాలను విశ్వసించడం, వారి(స) ఆదేశాలను పాటించడం, వారు నిషేదించినవాటి నుండి దూరంగా ఉండడం మరియు వారు మనకు చూపిన పద్ధతిలోనే అల్లాహ్ ను ఆరాధించడం అనేవి ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి :

1. ప్రవక్త (స) వారు తెలియజేసిన విషయాలను సంపూర్ణంగా విశ్వసించడం.

١
అగోచర అంశాలు, తీర్పుదినం, స్వర్గము మరియు దాని సుఖాలు అలాగే నరకము మరియు దాని శిక్షలు.
٢
ప్రళయదినాన జరిగే సంఘటనలు, దాని సూచనలు మరియు అంతిమ కాలంలో జరిగే విషయాలు.
٣
పూర్వీకుల గాధలు, గత ప్రవక్తలు మరియు వారి ప్రజలకు మధ్య జరిగిన అంశాలు.

.2. ప్రవక్త (స) వారి ఆజ్ఞాపనలు మరియు నిషేదాజ్ఞలకు శిరసా వహించడం. ఇంకా :

١
దైవ ప్రవక్త (స) వారు మనల్ని ఆదేశించిన వాటిని సమ్మతించడం అనేది ఆరాధనలు, సద్కార్యాలు మరియు మంచి నడవదికలో భాగము.
٢
నిషేదింపబడిన అంశాలు, చెడు నడవదికలు, హానికర ప్రవర్తనల నుండి మనల్ని మనం కాపాడుకోవడం, ఆ నిశిద్దాంశాల నుండి మనంల్ని వారించడంలో అల్లాహ్ యొక్క విజ్ఞత దాగి ఉంది అనేది మనందరి విశ్వాసం, ఆ విజ్ఞత మనకు తెలియకుండా ఉన్నప్పటికీ మనం దానిని అనుసరించాలి మరియు దానిని విశ్వసించాలి.
٣
దైవప్రవక్త (స) వారు ఏదైతే మాట్లాడటారో అది తన ఇష్టానుసారంగా మాట్లాడారనీ అది అల్లాహ్ నుండి వహీ ద్వారా ఆయనకు అందిన దైవసందేశాన్ని మనకు బోధిస్తారని మనం విశ్వసిస్తాము
٤
.దైవప్రవక్త (స) వారి ఆదేశాన్ని తిరస్కరించినవాడు బాధాకరమైన శిక్షకు అర్హుడు అనేది మన విశ్వాసం. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి”. నూర్ 63

.3. కేవలం దైవ ప్రవక్త (స) వారు తెలిపిన పద్ధతి ప్రకారమే ఆరాధన చేయవలసి ఉంటుంది, ఇదే విషయం మరెన్నో విషయాలకు ఖచ్చితంగా వర్తిస్తుంది.

. వారిని అనుసరించడం

.ప్రవక్త (స) వారి ఆదర్శం, మార్గదర్శకం, వారి ఆదర్శ జీవితంలోని ప్రతి వాక్యం మరియు ప్రతి ఆచరణ మన జీవితాలలో అడుగడుగనా మనకు దారిని చూపుతాయి, సన్మార్గం వైపునకు నడిపిస్తాయి, మన జీవితం ప్రవక్త(స) వారి ఆదర్శానికి అనుగుణంగా ఎంత ఎక్కువగా ముందుకు సాగితే అంతే ఎక్కువగా అల్లాహ్ వద్ద మనం ఉన్నత స్థానాలను అందుకుంటాము, సాఫల్యం చెందుతాము. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు :(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత."

.పరిపూర్ణ ధర్మచట్టం

.దైవప్రవక్త (స) వారు దైవధర్మాన్ని, దైవధర్మనియమాలను ఎటువంటి లోపం లేకుండా పూర్తిగా, సంపూర్ణంగా మనకు అందజేశారు, ఈ పరిపూర్ణ ధర్మములో ఎవ్వరికీ కూడా ఇదివరకు లేని కొత్త విషయాలు, కొత్త పోకడలు సృష్టించి ఇందులో కలిపేయడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు.

.ఈ ధర్మ నియమాలు ప్రతీకాలానికి మరియు ప్రతి ప్రాంతానికి తగినవి మరియు ఉపయుక్తమైనవి.

.దైవగ్రంధమైన ఖుర్ఆను మరియు ప్రవక్త ఆదర్శం అయిన హదీసులో ప్రస్తావించబడిన ధర్మము మరియు ధర్మచట్టాల ఆదేశాలన్నీ కూడా ప్రతి కాలము మరియు ప్రతి ప్రాంతము కోసం అవతరింపబడ్డాయి. మనుషుల ప్రయోజనాల గురించి వారిని సృష్టించిన సృష్టికర్త కన్నా ఎక్కువగా ఇంకెవరికి తెలుస్తుంది.

.ప్రవక్త ఆదర్శానికి అనుగుణంగా

.ఆరాధనలు స్వీకరింపబడాలంటే సంకల్పశుద్ధితో అవి కేవలం అల్లాహ్ కోసం మాత్రమే జరగాలి, అంతేకాకుండా ఈ ఆరాధనలు దైవప్రవక్త (స) వారు మనకు చూపిన పద్దతి ప్రకారమే జరగాలి. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా కల్పించుకోరాదు." (అల్-కహఫ్ : 110) ఇక్కడ సద్కార్యం అంటే ప్రవక్త (స) వారు చూపిన విధానం ప్రకారమే జరగాలి అని అర్ధం.

ధర్మంలో నూతన పోకడల నిషిద్దత

.దైవప్రవక్త (స) వారు తెలుపని ఏదైనా ఆచరణను గానీ, ఆరాధనను గానీ ఆరాధనా ఉద్దేశంతో ధర్మంలో కొత్తగా సృష్టిస్తే అది దైవప్రవక్త (స) ఆదర్శానికి మరియు ఆజ్ఞాలకు పూర్తిగా విరుద్ధమవుతుంది, అటువంటి పనులకు పాల్పడిన వ్యక్తి యొక్క ఆ ఆచరణ తిరస్కరింపబడదమే కాకుండా దానికి అతడు పాపాత్ముడు అవుతాడు. తన దివ్య వచనంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి”. ఈ విషయంలో దైవ ప్రవక్త (స) వారు ఇలా బోధిస్తున్నారు : “మా ధర్మ నియమాలకు విరుద్ధంగా ఎవరైతే ఇదివరకు లేని కొత్త విషయాన్ని తీసుకువస్తాడో అది తిరస్కరించబడుతుంది” (బుఖారీ -2550. ముస్లిం – 1718)

దైవప్రవక్త(స) పట్ల ప్రేమ

.ఒక విశ్వాసిగా ప్రాపంచిక విషయాల పట్ల ప్రవక్త (స) కన్నా అధిక ప్రేమ కలిగి ఉండడం అనేది విశ్వాసానికి విరుద్ధమైన విషయం. ఒక విశ్వాసిగా ఐహిక బంధాలన్నిటికన్నా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (స) పట్ల ప్రేమను కలిగి ఉండాలి : దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిస్తున్నారు : ‘మీలో ఎవ్వరూ కూడా ఆ క్షణం వరకు సంపూర్ణ విశ్వాసులు కాజాలరు కానీ నా పై వారికి తమ సంతానం కంటే తల్లితండ్రుల కంటే మరియు ప్రజలందరీ కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉండాలి. (బుఖారీ : 15 - ముస్లిం : 44)

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి