నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం దివ్యఖురాను యొక్క పరిచయం

ఈ పాఠం ద్వారా అభ్యాసకుడికి ఖురాన్ యొక్క వాస్తవికత, అది ఎలా అవతరించినది మరియు దానిని ఏ విధంగా సంకలనం చేయడం జరిగినది అనే అంశాలు బోధపడతాయి.

  • ఖురాను యొక్క వాస్తవికత మరియు దానిలో ఎన్ని కాందాలు ఉన్నాయో తెలుసుకోవడం
  • ఖురానును సంకలనం చేసిన దశల గురించిన అవగాహన

దివ్యఖురాను

మానవాళిని అపమార్గపు చీకట్ల నుండి సన్మార్గపు వెలుగుల పైపు మార్గదర్శకం చేయడానికి సర్వసృష్టి కర్త అయిన అల్లాహ్ తన చిట్ట చివరి ప్రవక్త పై తన దివ్యవాచాన్ని అనగా ఖురానును అవతరింపజేశాడు, వాస్తవంగా మా ప్రవక్త (ముహమ్మద్) మీ వద్దకు వచ్చి వున్నాడు; మీరు కప్పి పుచ్చుతూ ఉన్న గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీకు బహిర్గతం చేస్తున్నాడు; మరియు ఎన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. వాస్తవంగా మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక జ్యోతి మరియు ఒక స్పష్టమైన గ్రంథం (ఈ ఖుర్ఆన్) వచ్చి వున్నది. దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు - అల్ మాయిదా 15,16

దివ్యఖురాను యొక్క పరిచయం

ఖురాను అంటే : దైవప్రవక్త ముహమ్మద్ (స) పై అవతరించిన దైవ వాఖ్యము, దాని పారాయణం ద్వారా ఆరాధన చేయబడుతుంది. ఈ దివ్యగ్రంధము సూరా ఫాతిహా నుండి మొదలై సూరా నాస్ తో ముగుస్తుంది.

ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తెలియజేసే ఇలాంటి చాలా పేర్లను ఖురాను గ్రంధం కలిగి ఉంది.

١
తన దివ్య వచనంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : అల్ ఖుర్ఆన్ : నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. - అల్ ఇస్రా :9
٢
అల్ కితాబ్ (గ్రంధము) : ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. -అల్ బఖర : 2
٣
అల్ ఫుర్’ఖాన్ : సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు! -అల్ ఫుర్ ఖాన్ : 1
٤
అల్ దిక్ర్(జ్ఞాపిక) : నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. -అల్ హిజ్ర్ : 9

దివ్య ఖురాను యొక్క అవతరణ

పవిత్రరమదాన్ మాసపు ఘనత గల ఒక రేయిలో ఈ ఖురాను యొక్క అవతరణ ఆరంభమైనది. “నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో అవతరింపజేశాము”. అల్ ఖద్ర్ : 1. “రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేరుపరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి”. అల్ బఖర : 185

పవిత్ర దైవవాణి అయిన ఖురానును అల్లాహ్ తన ముఖ్య దైవదూతలలో ఒకరైన జిబ్రయీల్ అలైహిస్సాలాం ద్వారా అవతరింపజేశాడు. “మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం). దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు;నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని; స్పష్టమైన అరబ్బీ భాషలో!” అల్ షుఅరా : 192 – 195

సూరా అలఖ్ లోని మొదటి ఐదు ఖురానులో అవతరించిన మొట్టమొదటి ఆయతులు : ఈ ఆయతులలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు! ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు. చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.ఆయన కలం ద్వారా నేర్పాడు. మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు. అలఖ్ : 1-5

ఆ తరువాత ఇరవై మూడు సంవత్సరాల పాటు మక్కా మరియు మదీనా నగరాలలో పలు సందర్భాలలో విడివిడిగా ఖురాను అవతరించినది, హదీసులు మరియు చారిత్రాత్మక సంఘటనల ద్వారా మనకు ఈ విషయం తెలుస్తోంది.

ఇబ్ను అబ్బాస్ (ర) వారి ఉల్లేఖనం : దైవగ్రంధమైన ఖురాను ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) నాడు ఈ ప్రపంచపు ఆకాశం పై ఒకేసారి అవతరించబడినది, ఆ తరువాత అక్కడ నుండి ఇరవై మూడు సంవత్సరాల పాటు అవతరించినది. (బైహఖీ - (2/ 415) )

దివ్యఖురాన్ యొక్క సూరాలు

ఖురానులో మొత్తం నూట పద్నాలుగు (114) ఆద్యాయాలు (సూరాలు) ఉన్నాయి, ఇందులో మొదటి సూరా ‘ఫాతిహా’ అయితే చివరి సూరా ‘అల్ నాస్.’

మక్కీ మరియు మదనీ సూరాలు

١
మదీనాకు వలసపోక మునుపు మక్కా నగరంలో అవతరించిన సూరాలను మక్కీ సూరాలు అంటారు, ఖురానులో మొత్తం 86 మక్కీ సూరాలు ఉన్నాయి.
٢
మదీనా నగరానికి వలస వెళ్ళిన తరువాత అవతరించిన సూరాలను మదనీ సూరాలు అంటారు, మొత్తం 28 మదనీ సూరాలున్నాయి.

ఖురాను యొక్క మొత్తం ముప్పై భాగాలు ఉన్నాయి, (చదవడానికి మరింత అనుకూలంగా ఉండడానికి) ప్రతి భాగాన్ని రెండు సగభాగాలుగా చేయబడినది (ఈ సగ భాగాలను అహ్’జాబ్ అంటారు).

ఖురానును లిఖించడం మరియు జమచేయడం.

ఖురానును మూడు దశలలో లిఖించడం మరియు జమచేయడం జరిగినది.

మొదటి దశ: ప్రవక్త (స) వారి కాలంలో

జ్ఞాపకశక్తి మెండుగా ఉండడం, తేలికగా కంఠస్థం చేయగలడం, అలాగే వ్రాసే సామర్ధ్యం మరియు సాధనాలు తక్కువగా ఉండడం కారణంగా లిఖించడం పై కన్నా కంఠస్థం పైనే ఆధారపడడం జరిగింది, ఈ కారణాలతో ఒక పుస్తక రూపంలో జమచేయబడలేదు, ఎవరైనా ఒక్క వాఖ్యాన్ని విన్నాసరే దానిని గుర్తుపెట్టేసుకునేవారు, ఎవరికైనా కుదిరితే ఖర్జూరపు మట్టలపైనో, చర్మంపైనో రాసుకునే వారు లేదా రాళ్ళ పలకలపై చెక్కేవారు, అప్పట్లో ఖురానును చదవగలిగేవారి సంఖ్య మాత్రం చాలా అధికంగా ఉండేది.

రెండవ దశ : అబూ బక్ర్ (ర) వారి హాయంలో

హిజ్రీ శకం 12 వ సంవత్సరంలో అల్ యమామా సంఘటనలో జరిగిన కుట్రలో పెద్దసంఖ్యలో ఖురాను హాఫిజులు చంపివేయబడ్డారు, ఈ సంఘటన తరువాత ఖలీఫా అబూ బక్ర్ (ర) వారు ఖురానును సేకరించవలసినదిగా ఆజ్ఞాపించారు.

జైద్ బిన్ సాబిత్ (ర) వారి ఉల్లేఖనం: “యమామా వాసుల మరణ వార్త అబూ బక్ర్ (ర) వారి వద్దకు చేరిన సమయంలో ఉమర్ (ర) వారు కూడా అక్కడే ఉన్నారు”. ఈ విషయంలో అబూ బక్ర్ (ర) వారు ఇలా సెలవిచ్చారు : నా వద్దకు ఉమర్ (ర) వచ్చి ఇలా అన్నారు : యమామా సంఘటన ఖురాను పాఠకులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది, మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతమయి ఖురాను హాఫిజులకు నష్టం వాటిల్లితే గనక ఖురానులోని కొన్ని భాగాలను కోల్పోయే అవకాశం ఉంది, కావున మీరు ఖురాను అంతటినీ ఒకచోట సేకరించాలని ఆదేశించడం మంచిదని భావిస్తున్నాను, అప్పుడు నేను ఉమర్ (ర) తో ఇలా అన్నాను: “ప్రవక్త (స) కూడా చేయని ఈ పనిని నేనెలా చేయగలను ?”, దానికి ఉమర్ (ర) ఇలా సమాధానమిచ్చారు : ఇలా చేయడంలోనే ప్రయోజనం దాగి ఉంది.“ “ఈ విషయాన్ని ఉమర్ (ర) వారు నా ముందు పదేపదే సమీక్షిస్తూనే ఉండేవారు,దానితో ఈ విషయం పట్ల అల్లాహ్ నా మనస్సును తెరిచాడు, దానితో ఈ విషయంలో నేను కూడా ఉమర్ తో ఏకీభవించాను”. +++

రెండవ దశ : ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) వారి హాయంలో

హిజ్రీ శకం 25 లో ఖలీఫా ఉస్మాన్ వారి హాయంలో కొందమంది సహాబీలు ఖురాను చదివేటపుడు కొన్ని వ్యత్యాసాలు గమనించడం జరిగింది, వారి వద్ద ఉన్న రాతప్రతుల్లో ఈ వ్యత్యాసాలు చోటుచేసుకొని ఉన్నాయి అనే విషయం తెలిసినపుడు అందరి వద్ద ఉన్న ప్రతులను సేకరించి వాటిని సరిదిద్దడం జరిగింది.

అనస్ బిన్ మాలిక్ (ర ) వారి ఉల్లేఖనం: హుజైఫా బిన్ అల్ యమాన్ వారు ఉస్మాన్ (ర) వారి వద్దకు వచ్చారు, ఆ సమయంలో ఉస్మాన్ (ర) వారు షామ్ (అఖండ సిరియా దేశం) మరియు ఇరాక్ వారితో కలసి అర్మేనియా మరియు అజర్’బైజాన్ లతో యుద్దంలో నిమగ్నమై ఉన్నారు, ఈ దరిమిలా హుజైఫా (ర) వారు (ఇరాక్ మరియు సిరియా) వారి ఖురాను పఠనంలో వ్యత్యాసాలను గమనించారు. ఈ విషయం పట్ల కలవర పడిన హుజైఫా వారు ఉస్మాన్ వారితో ఇలా సెలవిచ్చారు, ఓ విశ్వాసుల నాయకుడా (అమీరూల్ మూమినీన్) ఈ ఉమ్మతును కాపాడండి, యూదులు మరియు క్రైస్తవులు వారి గ్రంధాల విషయంలో ఎలాగైతే వారి మధ్య విభేదాలు తలెత్తాయో అలా ఈ ఉమ్మతులో విబేధాలు తలెత్తకముందే మీరు దీనిపై దృష్టి సారించండి. ఈ మాట విన్న ఉస్మాన్ (ర) వారు హఫ్సా (ర) వారికి లేఖ రాశారు “మీరు మీవద్ద ఉన్న ఖురాను అసలు ప్రతిని మాకు పంపండి, మేము వాటి నకళ్లను తయారు చేసి మరలా మీకు తిరిగి ఇచ్చివెస్తాము” హఫ్సా (ర) వారు ఆ అసలు ప్రతిని ఉస్మాన్ (ర) వారికి పంపారు. ఆ తరువాత జైద్ బిన్ సాబిత్, అబ్దుల్లా బిన్ జుబైర్, సయీద్ బిన్ అల్ ఆస్, మరియు అబ్దుల్ రహ్మాన్ బిన్ అల్ హారిస్ బిన్ హిషామ్ కు ఈ పని యొక్క బాధ్యత అప్పగించబడింది, వీరు ఆ అసలు ప్రతి యొక్క నకళ్ళను సిద్ధపరిచారు. (బుఖారీ)

.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి