ప్రస్తుత విభాగం : model
పాఠం ఖురాను గురించిన పరిశీలన మరియు దాని వివరణ
ఖురాన్ యొక్క తదబ్బుర్ మరియు వివరణ
.
ఆలోచించడం అనగా
ఖురాను నుండి ప్రయోజనం పొందే మరియు దానిపై అమలు చేసే నిమిత్తం దాని వాఖ్యాలను ఆగిఆగి వాటి అర్ధాన్ని పరిశీలనాత్మకంగా, ఆలోచితంగా చదువుతూ ముందుకు సాగాలి.
ఖురాను ఆయతుల గురించి క్షుణ్ణంగా ఆలోచించాలంటే ముందుగా వాటి అర్ధం తెలిసి ఉండాలి అప్పుడే సరైన విధంగా వాటి గురించి ఆలోచించగలము
ఖురాను వాఖ్యాల గురించి క్షుణ్ణంగా అల్సోచించడం అనేది తప్పనిసరి
ప్రతి విశ్వాసి ఖురాను యొక్క భావం పై లోతుగా ఆలోచించాలి, దాని అర్ధాని మరియు భావాన్ని అర్ధం చేసుకోవాలి మరియు మరియు దానితో పాటు జీవించాలి : అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : (ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. ప్రజలు దీని సూచనలను (ఆయాత్ లను) గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని. (సాద్ : 29) మరో చోట ఇలా సెలవిచ్చాడు : "వారు ఈ ఖుర్ఆన్ ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడి వున్నాయా?" (ముహమ్మద్ : 24)
తఫ్సీర్ : ఖురాను యొక్క అర్ధాన్ని వివరించడం
తఫ్సీర్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని అవసరం
.
దైవప్రవక్త (స) వారినుండి ఖురాను యొక్క అర్ధాని తెలుసుకోవడంలో సహాబాల యొక్క ఆశక్తి
.
ఖురాను యొక్క అర్ధాన్ని దాని వివరణను తెలుసుకోవడానికి ఈ క్రింది మార్గాలను అనుసరించడం జరుగుతుంది
మొదటిది : ఖురానును ఖురానుతో వివరించడం
ఎందుకంటే ఖురానును అల్లాహ్ అవతరింపజేశాడు మరియు వాటి ఉద్దేశాన్ని గురించి ఆయనకు మించి ఎవరు తెలిసి ఉండరు
ఉదాహరణకు తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : వినండి! నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రియులైన వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో! (యూనుస్ : 62,63) ఈ ఆయతులో అల్లాహ్ "ఔలియా అల్లాహ్" (అల్లాహ్ కు ప్రియులైన వారు) యొక్క అర్ధాన్ని ఇలా వివరించాడు : "ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో"!
రెండవది : ఖురాను యొక్క వివరణ సున్నతు ద్వారా
ఎందుకంటే దైవ ప్రవక్త (స) వారు అల్లాహ్ తరపున సందేసహరులు, ఆయన(స) అల్లాహ్ యొక్క ఉద్దేశాలను జనులకన్నా ఎక్కువగా తెలిసినవారు.
.
మూడవది : సహాబాల ద్వారా ఖురాను యొక్క వివరణ
.
.
నాలుగు : తాబాయీన్ల ద్వారా చేయబడిన వివరణ
.
ఖురాను యొక్క తఫ్సీర్ విషయంలో ప్రతి ముస్లిము యొక్క కర్తవ్యం
ఏదైనా ఖురాను ఆయతు యొక్క అర్ధం తెలియనపుడు వాటి వివరణ కోసం ఒకవిశ్వాసి తప్పనిసరిగా తఫ్సీర్ పుస్తకాలను చూడవలసి ఉంటుంది, వాటిలో కూడా ప్రత్యేకించి ప్రామాణికత కలిగిన ముఫస్సిరీన్ ల వివరణను చూడవలసి ఉంటుంది.
.
ఖురాన్ యొక్క తఫ్సీర్ లో అనేక పుస్తకాలు ఉన్నాయి, అయితే ఆమోదపరంగా అవన్నీ కూడా ఒకే స్థాయిలో లేవు, ఈ విషయంలో ఒక విశ్వాసి ప్రామాణికమైన వివరణల పై ఆధారపడడం అనేది తప్పనిసరి, దాని కారణము ఏమంటే వాటి రచయితలు తమ రచనల్లో విశ్వసనీయమైన తఫ్సీర్ నియమాలను అనుసరించి ఉన్నారు.