ప్రస్తుత విభాగం : model
పాఠం అంటు వ్యాధులకు సంబందించిన ఆదేశాలు
వ్యాధికి గురవక ముందే వ్యాక్సీన్ తీసుకునవచ్చును, ఈ విధంగా చేయడం అనేది అల్లాహ్ పై నమ్మకం ఉంచడానికి విరుద్ధము కాదు, దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : ఎవరైతే ప్రతి ఉదయం ఏడు అజ్వా ఖర్జూరాలను తింటారో ఆ రోజు అతని పై విషము కానీ చేతబడి కానీ పని చేయదు. (బుఖారీ 5445, ముస్లిం 2047). ఇది సమస్య అనేది రాకముందే దానిని అడ్డుకోవడం వంటిది.
ఆరోగ్యవంతులు అంటువ్యాధి కలిగిన వ్యాధిగ్రస్తుడితో దూరంగా ఉండాలని ధార్మిక నియమాలు సూచిస్తున్నాయి. ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు ; "వ్యాధిగ్రస్తుడు ఆరోగ్యవంతుడివద్దకు రాకూడదు" (బుఖారీ 5771, ముస్లిం 2221).
అందువల్ల, అతను అంటువ్యాధి ఉన్న రోగిని సందర్శించకుండా ఉంటాడు, కానీ అతని కుటుంబాన్ని సందర్శించవచ్చు, వారి పరిస్థితి గురించి అడగవచ్చు, వారి కోసం ప్రార్థించవచ్చు మరియు వారి మందులకు సహాయం చేయవచ్చు, తన డబ్బు, పలుకుబడి మరియు ఇతర సహకార మార్గాలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించే చర్యలు తీసుకుంటూ వీలైనంత సహాయాన్ని అందించవచ్చు.
ప్లేగు ఉన్న ప్రాంతములోకి ప్రవేశించడం లేదా దాని నుండి బయటకు రావడం అనేది నిషేధించబడింది. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు: “మీరు ఏ ప్రాంతములోనైనా దాని గురించి విన్నట్లయితే, దాని వైపు వెళ్లకండి. మీరున్న ప్రాంతములో అది సంభవిస్తే అక్కడనుండి పారిపోకండి." (బుఖారీ 5729, ముస్లిం 2219). మెజారిటీ పండితుల అభిప్రాయం ఇదే, అటువంటి అంటువ్యాధి వచ్చిన ప్రాంతానికి ప్రయాణించడం లేదా వ్యాధి ఉన్న చోటు నుండి బయటకు రావడం నిషేధించబడింది.
సామూహిక నమాజు అనేది పురుషులకు తప్పనిసరి, కానీ ధర్మబద్ద కారణం ఉన్నప్పుడు దాని నుండి మినహాయింపు ఉంటుందని పండితులు పేర్కొన్నారు. ఆయిషా (ర) వారి ఉల్లేఖనం. దైవప్రవక్త (స) వారు అనారోగ్యానికి గురైనప్పుడు, వారు తోటి ముస్లిములతో కలసి సామూహికంగా నమాజు చేయడం కష్టమైనపుడు, "అబూబకర్‌ను ప్రజలకు నమాజు చేయించమని చెప్పండి" అని సెలవిచ్చారు. (బుఖారీ 664, ముస్లిం 418). ఇది ఒక ముస్లిం అనారోగ్యం లేదా ఏదైనా స్పష్టమైన కారణం ఉన్నపుడు, ఒంటరిగా నమాజు చేయడం అనేది అనుమతించబడుతుందని సూచిస్తుంది.
.
.
.
.
.
.
.
.
.
.
.
.