ప్రస్తుత విభాగం : model
పాఠం పందెము మరియు జూదము
జూదము లేదా పందెము అంటే ఏమిటి ?
జూదము అనేది క్రీడాపోటీలలో, ఆటలలో ఇద్దరు పోటీదార్ల పై లేదా పై లేదా ఇద్దరు బెట్టింగ్ చేసేవాళ్లపై పందెం కట్టబడుతుంది, ఎవరైతే ఆ ఇద్దరిలో గెలుస్తాడో అతడు ఓడిపోయిన వానినుండి డబ్బును పొందుతాడు. ఇందులో పాల్గొనే ప్రతిఒక్కడూ ఇతరులనుండి డబ్బును పొందడమో లేదా తన డబ్బును ఇతరులకు కోల్పోవడమో జరుగుతుంది.
ఇస్లాంలో జూదము నిషేడించబడినది, ఖురాను మరియు ప్రవక్త (స) వారి బోధనలు దీనిని గట్టిగా వ్యతిరేకించాయి.
దైవం ఈ జూదమును మహా పాపములలో ఒకటిగా మరియు లాభం కన్నా నష్టమే చాలా ఎక్కువగా ఉన్నదని విశదపరచాడు, (ఓ ప్రవక్తా!) వారు, మధ్యపానాన్ని మరియు జూదాన్ని గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. నీవు ఈ విధంగా సమాధానమివ్వు: "ఈ రెంటింటిలోనూ ఎంతో హాని (పాపం) ఉంది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, కాని వాటి హాని (పాపం) వాటి లాభాల కంటే ఎంతో అధికమైనది."
తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి. (5-90)
వ్యక్తి మరియు సమాజంపై జూదం మరియు పందెం యొక్క హానికరమైన ప్రభావాలు:
గెలిచేవాడు నష్టపోయే వాని డబ్బును పొందడం వంటి ఇలాంటి ఆటలు చాలానే ఉన్నాయి, ప్యాకాట, బలూట్ వంటి ఇతర ఆటలు ఇదే తరహా పందెం కాసి ఆడేవి ఉన్నాయి. ఇందులో ప్రతిఒక్కడు తన డబ్బును వేస్తాడు, గెలిచిన ఒక్కడు అందరి డబ్బును తీసేసుకుంటాడు. ఒకొకసారి ఏ పందెములో డబ్బే కాకుండా వస్తువులు లేదా గౌరవం కూడా పణంగా పెట్టబడతాయి.
పందెం కాయడం అనేది ఒక జట్టు లేదా ఆటగాడి విజయంపై డబ్బు పెట్టే ఒక ప్రక్రియ. పందెం కాసే వాళ్ళు డబ్బు పెట్టి, తాము ఎంచుకున్న జట్టు లేదా ఆటగాడి గెలుపుపై పందెం వేస్తారు. ఎంచుకున్న జట్టు లేదా ఆటగాడు గెలిస్తే, పందెం గాడు డబ్బు గెలుస్తాడు, ఓడిపోతే డబ్బును కోల్పోతాడు.
3. లాటరీ టిక్కెట్లు మరియు స్క్రాచ్ కార్డులు : ఇవి లక్ (అదృష్టం) మీద ఆధారపడిన జూదం లాంటివి. ఒక డాలర్ లాంటి చిన్న ధరతో స్క్రాచ్ కార్డు లేదా లాటరీ టిక్కెట్ కొనుగోలు చేస్తారు. దాని ద్వారా దాని విలువకన్నా చాలా పెద్ద బహుమతి గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిలో చాలా అరుదుగానే గెలవడం జరుగుతుంది.
4. డబ్బు గెలవడం లేదా ఓడిపోవడం యొక్క అవకాశం ఉన్న ఫోన్ కాల్స్, మొబైల్ మెసేజ్‌ల ద్వారా జరిగే పోటీలలో పాల్గొనడం. అలాగే, ఆటగాడు డబ్బు గెలవడం లేదా ఓడిపోవడం యొక్క అవకాశం ఉన్న వెబ్‌సైట్‌ల ద్వారా జరిగే అన్ని రకాల ఎలక్ట్రానిక్ మరియు ఆన్‌లైన్ గేమ్‌లలో పాల్గొనడం.