నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం లీజు (అద్దె)

ఈ పాఠములో మనము లీజు యొక్క అర్ధం ఏమిటి మరియు ధార్మికంగా దాని నియమనిబంధనల గురించి తెలుసుకుందాము.

  • లీజు యొక్క నిర్వచనం మరియు ధార్మికంగా దాని గురించి ఉన్న నియమాలు మరియు దీనిని ధర్మబద్దం చేయడం యొక్క విజ్ఞత
  • లీజుకు సంబందించిన మూలాంశాలు మరియు దాని షరతుల గురించిన అవగాహన
  • కూలీ మరియు జీతాల గురించిన రకాలు.
  • లీజుకు సంబందించిన ఒప్పందం రద్దు అయ్యే సందర్భాల గురించిన అవగాహన.

బాడుగ(అద్దె) యొక్క అర్ధము

ఒక పని, లేదా స్పష్టంగా తెలిసిఉన్న ఒక వస్తువు లేదా ఆ వస్తువు గురించి నమ్మకంగా వివరించబడిన గుణం ఆధారంగా దాని నుండి ధర్మసమ్మతమైన ప్రయోజనం పొందడానికి ఒక నియమిత కాలానికి, నియమిత బదులును పొందే నిమిత్తం చేసుకునే ఉప్పందం.

బాడుగ విషయంలో ఇస్లాములో ఉన్న నియమాలు

బాడుగ అనేది అనుమతించదగినది, ఆమోదితమైనది మరియు ఇది పవిత్ర ఖురాన్, సున్నత్ మరియు పండితుల ఏకాభిప్రాయం ద్వారా నిరూపించబడింది. ఇది ఇరువైపులా జరిగే తప్పనిసరి ఒప్పందం, ఈ ఒప్పందములో దీనికి సూచించే అన్ని పదాలు ఉపయోగించబడతాయి. ఉదాహరణకు : నేను నీకు అద్దెకు ఇచ్చాను లేదా కిరాయికు ఇచ్చాను వంటి అందరికీ తెలిసిన, వాడుకలో ఉన్న పదాలను ఉపయోగించవలసి ఉంటుంది.

బాడుగ(అద్దె)కు ఇవ్వడం అనేది ధర్మబద్దమైనది అనేదానికి ఆధారాలు

తన దివ్య వచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "వారిద్దరిలో ఒకామె ఇలా అన్నది: "నాన్నా! ఇతనిని పని కొరకు పెట్టుకో. నిశ్చయంగా, ఇలాంటి బలవంతుని మరియు నిజాయితీపరుడిని పనిలో పెట్టుకోవటం ఎంతో మేలైనది.

ఆయెషా(ర) వారి ఉల్లేఖనం : దైవప్రవక్త (స) వారు మరియు అబూ బక్ర్ (ర) వారు బనీ అద్దీల్ అనే తెగ నుండి ఒక వ్యక్తిని వారి ప్రయాణము(హిజ్రత్)లో మార్గనిర్దేశకం చేసే నిమిత్తం పనికి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఖురేష్ తెగకు చెందిన అవిశ్వాస ధర్మం పై ఉన్నాడు. ఆ తరువాత మేము వారిద్దరి ఒంటెలను ఆ వ్యక్తికి అప్పగించాము. వారిద్దరూ అతనితో సౌర్ అనబడే గుహ వద్ద మూడు రోజుల తరువాత, కలవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడు రోజుల తరువాత ఉదయం ఆ వ్యక్తి వారి రెండు ఒంటెలను అక్కడకు తీసుకువచ్చాడు. (అల్-బుఖారీ - 2264)

బాడుగ అనేది ధర్మబద్దం చేయబడడంలోని వివేచనము

బాడుగకు తీసుకోవడం అనేది ప్రజలకు వారి జీవనోపాధిలో ఎంతో తోడ్పడే విషయం, ఎల్లప్పుడూ జనాలకు మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులు, నివశించడానికి ఇళ్ళు, వ్యాపారం చేసుకోవడానికి దుకాణాలు, జంతువులు, వాహనాలు, పనిముట్లు వంటివి ఎన్నో అవసరాలు వస్తుంటాయి, అయితే చాలా మందికి వీటిని కొనుగోలు చేసే శక్తి ఉండదు. కాబట్టి బాడుగకు లేదా లీజుకు తీసుకోవడం వంటి అనుమతి ఉండడం అనేది ప్రజల అవసరాలను తేలికగా తీరుస్తుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఇరుపక్షాలు ధనము మరియు సేవ ద్వారా లబ్ది పొందుతారు.

అద్దెకు ఇవ్వడం లోని రకాలు

١
అద్దె అంశం అనేది ఒక స్పష్టంగా తెలిసిన వస్తువు పై ఉండాలి. ఉదాహరణకు నివాసం, దుకాణం వగైరా
٢
స్పష్టంగా తెలిసిఉన్న పని పై ఉండాలి. ఉదాహరణకు ఇళ్ళు కట్టుకోవడానికి లేదా భూమిని దున్నదానికి ఒక వ్యక్తిని పనికి మాట్లాడుకోవడం వగైరా.

బాడుగ యొక్క రకాలు

١
వ్యక్తిగత పనివాడు
٢
ఉమ్మడి పనివాడు

సొంత పనివాడు

పనిచేయడానికి ఒక వ్యక్తిని నియమిత కాలానికి పనికోసం మాట్లాడుకుని నియమించుకున్న వ్యక్తి. ఈ నియామకం తరువాత ఆ వ్యక్తికి ఇతరుల వద్ద పని చేసే అనుమతి ఉండదు, ఒకవేళ అతడు వేరే చోట పనిచేస్తే గనక అతను వెచ్చించిన సమయం మరియు పనిని బట్టిని అతనికి ఇచ్చే జీతం కుదించబడుతుంది, అలాకాకుండా అతడు ఎక్కడికీ వెళ్లకుండా మాట్లాడుకున్న చోటనే పూర్తిగా పనిచేస్తే గనక అతడు పూర్తి బదులుకు అర్హుడవుతాడు, నియమిత సమయానికి పనికి మాట్లాడుకున్న వ్యక్తి ఒకవేళ అర్ధాంతరంగా పనిని రద్దు చేసుకుంటే గనక కూలీగా చేస్తున్న వ్యక్తి యొక్క పూర్తి జీతం చెల్లించవలసి ఉంటుంది, పనిలో ఉన్న వ్యక్తి ఒకవేళ అనారోగ్యం లేదా ఇతర కారణం చేత పని చేయలేకపోతే అతడు చేసినంత పనికి మాత్రమే అతడు జీతం చెల్లించబడతాడు.

ఉమ్మడి పనివాడు

ఈ వ్యక్తి నుండి ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయోజనాలు పంచుకుంటారు, ఉదాహరణకు కమ్మరి, ప్లంబర్, అద్దకం చేసేవాడు, బట్టలు కుట్టేవాడు వగైరా. అతను తన కోసం ఇతరుల నుండి పనిని స్వీకరించి చేస్తూ ఉంటాడు, అయితే ఈ వ్యక్తి పనికి మాట్లాడుకున్న వ్యక్తి లాంటి వాడు కాదు, నాకు తప్ప ఇతరులకు పని చేయకూడదు అని అతనికి చెప్పే హక్కు మనకు ఉండదు, పనిని బట్టే ఈ వ్యక్తికి పైకం చెల్లించవలసి ఉంటుంది.

బాడుగ సంబందించిన ఒప్పందంలోని కీలక అంశాలు

١
ఒప్పందం లోని ఇరుపక్షాలు
٢
ఒప్పందములో వ్రాయబడే అంశాలు
٣
ప్రయోజనం
٤
జీతం

ఇరుపక్షాలు

ఇరుపక్షాలు అనగా ఆ ఒప్పందములో భాగమై ఉన్నవారు(బాడుగకు ఇచ్చేవాడు మరియు తీసుకునేవాడు). వీరిరువురిలో ఒకరికి ప్రతిపాదించే హక్కు మరొకరికి దానిని అంగీకరించే హక్కు ఉంటుంది.

ఒప్పందములోని వాఖ్యాలు

ప్రతిపాదన మరియు అంగీకారం ఆధారంగా పూర్తి చేయబడే ఒప్పందము యొక్క ప్రక్రియను పూర్తిచేయడానికి చట్టబద్ద లేదా ఆ సమాజములో సాంప్రదాయకంగా ఉండే వాక్యాల ఎంపికతో ఒప్పందానికి ఒక రూపమివ్వడం.

ప్రయోజనం

బాడుగకు సంబందించి ఒప్పందములో ఉండే ముఖ్యమైన అంశం ఇది : ఈ ప్రయోజనం అనేది ఒక మనిషి ద్వారా అయినా లేదా జంతువుద్వారా అయినా లేదా ఒక వస్తువు ద్వారా అయినా సరే.

కిరాయి - బాడుగ

ఇది ఒక వస్తువు లేదా మనిషి ద్వారా పొందిన ప్రయోజనానికి బదులుగా చేసే చెల్లింపు, ఇది ఒప్పందములో నిర్ణయించబడిన ధరకు బదులుగా ఇవ్వబడుతుంది.

లీజు చెల్లుబాటు అవడానికి షరతులు

١
ఒప్పందం కోరుకునే ఇరుపక్షాలకు ఆ పని చేయగలిగే యోగ్యత అనేది కూడాఉండాలి, వారు బుద్ధి కుశలత కలిగి ఉండాలి, బుద్ధి హీనత ఉండకూడదు, వివేచన కలిగి ఉండాలి. అలాగే మైనర్లు, విచక్షణ లేనివారు, మతిస్థిమితం లేని వారు అయి ఉండకూడదు, వారు ఈ ఒప్పందాన్ని తప్పనిసరిగా నిర్వహించగలిగే మరియు దానికి కట్టుబడి ఉండే సమర్ధతను కలిగి ఉండాలి, ఇటువంటి గుణాలు లేనపుడు ఈ ఒప్పందం అనేది చెల్లదు.
٢
పొందబోయే ప్రయోజనం గురించి తెలిసి ఉండాలి, ఉదాహరణకు ఇంట్లో నివాసముందడం లేదా ఒక వ్యక్తి నుండి సేవ పొందడం వగైరా.
٣
బాడుగ గురించి తెలిసి ఉండడం
٤
పొందబోయే ప్రయోజనం అనేది ధార్మికంగా అనుమతించబడినది అయి ఉండాలి. పాటలు, మ్యూజిక్ వంటి వాటికి అద్దెకు ఇవ్వడం లేదా బహుదైవారాధనకు సంబందించిన నిర్మాణం కోసం అద్దెకు ఇవ్వడం లేదా మధ్యం అమ్మకానికి తమ దుకాణాన్ని అద్దెకు ఇవ్వడం వగైరా. ఇలాంటివన్నీ నిషిద్దమైనవి.
٥
అద్దెకు తీసుకునే ఆస్తి లేదా ఆ వస్తువు గురించి తెలిసి ఉండాలి, దాని విశిష్ఠతల గురించి దానిని చూడడం ద్వారా లేదా తెలుసుకోవడం ద్వారా తెలుసుకుని ఉండాలి, ఆ వస్తువు యొక్క ప్రయోజనం పై ఒప్పందం ఉండాలి కానీ స్వతహాగా ఆ వస్తువు లేదా దాని భాగాల మీద కాదు, మరియు అది లీజుకు తీసుకునే వ్యక్తి యొక్క ఆధీనతకు అప్పజెప్పే స్థితిలో ఉండాలి, పొందబోయే ప్రయోజనం అనుమతించబడి ఉండాలి, బాడుగకు తీసుకునే వ్యక్తికి దానిపై లేదా దానిలో అనుమతింపబడిన వాటిపై అధికారం ఉంటుంది.
٦
ఈ లీజు అనేది ఇరుపక్షాల సమ్మతితో ఉండాలి
٧
ఇరుపక్షాల మధ్య దీని గురించి ప్రతిపాదన మరియు స్వీకరణ అనేది జరగాలి
٨
ఈ లీజు అనేది ఎంత సమయానికి అనేది తెలిసి ఉండాలి. ఉదాహరణము ఒక నెల లేదా ఆరు నెలలు వగైరా
٩
లీజుకు తీసుకున్న ఆ వస్తువు నిరుపయోగంగా మార్చగలిగే ప్రమాదాలనుండి భద్రంగా ఉండాలి.

బాడుగ చెల్లించే సమయం

ఒప్పందం ప్రకారం అద్దె చెల్లించాలి, అద్దె సమయం ఆసన్నమయినపుడు అద్దెను చెల్లించడం అనేది తప్పనిసరి

అద్దెను ముందుగానే చెల్లించడం లేదా ఆలస్యంగా చెల్లించడం లేదా వాయిదా పద్ధతిలో చెల్లించడం గురించి వారి మధ్య పరస్పర అంగీకారం ఉంటే అలానే చేయవచ్చు, పనిలో కుదుర్చుకున్న వ్యక్తి పనిని సంపూర్తిగా ముగిస్తే అతడు తన వేతనహక్కుకు అర్హుడయిపోతాడు.

బాడుగకు తీసుకున్న వస్తువు లేదా ఆస్తి నుండి ప్రయోజనం పొందిన తరువాత దాని చెల్లింపుకు హక్కు కలుగుతుంది. అబూ హురైరా (ర) వారి ఉల్లేఖనం. దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : పునరుర్ధాన దినమున నేను ముగ్గురికి ప్రత్యర్ధిగా ఉంటాను. నా మీద ప్రమాణం చేసి మోసం చేసిన వ్యక్తి , స్వతంత్రుడైన ఒక వ్యక్తిని బానిసగా విక్రయించేసి సొమ్మును తినేసినవ్యక్తి మరియు ఒక మనిషిని పనిలోకి మాట్లాడుకుని అతని ద్వారా పూర్తిగా పని చేయించుకుని తరువాత అతడికి అతని బదులు చెల్లించని వ్యక్తి. (బుఖారీ 2227)

ఒప్పందం రద్దు అయ్యే సందర్భాలు

١
బాడుగకు మాట్లాడుకున్న నియమిత వస్తువు ధ్వంసం అవడం, ఉదాహరణకు ఇల్లు లేదా వాహనం వగైరా.
٢
లీజు వ్యవధి ముగియడం
٣
తొలగింపు, ఇరుపక్షాలలో ఒకరు ఈ ఒప్పందము నుండి తనను తొలగించమని కోరినపుడు అతనిని తొలగించడం.
٤
అద్దెదారు కాకుండా మరొకరి ద్వారా అద్దెకు తీసుకున్న ఆస్తిలో లోపం సంభవించడం. ఉదాహరణకు ఇంటిని కూల్చివేయడం, యంత్రం పాడైపోవడం, వగైరా.

ఇరుపక్షాలలో ఒకరు మరణించడం కారణంగా లేదా అద్దెకు ఇచ్చిన వ్యక్తి ఆ ఆస్తిని అమ్మేయడం కారణంగా లీజు ఒప్పందం అనేది రద్దు అవ్వదు, అయితే ఎవరైనా తన సొంత పనికోసం అద్దెకు తీసుకొని ఉండి ఆ సమయంలో అతడు చనిపోతే ఆ ఒప్పందం అనేది రద్దు అయిపోతుంది. లీజు వ్యవధి ముగిసిపోతే ఆ వెంటనే ఆ వస్తువును యజమానికి అప్పగించవలసి ఉంటుంది, ఆ వస్తువు తరలించదగినదైతే దానిని యజమానికి అప్పగించాలి.

బాడుగకు ఇవ్వడం మరియు అమ్మకం మధ్య తేడాలలో కొన్ని

١
అద్దె అంశంలో ఒక దాని నుండి ప్రయోజనం పొందే విషయంలో చెల్లింపు అనేది మొత్తంగా ఒకేసారి ఉండదు, అమ్మకం విషయంలో విక్రయించిన వస్తువు యొక్క మొత్తం ఒకేసారి చెల్లించబడుతుంది.
٢
అద్దెకు అనుమతించబడిన ప్రతిదీ విక్రయించబడదు, ఒక స్వతంత్ర వ్యక్తిని జీతానికి పనిలో పెట్టుకోవచ్చు అయితే బాడుగ అనేది అతని పనిపై ఉంటుంది కానీ ఆ వ్యక్తి పై కాదు, అతనికి అమ్మడం అనేది జరగదు, ఎందుకంటే అతను ఒక అమ్మడగే వస్తువు కాదు.
٣
బాడుగ అనేది ఒకరకమైన అమ్మకమే అయినా ఇందులో ఒక వస్తువు యొక్క ప్రయోజనాన్ని అమ్మడం జరుగుతుంది కానీ స్వయంగా ఆ వస్తువు మాత్రం కాదు.
٤
భవిష్యత్తులో ఈ బాడుగ అంశంలో ముగియడం, అదనంగా చేర్చడం జరుగుతుంది. అయితే అమ్మకంలో ఒక్కసారే అంతా పూర్తి చేయవలసి ఉంటుంది.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి