ప్రస్తుత విభాగం : model
పాఠం ఆరియా : ఎటువంటి బదులు లేకుండా ఏదైనా వస్తువును వినియోగించుకుని తిరిగి ఇచ్చేయడం (ఎరువు తెచ్చుకోవడం)
ఆరియా అంటే అర్ధం
ప్రయోజనం పొందే నిమిత్తం ఏదైనా వస్తువును ఎటువంటి బదులు లేకుండా అరువుకు తీసుకోవడానిని అరబీ భాషలో ఆరియా అంటారు.
ఆరియాకు సంబందించిన ధార్మిక నియమాలు
బదులు లేకుండా ఏదైనా వస్తువును అరువుకు ఇవ్వడం అనేది సదాచారణ మరియు దైవభీతికి సంబందించిన విషయం, ఇది ఖురాను, హదీసు మరియు ధర్మపండితుల ఏకాభిప్రాయములో అనుమతించబడిన అంశం కూడా, ఈ విషయంలో ఒప్పందం కూడా చేసుకోవచ్చు, అయితే ఇది తప్పనిసరి అంశానికి చెందిన విషయం కాదు, దీనిలో ఇరుపక్షాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చును, ఈ ఆరియా అనేది హర్షణీయమైన అంశము, ఎందుకంటే ఇది ఒకరి పట్ల ఉపకారము, ఉదారత కనబరిచే, ఒకరి అవసరాన్ని తీర్చే మరియు ప్రేమానురాగాలు పెంచే విషయము. యజమానికి దాని అవసరారం లేనపుడు మరియు అది ఇతరులకు అవసరమైనపుడు ఒక అంగీకారానికి లేదా ఒప్పందానికి సూచించే ఏదైనా మాట లేదా పదం యొక్క వ్యక్తీకరణతో దీనిని పూర్తి చేయవచ్చును.
ఆరియాను ధర్మబద్దం చేయడంలోని వివేచనం
జీవితంలో మనిషి ఎల్లప్పుడూ వస్తువులు లేదా ఇతర వాటి అవసరం కలిగి ఉంటాడు, చాలా సందర్భాలలో వాటిని కొనుగోలు చేసే శక్తి కలిగి ఉండడు, అలాగే బాడుగకు కూడా తీసుకునే స్తోమత లేకపోవచ్చు, ఒకరికి అవసరమున్న వస్తువును బహుమతిగా, ఉచితంగా ఇచ్చే విశాల హృదయం కూడా సమాజంలో కొంత మందికి ఉండకపోవచ్చు, తన దగ్గర ఉన్న వస్తువును కాలపరిమితి లేకుండా వినియోగించుకుని మరలా తిరిగి ఇచ్చే అంగీకారంతో ఇవ్వడానికి ఒప్పుకునే అవకాశం ఉంటుంది, ఇటువంటి సందర్భములో ఆరియా అనేది ఈ అవసరాన్ని తీరుస్తుంది.
ఆరియాను అనుమతించడం అనేది అల్లాహ్ యొక్క కరుణాలో భాగము, దీని వలన అరువు ఇచ్చే దాతకు పుణ్యాలు మరియు ఈ అరువు గ్రహీతకు తన అవసరం తీరుతుంది, దీనిలో వస్తువును ఇచ్చేవాని వస్తువు మిగిలి ఉండడంతోపాటు అతని తోటి సోదరుని అవసరం కూడా తీరుతుంది.
తన దివ్య వచనంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి" [అల్-మాయిదా: 2].
అనస్ బిన్ మాలిక్ (ర) వారి ఉల్లేఖనం : మదీనా పట్టణంలో (ఒక పెద్ద శబ్దం కారణంగా) భయాందోళనలు నెలకున్నాయి, దానితో దైవ ప్రవక్త (స) వారు అబూ తల్హా వారి నుండి గుర్రాన్ని అరువుగా తీసుకున్నారు, ఆ గుర్రానికి ‘అల్ మన్ దూబ్’ అనే పేరు ఉండేది. ప్రవక్త(స) వారు ఆ గుర్రం పై స్వారీ అయి(ఏమి జరిగిందో తెలుసుకోవడానికి) వెళ్లారు. తిరిగివచ్చిన తరువాత ఇలా సెలవిచ్చారు : మేము ఏమీ కనుగొనలేకపోయాము, ఈ గుర్రం మాత్రం సముద్రపు ప్రవాహం వలే (వేగంగా) ఉన్నది. (అల్-బుఖారీ 2627, ముస్లిం 2307).
ఆరియా అనేది సక్రమంగా జరగడానికి ఉన్న ధార్మిక షరతులు
ఆరియాలోని కాలకాంశాలు
అరువుగా తీసుకున్న దానిని భద్రంగా చూసుకోవడం, సరైన విధానంలో దానిని వినియోగించడం మరియు వినియోగం తరువాత మంచి స్థితిలో దానిని యజమానికి తిరిగి ఇవ్వడం అనేది తప్పనిసరి. అరువుగా తీసుకున్న తరువాత దానిని వినియోగించక ముందే అది పాడైపోతే, నాశనమైపోతే దానికి అరువుగా తీసుకున్న వ్యక్తే బాధ్యత వహించవలసి ఉంటుంది, ఇది అతని నిర్లక్ష్యం వల్ల జరిగినా, నిర్లక్ష్యం లేకుండా జరిగినా అతడే దానికి బాధ్యత వహించాలి, ఒకవేళ దానిని ఏ విధంగా వినియోగించడానికి అనుమతించబడినదో ఆ విధంగానే సక్రమంగా వినియోగించే క్రమంలో చెడిపోతే గనక దానికి అరువు తీసుకున్న వ్యక్తి బాధ్యత వహించడు. ఉపయోగించే క్రమంలో దానిని దుర్వినియోగం చేస్తే తప్ప. ఒక వేల దుర్వినియోగం చేస్తే గనక దానికి అతడే బాధ్యుడు.
పని అయిన తరువాత వినియోగించుకున్న వస్తువును తిరిగి అప్పజెప్పేయడం అనేది తప్పనిసరి, దానిని తీసుకునే సమయంలో ఏ స్థితిలో ఉన్నదో అదే స్థితిలో తిరిగి అప్పగించాలి, పని తరువాత కూడా దానిని అలానే అట్టిపెట్టుకోవడం లేదా ఇవ్వడానికి తిరస్కరించడం వంటిది చేస్తే గనక అతడు అపరాధి, ద్రోహి అనబడతాడు.
అరువుగా ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి నష్టం లేని యడల అరువుగా తీసుకున్న వ్యక్తి తను కోరుకున్నపుడు దానిని అప్పగించవచ్చు, దానిని అప్పగించడం అనేది అరువుగా తీసుకున్న వ్యక్తికి నష్టం కలిగించే విషయం అయితే దానిని నష్టానివారణ వ్యవధి వరకు వాయిదా వేయవచ్చును, ఉదాహరణకు ఒకరి నుండి భూమిని అరువుగా తీసుకుని దానిలో పంట వేసిఉన్న స్థితిలో ఇవ్వడం అనేది నష్టం కలిగించే విషయం అవుతుంది, కాబట్టి పంటను కోసుకున్న తరువాత భూమిని అప్పగించవచ్చును.
తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : అమానాత్ లను (అప్పగింతలను) తప్పక వాటికి చెందిన వారికి అప్పగించండనీ మరియు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండనీ, అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంత ఉత్తమమైన హితబోధ చేస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. [అన్-నిసా: 58].