ప్రస్తుత విభాగం : model
పాఠం ఇస్లాంలో కుటుంబం యొక్క స్థానం
ఒక జాతి అనేది మూలం(వంశం), భాష, చరిత్ర మరియు వీటన్నింటికంటే ముఖ్యంగా ధర్మం వంటి ఉమ్మడి అంశాల ద్వారా ఏకతాటిపైకి వచ్చిన వ్యక్తుల సమూహంతో ఏర్పడుతుంది. ఈ వ్యక్తులు వైవాహిక బంధం ద్వారా ఏర్పడిన ఇళ్ల నుండి, అంటే భార్యాభర్తల నుండి ఉద్భవించారు. వీరు తిరిగి కొత్త కుటుంబాలను నిర్మిస్తారు, ఆ కుటుంబాల నుండి కుమారులు మరియు కుమార్తెలు జన్మించి ఈ జీవన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ విధంగానే ఒక జాతి తన ఉనికిని కాపాడుకుంటూ నిరంతరం కొనసాగుతుంది.
ఉత్తమమైన వైవాహిక జీవితమే ఒక జాతి మనుగడకు పునాది. అందుకే, ఈ పునాది అయిన కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అనివార్యం.
మానవుడు సహజంగానే ఒక సామాజిక జీవి. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు ఉన్న సమాజంలో జీవించినప్పుడే అతడు ప్రశాంతతను పొందుతాడు. అయినప్పటికీ, తనలోని కొన్ని ప్రత్యేక భావాలను మరియు అనురాగాలను కేవలం పరిమిత సంఖ్యలో ఉన్న వ్యక్తుల కోసం మాత్రమే కేటాయించవలసి ఉంటుంది, వారే కుటుంబ సభ్యులు. ఇస్లాం పరిభాషలో కుటుంబం అంటే - ఇస్లామీయ వివాహ బంధం ద్వారా ఒక్కటైన పురుషుడు మరియు స్త్రీ, అలాగే వారి ద్వారా కలిగే సంతానంతో కూడిన ఒక సామాజిక విభాగం.
మానవుడిని వివాహం వైపుకు ప్రోత్సహించడం మొదలుకొని, పిల్లల హక్కులను కాపాడటం మరియు ఒకే కుటుంబంలోని సభ్యులందరి మధ్య సంబంధాలను క్రమబద్ధీకరించడం వరకు ఇస్లాం ఈ వ్యవస్థ బాధ్యతను చేపట్టింది. ఈ కుటుంబ నిర్మాణం అనేది అల్లాహ్ కోరుకున్న విధంగా మానవత్వానికి ఒక ఉజ్వల రూపం.
ఇస్లాంలో కుటుంబం యొక్క స్థానం
అల్లాహ్ పురుషుడు మరియు స్త్రీలలో ఒకరి పట్ల మరొకరికి సహజమైన ఆకర్షణను కలిగించాడు. ఈ ఆకర్షణను సంతృప్తి పరచడానికి మరియు మానవ సంతానోత్పత్తి ద్వారా మానవ జాతిని కాపాడటానికి వివాహాన్ని ఒక ధర్మబద్ధమైన మార్గంగా నిర్ణయించాడు. ఇస్లాం తన దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త(స) వారి సున్నత్ ద్వారా వివాహం చేసుకోవాలని ఎంతో ప్రోత్సహించింది.
ఇస్లామీయ కుటుంబ నిర్మాణం రెండు ప్రధాన మూలస్తంభాలపై ఆధారపడి ఉంటుంది.
మానసిక తోడ్పాటు
అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: (మరియు ఆయన సూచనలలో; మీ కోసం మీ నుండే జతలను సృష్టించాడు, తద్వారా మీరు వారి వద్ద ప్రశాంతతను పొందాలని. మరియు ఆయన మీ మధ్య ప్రేమానురాగాలను, కారుణ్యాన్ని కలిగించాడు. నిశ్చయంగా ఆలోచించే వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి) (రూమ్: 21). దీనిలో పేర్కొన్న విధంగా మానసిక ప్రశాంతత, ప్రేమానురాగాలు మరియు కారుణ్యం ఇందులో కలిసి ఉంటాయి.
భౌతిక తోడ్బాటు
వివాహ ఒప్పంద నిబంధనలను పూర్తి చేయడం మరియు భార్యాభర్తలిద్దరూ తమ బాధ్యతలకు కట్టుబడి ఉండటంలో ఇది వ్యక్తమవుతుంది; అంటే ఖర్చుల నిర్వహణ, సంరక్షణ, ఇంటి వ్యవహారాలను చక్కదిద్దడం మరియు పిల్లల శ్రేయస్సును చూసుకోవడం వంటివి ఇందులో భాగం.
ఇస్లాం ధర్మం భార్యాభర్తలిద్దరినీ ఈ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని మరియు దాని పట్ల శ్రద్ధ వహించాలని ప్రోత్సహిస్తుంది; తద్వారా ఆ నీడలో నివసించే కుటుంబ సభ్యులు విడిపోయి చెల్లాచెదురు కాకుండా ఉంటారు. ఇందుకోసమే ఇస్లాం సహనం వహించాలని మరియు ఇరువురి మధ్య అనురాగం తగ్గినా వైవాహిక బంధాన్ని కొనసాగించాలని హితవు పలుకుతుంది. అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: “మరియు మీరు వారితో ఉత్తమరీతిలో కాపురం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే! బహుశా ఏదో ఒక విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు, కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన సుభాన్ని పొందుపరచాడేమో!” (నిసా :19).
اختر مستوى الشرح المناسب لك
يحتوي الدرس الآن على طبقات اختيارية تساعدك على المراجعة السريعة أو التعمق دون مغادرة الدرس.
- الملخص: نظرة سريعة في نحو دقيقة.
- الأساسي: محتوى الدرس الأصلي وهو المسار المعتمد للتقدم.
- المتعمق: تفاصيل إضافية اختيارية عند توفرها.
تقدمك وإكمال الدرس يعتمدان دائما على صفحات المستوى الأساسي.