ప్రస్తుత విభాగం : model
పాఠం జకాతు : దాని వాస్తవికత మరియు దాని ఉద్దేశాలు
జకాత్ ఇస్లాం యొక్క మూడవ మూల స్తంబము. బీదలకు, దీనులకు జకాత్ చెల్లించడం అనేది ధనికులపై అల్లాహ్ విధిగావించాడు, జకాతు ఇచ్చే వారు మరియు తీసుకునే వారు ఇరువురినీ శుద్ధి పరచడానికి అల్లాహ్ జకాతును విధిగావించాడు, దీని వలన ధనంలో తగ్గుదల కనిపించినప్పటికీ దీని కారణంగా అల్లాహ్ ఆ ధనములో మరియు శుభాలలో పెరుగుదలను నోసంగుతాడు. అలాగే ఇది విశ్వాసములో కూడా వృద్ధికి దోహదం చేస్తుంది.
1. ధనాన్ని ప్రేమించడం మరియు దాని పట్ల వ్యామోహం కలిగి ఉండడం అనేది మనిషి యొక్క నైజము, మనస్సులను పిసినారితనం వంటి వాటి నుండి శుభ్రపరచడానికి, ప్రాపంచిక వ్యామోహాన్ని తగ్గించడానికి మరియు ఇతర ప్రయోజనాల నిమిత్తం ఇస్లాం జకాత్ ను ధర్మబద్ధం చేసినది, దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు ; (కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. (التوبة: 103).
2. జాకాతును చెల్లించడం ద్వారా పరస్పరం ప్రేమానురాగాలు పెరగడంతో పాటు బంధాలు, బంధుత్వాలు బలపడతాయి, ఒకరు తమ పట్ల మంచిని చేయడం కారణంగా అతడిని ప్రేమించడం అనే నైజం పై మనిషి పుట్టించబడ్డాడు, దీని కారణంగా విశ్వాసులైన ముస్లిం సమాజము ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఐకమత్యంగా, పటిష్ఠంగా ఉంది ఒకరినొకరు సహకరించుకునే విధంగా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది. ఈ జకాతు చెల్లింపుల కారణంగా దొంగతనాలు, లూటీలు మరియు దోపిడీ సంఘటనలు కూడా తగ్గుముఖం పడతాయి.
3. జకాతు అనేది దాస్యము, పరిపూర్ణ సమర్పణ, మరియు సర్వ సృష్టికి ప్రభువైన అల్లాహ్ కు పూర్తిగా సమర్పించుకోవడాన్ని నిరూపిస్తుంది, ఒక ధనికుడు జకాతు తీయడం ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ఆచరించినవాడు, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాఠించినవాడు అవుతాడు, అలాగే దీని ద్వారా అతడు అల్లాహ్ అతనికి ఇచ్చిన ఈ అనుగ్రహం పట్ల కృతజ్ఞతలు తెలులుపుకున్నవాడవుతాడు, ఈ కృతజ్ఞత పట్ల అల్లాహ్ మాత్రమే తనకు తోచిన ప్రతిఫలాన్ని అతనికి నోసంగుతాడు. తన గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు ; "మీరు కృతజ్ఞులైతే! నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. (ఇబ్రహీం: 7).
4. జకాతును చెల్లించడం ద్వారా సామాజిక భద్రతా భావన ఏర్పడుతుంది, సంఘంలోని పలు సమూహాల మధ్య బంధాలు బలపడతాయి, అవసరమైనవారికి జకాతును పంచడం కారణంగా ధనం అనేది సమాజంలోని కేవలం కొంతమంది ధనవంతుల దగ్గరే పొగుపడి గుత్తాధిపత్యానికి దారితీయకుండా కాపాడుతుంది, దీని గురించి అల్లాహ్ ఎలా సెలల్విస్తున్నాడు : "అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగకుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. (అల్-హష్ర్: 7).
జకాతు యొక్క ధనం అనేది ఎవరెవరికి చెల్లించాలి అనే విషయం నిర్దేశించినది, జకాతు చెల్లించే ముస్లిములు నిర్దేశించబడిన వర్గాలలో ఒక వర్గాన్ని లేదా ఎక్కువవాటిని ఎంచుకుని చెల్లించవచ్చును, లేదా వాటిని ముస్లింలలో అర్హులైన వారికి పంపిణీ చేసే స్వచ్ఛంద సంస్థలు మరియు ధాతృత్వ సంస్థలకు ఇవ్వడం అనుమతించబడుతుంది. అయితే ఉత్తమం ఏమంటే ఆ జాకాతును చెల్లిస్తున్న వ్యక్తి యొక్క దేశంలోనే దాని పంపిణీ జరగడం ఉత్తమం.