ప్రస్తుత విభాగం : model
పాఠం విరాళం
సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ మిక్కిలి ఔదార్యము, దాదృత్వము కలిగిన వాడు, మరియు దైవ ప్రవక్త(స) వారు జనులలో కెల్లా ఉత్తమమైన ధాతృత్వము కలిగిన వ్యక్తి, వారు బహుమానాలను స్వీకరించి దానికి బదులుగా ప్రతిబహుమానాలు ఇచ్చేవారు, పరస్పరం బహుమానాలు ఇస్తూ ఉండాలి అని పిలుపునిచ్చేవారు, ప్రోత్సహించేవారు. ఒకరికి ఇవ్వడం అనేది ప్రవక్త(స)వారికి అత్యంత ప్రియమైన అంశంగా ఉండేది.
ఎటువంటి బదులు లేకుండా ఒక వస్తువు లేదా ఆస్తి వంటి వాటికి తక్షణమే యజమాని అవడం
ఈ విషయంలో ‘యాజమాన్యత’ అనగా విరాళానికి సంబందించిన ఒప్పందం అనేది యాజమాన్య ఒప్పందాల కోవకు చెందుతుంది.
కానుక అనేది కేవలం ఒక వస్తువుకే కాకుండా సాధారణంగా ఒక ఆస్తికి కూడా వర్తిస్తుంది.
“ఒక వస్తువుకు యజమాని అవడం” అనే నిర్వచనం “ప్రయోజనాలను విరాళంగా ఇవ్వడం” అనేదానికి వర్తించదు, ఈ నిర్వచనం దాని నుండి వేరు చేయబడినది, ఇలా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి.
.
విరాళం అనేది బహుమతి, కానుక, నజరాన లాంటిదే. ఇవి ఒకరి పట్ల ఉపకారము, ధర్మగుణము మరియు దయ చూపడం వంటి కోవకు చెందుతాయి.
విరాళము గురించిన నియమాలు
కానుక అనేది హర్షణీయమైన విషయం; ఇది బంధాలను, హృదయాలను దగ్గర చేస్తుంది, పుణ్యఫలాలు పొందడానికి కారణం అవుతుంది, ప్రేమానురాగాలను నింపుతుంది. దైవగ్రంధము, ప్రవక్త(స) వారి హదీసులు మరియు ధర్మపండితులు అందరి ద్వారా ఇది ఒక హర్షణీయమైన విషయం అని తెలుపబడినది.
ఇస్లాం పరస్పరం బహుమానాలు, విరాళాలను ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ఇది పిసినారితనం, దురాశ, లోభము వంటి రుగ్మతలనుండి మనస్సును శుద్ధి పరచడానికి, హృదయాలను ఏకం చేయడానికి, జనులలో ప్రేమను నాటడానికి దోహదం చేస్తుంది. ప్రత్యేకించి దగ్గరి బంధువులు మరియు పొరుగువారిలో. అలాగే కొంతమందిలో విబేధాలు, విరోధాలు కారణంగా బంధాలు దెబ్బతిని ఉంటాయి, దూరాలు పెరిగి ఉంటాయి. ఈ సమస్యలకు ఈ బహుమానాలు అనేవి చాలా మంచి పరిష్కారం. ఈ బహుమానాలు, కానుకలు అనేవి మనస్సులలోని ద్వేషాలను, వైరాలను దూరం చేస్తాయి, బంధుత్వాలలో కొత్త ఆశలను చిగురింపజేస్తాయి, మనస్సులను శుద్ధపరుస్తాయి. ఎవరైతే అల్లాహ్ యొక్క సంతుష్ఠత నిమిత్తం బహుమానాలు, కానుకలు ఇస్తారో వారికి అల్లాహ్ తన అత్యున్నతమైన ఫలితాలను నొసంగుతాడు.
ఆయిషా(ర) వారి ఉల్లేఖనం : “దైవప్రవక్త(స) వారు కానుకలను స్వీకరించేవారు మరియు ఆ బహుమానాలకు బదులు కూడా ఇచ్చేవారు”. (అల్-బుఖారీ 2585).
ఇబ్ను అబ్బాస్(ర) వారి ఉల్లేఖనం : దైవప్రవక్త(స) వారు ప్రజలందరిలోకెల్ల అత్యంత ఎక్కువగా దానగుణము కలిగి ఉండేవారు, ప్రత్యేకించి రమదాను మాసములో వారి వద్దకు జిబ్రయీలు దైవదూత వచ్చే సందర్భములో ఈ ధాతృత్వం అనేది అత్యంత ఎక్కువగా ఉండేది. పరస్పరం పారాయణం ద్వారా ఖురాను యొక్క పునశ్చరణ చేయడానికి జిబ్రయీల్ వారు రమదాను మాసములోని ప్రతి రేయి వారి(స) వద్దకు వచ్చేవారు, ఈ సమయంలో ప్రవక్త(స) వారు వర్షానికి మునుపు కరుణను సూచిస్తూ స్వేచ్ఛగా వీచే గాలిలా తన ధాతృత్వాన్ని అపారముగా ప్రదర్శించేవారు. (బుఖారీ 6, ముస్లిం 2308).
విరాళములోని కీలక అంశాలు
విరాళం ఇచ్చేటపుడు విరాళాన్ని ప్రతిపాదించడం, అనగా ఆఫర్ చేయడం అనేది కీలకమైన అంశము అని ధర్మపండితులు ఏకీభవించారు, అయితే దీనికి చెందిన మరో అంశములో విభేదించారు. అనగా విరాళం అనేది ఆఫర్ తో జరుగుతుంది (విరాళం ఇచ్చే వ్యక్తి నుండి విరాళం ఇస్తున్నట్లు సూచించే అంశం ఏదైనా వెలువడడం), అయితే విరాళంగా ఇచ్చిన ఆ వస్తువు అనేది దాని స్వీకరణ లేదా స్వాధీనం ద్వారానే దాని యాజమాన్య హక్కు అనేది కలుగుతుంది. స్వీకరణ, స్వాధీనం అనేది విరాళము యొక్క ఉద్దేశాన్నిసంపూర్తి చేస్తుంది, అయితే ఇది ఒప్పందాన్ని ఖాయం చేయడం వంటిది కాదు.
విరాళములోని షరతులు
విరాళంగా ఇవ్వబడుతున్న వస్తువు తెలిసి ఉండాలి, తెలియనిది అయి ఉండకూడదు మరియు అలాగే ఆ వస్తువు విభజించబడి పంచబడడం పై ధర్మపండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
బాధ్యతల్లో ఉన్న ఒక అధికారి లేదా ఉద్యోగి నుండి ప్రయోజనం పొందే నిమిత్తం బహుమతులు ఇవ్వడం అనేది నిషిద్దమైన విషయం, ఈ విధంగా బహుమతి ఇవ్వడం మరియు తీసుకోవడం అనేది నిషేదించబడినది ఇలా చేయడం అనేది లంచం అనబడుతుంది, లంచం ఇచ్చేవాడు మరియు తీసుకునేవాడు శపించబడ్డాడు.
.ఒక అధికారి యొక్క అన్యాయం లేదా అపకారం నుండి తనను తాను కాపాడుకోవడానికి, లేదా తనకు రావలసిన హక్కును పొందడానికి బహుమానం ఇవ్వడం అనేది నిషిద్దమైనది, అయితే తన హక్కును కాపాడుకోవడానికి మరియు అతడి అపకారం నుండి రక్షించుకోవడానికి తప్పనిసరి పరిస్తితులో ఇలా చేయడం అనేది అనుమతించబడినది.
అబూ హుమైద్ అల్ సాయిదీ(ర) వారి ఉల్లేఖనం : దైవప్రవక్త(స) వారు జకాతును వసూలు చేయడానికి బనీ అసద్ తెగ నుండి ఇబ్న్ అల్-అతబియా అనే వ్యక్తిని పనికి నియమించారు. అతను (డబ్బుతో) తిరిగి వచ్చి, ప్రవక్త(స)తో ఇలా అన్నాడు "ఇది మీ కోసం మరియు ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది". దానితో దైవప్రవక్త(స) వారు మింబరు పై నిలుచుని ముందుగా అల్లాహ్ ను కీర్తించారు, స్తుతించారు. ఆ తరువాత ఇలా సెలవిచ్చారు : జకాతు వసూలు చేయడానికి మేము నియమించిన వ్యక్తి సంగతి ఏమిటి ? వెళ్లివచ్చి ఇతను ఇలా అంటున్నాడేమిటి ? ఇది నీ కోసం మరియు ఇది నాకు బహుమానంగా ఇవ్వబడినది అని. ఇతను తన తల్లిదండ్రుల ఇంట్లో కూర్చుని చూడవలసినది, ఎవరైనా వచ్చి ఇతనికి బహుమానం ఇచ్చేవారో లేదో తెలిసేది. ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో అతడి పై ప్రమాణం చేసి చెబుతున్నాను : ఎవరైతే అక్రమంగా ఏ వస్తువు తీసుకున్నా ప్రళయ దినాన అతడు దానిని తన మెడలో వేసుకుని తీసుకువస్తాడు. ఒంటె తన శబ్దము చేస్తూ ఉన్న స్థితిలో లేదా ఆవు తన శబ్దము చేస్తూ ఉన్న స్థితిలో లేదా మేక తన శబ్దము చేస్తూ ఉన్న స్థితిలో (తన మెడలో వేసుకుని వస్తాడు). ఆ తరువాత వారు (స) తన రెండు చేతులను పైకి ఎత్తారు, (చేతులను చాలా పైకి ఎత్తడం కారణంగా) మేము వారి చంక యొక్క తెల్లదనాన్ని చూసాము. ఇలా సెలవిచ్చారు: అందరూ జాగ్రత్తగా వినండి నేను మీకు ఈ సందేశాన్ని తెలియజేశానా ? ఇలా మూడు సార్లు అన్నారు. (అల్-బుఖారీ 7174 మరియు ముస్లిం 1832)